Begin typing your search above and press return to search.

పుణె మహిళా ఐఏఎస్ గొంతెమ్మ కోరికలు. బదిలీ చేసిన సర్కారు!

ఆమె గత ఏడాది ఐఏఎస్ సాధించారు.. సరిగ్గా ప్రొబేషన్ కూడా పూర్తి కాలేదు.

By:  Tupaki Desk   |   10 July 2024 10:46 AM GMT
పుణె మహిళా ఐఏఎస్ గొంతెమ్మ కోరికలు. బదిలీ చేసిన సర్కారు!
X

ఆమె గత ఏడాది ఐఏఎస్ సాధించారు.. సరిగ్గా ప్రొబేషన్ కూడా పూర్తి కాలేదు. ఇక ఆమె తండ్రి రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్.. ఆయనకే 40 కోట్ల ఆస్తులున్నాయి. దీంతో ఆయన కుమార్తె క్రిమిలేయర్ కోటా కిందకు వెళ్తారు. అంతేకాదు.. ఆమెకు మానసిక సమస్యలూ ఉన్నాయట.. అసలు దేశంలో అత్యున్నత సర్వీసైన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)లో చేరే వేళ వైద్య పరీక్షలకే హాజరు కాలేదట. అయినా ఆమె ఐఏఎస్ అధికారి అయిపోయారు..? తీరా ఉద్యోగంలో చేరాక.. ఆమె గొంతెమ్మ కోరికలు చూసి ప్రభుత్వానికి చిర్రెత్తింది. ఏకంగా అధికార దుర్వినియోగం చేస్తున్న అంశమై బదిలీ చేసేసింది.

మహారాష్ట్రలో ఇప్పుడు పుణె అసిస్టెంట్ కలెక్టర్‌, ప్రొబేషనరీ ఐఏఎస్ డాక్టర్ పూజా ఖేద్కర్‌ బదిలీ అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. జూనియర్ అధికారి అయిన ఆమె.. ప్రత్యేక వసతులు అందించాలని డిమాండ్‌ చేస్తూ, కాస్త తేడాగా ప్రవర్తిస్తూ వివాదాల్లో చిక్కుకున్నారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే తన అవ్ డి కారుకు రెడ్-బ్లూ బీకన్‌ లైట్లు, వీఐపీ నంబర్ ప్లేట్‌ పెట్టుకోవడం, మహారాష్ట్ర ప్రభుత్వం అనే స్టిక్కర్‌ సైతం అమర్చుకోవడం, తగినంత సిబ్బంది, కానిస్టేబుల్‌ తో అధికారిక ఛాంబర్‌ కావాలంటూ డిమాండ్లు పెట్టడం ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది.

అదనపు కలెక్టర్ చాంబర్ లో..

పుణె అదనపు కలెక్టర్‌ అజయ్‌ మోర్‌ లేని సమయంలో ముందస్తు అనుమతి తీసుకోకుండా ఆయన చాంమబర్‌ పూజా ఖేద్కర్ తన నేమ్‌ప్లేట్‌ పెట్టుకుని తన చాంబర్ గా వాడుకున్నారు. కుర్చీలు, సోఫాలు, టేబుళ్లతో పాటు అన్ని మెటీరియల్స్ తొలగించారు. తన పేరు మీద లెటర్ హెడ్, విజిటింగ్ కార్డ్, పేపర్ వెయిట్, నేమ్‌ప్లేట్, రాజముద్ర, ఇంటర్‌ కామ్ అందించాలని ఆదేశాలిచ్చారు. కాగా, పూజా ఖేద్కర్ తండ్రి రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఆయన కుమార్తెకు సర్దిచెప్పకుండా.. ఆమె డిమాండ్లను తీర్చాలని కలెక్టర్ కార్యాలయ అధికారులను ఒత్తిడి చేశారు. వాస్తవానికి పూజ్ ప్రొబేషనరీ. వీఐపీ ట్రీట్‌ మెంట్, అదనపు సౌకర్యాలేవీ ఈ సమయంలో ఇవ్వరు. ఐఏఎస్‌ లు గెజిటెడ్‌ అయ్యాకే ప్రత్యేక సౌకర్యాలు వస్తాయి. కానీ, పూజా తీరు మాత్రం దానికి భిన్నంగా ఉండడంతో పుణె కలెక్టర్‌ డాక్టర్ సుహాస్ దివాసే విషయాన్ని చీఫ్ సెక్రటరీకి నివేదించారు. దీంతో పూజాను వాషిమ్‌కు బదిలీ చేశారు. అక్కడ ప్రొబేషన్ వరకు సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్‌ గా ఉంటారు. పూజా 2023 బ్యాచ్ ఐఏఎస్. 841వ ర్యాంక్‌ సాధించారు. ఓబీసీ మహిళ కావడంతో ఐఏఎస్ వచ్చింది. కానీ, ఆమె తండ్రికి రూ.40 కోట్ల ఆస్తులు ఉండడంతో నాన్ క్రిమీలేయర్ కోటాలో ఎలా ఎంపిక చేశారనే ప్రశ్నలు వస్తున్నాయి.