Begin typing your search above and press return to search.

వాట్సప్ గ్రూపు పంచాయితీ.. హైదరాబాద్ మహిళా నేత సూసైడ్ అటెంప్టు!

బంజారాహిల్స్ రోడ్ నెంబరు 12లో ఉన్న ఎన్బీటీ నగర్ బస్తీ పేరుతో రెండు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటయ్యాయి.

By:  Tupaki Desk   |   16 Aug 2024 5:37 AM GMT
వాట్సప్ గ్రూపు పంచాయితీ.. హైదరాబాద్ మహిళా నేత సూసైడ్ అటెంప్టు!
X

ఒక వాట్సప్ గ్రూపు హైదరాబాద్ మహానగరంలోని రాజకీయ వర్గాల్లో రచ్చకు కారణమైంది. ఈ ఇష్యూలో మేయర్ విజయలక్ష్మి ఇరుక్కున్నట్లుగా చెబుతున్నారు. చిలికి చిలికి గాలివానలా మారిన ఈ ఇష్యూలో ఒక మహిళా నేత ఆత్మహత్యాయత్నం చేసుకొని ఆసుపత్రి పాలు అయ్యారు. మరోవైపు ఈ వివాదం పోలీసు కేసుల వరకు వెళ్లింది. అసలేం జరిగిందంటే..

బంజారాహిల్స్ రోడ్ నెంబరు 12లో ఉన్న ఎన్బీటీ నగర్ బస్తీ పేరుతో రెండు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటయ్యాయి. ఇందులో ఎన్ బీటీ నగర్ హౌజ్ ఓనర్స్ అసోసియేషన్ పేరుతో స్థానికంగా ఉండే రాజు అనే వ్యక్తి గత నెలలో ఏర్పాటు చేశారు. ఇందులో 850 మంది సభ్యులు ఉన్నారు. ఎన్బీటీ నగర్ ఓనర్స్ అసోసియేషన్ పేరుతో మరో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటైంది. అందులో స్థానిక కార్పొరేటర్.. మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు ఆమె అనుచరులు ఉన్నారు.

ఎన్ బీటీ నగర్ ప్రభుత్వ పాఠశాల వద్ద అక్రమ పారర్కింగ్ లు.. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా రాజు ఆధ్వరంలో ఏర్పాటైన వాట్సాప్ గ్రూప్ ట్రాఫిక్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో.. అక్కడ నో పార్కింగ్ బోర్డును ఏర్పాటు చేశారు. పంద్రాగస్టు వేళ జాతీయజెండా ఎగురవేయటానికి వచ్చిన మేయర్ విజయలక్ష్మి నో పార్కింగ్ బోర్డును కాలితో తన్నారని.. ఎదుటి గ్రూపు సభ్యులను దూషించినట్లుగా పేర్కొంటూ రాజు బంజారాహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు.

తమ గ్రూపు సభ్యుల్లో ఒకరి ఇంటిపైకి వెళ్లిన మేయర్ అనుచరులపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ లో పేర్కొన్నారు. అదే బస్తీకి చెందిన పావని శర్మ సైతం గ్రూపులో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఆరోపించారు. ఇదిలా ఉంటే ఎన్ బీటీనగర్ రెండో బంగ్లాదేశ్ గా మారబోతుందని చేసిన వ్యాఖ్యలపై కూడా మేయర్ అనుచరులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. తమ ఇంటిపైకి మేయర్ అనుచరులు రావటాన్ని తీవ్రంగా పరిగణించిన పావనిశర్మ మనస్తాపానికి గురై నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.

దీన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు మేయర్ అనుచరులతే పూర్తి బాధ్తయ అంటూ పావనిశర్మ వాట్సప్ గ్రూపులో పేర్కొంటూ.. బంజారాహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ వివాదంపై స్పందించిన మేయర్.. తనను అసభ్యకరంగా దూషిస్తూ పావనిశర్మ గ్రూపులో పెట్టిన పోస్టుపై అడిగేందుకే తమ కార్యకర్తలు వెళ్లారే తప్పించి మరొకటి లేదన్న ఆమె.. ఇప్పటికే ఈ ఇష్యూ మీద పోలీసులకు కంప్లైంట్ చేసినట్లు పేర్కొన్నారు. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు రచ్చ రచ్చగా మారింది.