Begin typing your search above and press return to search.

పేరుతోపాటు జెండర్ మార్చుకున్న మహిళా ఐఆరెస్స్ ఆఫీసర్!

సాధారణంగా పలు సందర్భాల్లో పేరు మార్చుకోవడం సర్వసాధారణమైన విషయం.

By:  Tupaki Desk   |   10 July 2024 7:23 AM GMT
పేరుతోపాటు జెండర్  మార్చుకున్న మహిళా ఐఆరెస్స్  ఆఫీసర్!
X

సాధారణంగా పలు సందర్భాల్లో పేరు మార్చుకోవడం సర్వసాధారణమైన విషయం. అంతెందుకు... ఇటీవల సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ముద్రగడ పద్మనాభం కాస్తా పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్నారు. అయితే... తాజాగా సివిల్ సర్వీసెస్ లో ఉన్న ఓ మహిళా ఉద్యోగిని తన పేరుతో పాటు జెండర్ ను మార్చాలని కోరారు.. దానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

అవును... తాజాగా సివిల్ సర్వీసెస్ లో ఉన్న మహిళా ఉద్యోగిని తన పేరుతో పాటు జెండర్ కూడా మార్చాలని కోరారు. ఈ మేరకు అన్ని అధికారిక రికార్డ్స్ లోనూ తన పేరు మార్చాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరారు ఈ ఐఆరెస్స్ ఆధికారి. ఈ నేపథ్యంలో తాజాగా అందుకు ప్రభుత్వం ఆమొదం తెలిపింది. భారత సివిల్ సర్వీసెస్ లో ఇలా జరగడం ఇదే తొలిసారని చెబుతున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... హైదరాబాద్ లోని కస్టంస్, ఎక్సైజ్ & సర్వీస్ ట్యాక్స్ అపీలేట్ ట్రిబ్యునల్ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్ గా నియమితులైన 35 ఏళ్ల ఎం అనసూయ... తన పేరుతో పాటు లింగం (జెండర్) కూడా మార్చాలని కోరారు. ఈ సందర్భంగా... తన పేరును ఎం అనుకతిర్ సూర్య గా మార్చాలని, తన జెండర్ ను ఆడ నుంచి మగ కు మార్చాలని అభ్యర్థించారు.

ఈ నేపథ్యంలో అనసూయ అభ్యర్థనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిగణలోకి తీసుకుంది. ఇక నుంచి అధికారికంగా అన్ని రికార్డ్స్ లలోనూ "మిస్టర్ ఎం అనుకతిర్ సూర్య"గా గుర్తించబడతారని ఆర్థిక శాఖ తెలిపింది.

కాగా... మిస్టర్ సూర్య డిసెంబర్ 2013 లో చెన్నైలో అసిస్టెంట్ కమిషనర్ గా తన వృత్తిని ప్రారంభించారని అతని లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ని బట్టి తెలుస్తుంది. ఈ క్రమంలో 2018లో డిప్యూటీ కమిషనర్ ర్యాంక్ కు పదోన్నతి పోందారు. అనంతరం గత ఏడాది హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న పొస్టింగ్ లో చేరారు.