Begin typing your search above and press return to search.

పోలీస్‌ స్టేషన్‌ కు తాళం వేసిన మహిళ... కళ్లు తిరిగి పడిపోయిన సీఐ!

ఈ సమయంలో... పలుమార్లు పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి తనకు న్యాయం చేయాలని, పరిస్థితిని అర్ధం చేసుకోవాలని కోరినా పోలీసులు స్పందించలేదని ఆమె చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   18 Oct 2023 5:44 AM GMT
పోలీస్‌  స్టేషన్‌  కు తాళం వేసిన మహిళ... కళ్లు తిరిగి పడిపోయిన సీఐ!
X

తాజాగా విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగిన ఒక అద్దె ఇంటి వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంలో పోలీసుల తీరుతో విసుగుచెందిన ఒక మహిళ పోలీస్ స్టేషన్ కు తాళం వేయడంతో ఈ విషయం తీవ్ర సంచలనం రేపింది. స్టేషన్ సీఐ కళ్లుతిరిగి పడిపోయి హాస్పటల్ కు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఏమిటీ వ్యవహారం.. మేటర్ ఎందుకంత సీరియస్ అయ్యింది అనేది ఇప్పుడు చూద్దాం!

విశాఖ నగరంలోని ఎన్‌ఏడీ ఫ్లైఓవర్ సమీపంలోని బాజీ కూడలి ప్రాంతానికి చెందిన ఒక మహిళ (42) భర్తతో వేరుపడి జీవీఎంసీ 95వ వార్డు కృష్ణరాయపురంలో ఓ అపార్టుమెంటులో ఆరేళ్లుగా కుమారుడు, కుమార్తెతో కలిసి అద్దెకు ఉంటున్నారు. ఇంటింటికీ వెళ్లి దుస్తులు అమ్ముతూ ఆమె ఉపాది చేస్తున్నారు! ఈ క్రమంలో ఒకరోజు ఆమె వద్దకు వచ్చిన ఇంటి యజమాని... ఇంటిని అమ్మేస్తున్నానని, ఖాళీ చేయాలని తెలిపారు.

దీంతో... ఆ ఇంటిని తానే కొనుక్కుంటానని ఆమె ముందుకు వచ్చారు. ఇలా రూ.12.5 లక్షలకు కొనేందుకు ముందుకొచ్చిన ఆమె ఈ ఏడాది మే నెలలో రూ.5లక్షలు అడ్వాన్సు చెల్లించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో మరళా కొన్ని రోజులుగా ఆమెను ఇల్లు ఖాళీచేయాలని ఒత్తిడి చేస్తున్నరంట ఇంటి యజమాని! దీంతో... గతంలో ఇచ్చిన అడ్వాన్సు తిరిగి చెల్లిస్తే ఇంటిని ఖాళీ చేస్తానని ఆమె చెప్పారట.

ఈ క్రమంలో... సెప్టెంబర్ 25న ఆమె ఇంట్లో లేని సమయంలో ఆ ఇంటి యజమాని తనతోపాటు మరో అయిదుగురు వచ్చి ఆమె కుమార్తెను దూషిస్తూ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారట. ఆ విషయం కాసేపటికి సద్దుమణిగిందని తెలుసుంది. అనంతరం ఈ నెల 13న మరోసారి ఆ ఇంటి యజమాని, అతని కుటుంబసభ్యులు వచ్చి ఆమెను, ఆమె కుమార్తెను బయటకు తోసేసి ఇంట్లోని సామగ్రిని బయట పారేసి ఇంటికి తాళం వేశారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

దీంతో దీంతో అదేరోజు ఆమె వెళ్లి పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో... ఆ ఇంటియజమానితోపాటు అయిదుగురిపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ క్రమంలో ఇంటికి తాళం వేసినా ఆమె తమ కుమార్తెతో కలిపి వరండాలోనే ఉంటున్నారు. ఈ సమయంలో... పలుమార్లు పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి తనకు న్యాయం చేయాలని, పరిస్థితిని అర్ధం చేసుకోవాలని కోరినా పోలీసులు స్పందించలేదని ఆమె చెబుతున్నారు.

దీంతో పోలీసులది నిర్లక్ష్య వైఖరి అని ఆవేదన చెందారో.. లేక, ఆగ్రహం తెచ్చుకున్నారో తెలియదు కానీ... తాజాగా నిన్న (మంగళవారం) రాత్రి 7 గంటల సమయంలో పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లిన ఆమె ఆ స్టేషన్ గేటుకు తాళం వేసింది. దీంతో అవాక్కవ్వడం పోలీసుల రెస్పాండ్ అయ్యారు. ఇందులో భాగంగా... ఆమెను తీసుకుని సీఐ, ఎస్సై, సిబ్బంది కలిసి కృష్ణరాయపురంలోని అపార్టుమెంటు వద్దకు తరలివెళ్లారు.

అనంతరం ఇంటి యజమాని, వారి కుటుంబసభ్యులతో మాట్లాడి వెంటనే ఆమె సామగ్రిని ఇంట్లో పెట్టించి తాళాలు అప్పగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా.. ఆమె తప్పుడు ఒప్పంద పత్రాలతో తమను వేధిస్తున్నారని ఇంటి యజమాని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇల్లు ఖాళీ చేయామని గత కొన్ని నెలలుగా చెబుతున్నా కూడా వినిపించుకోకుండా తమపై అక్రమ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

ఇలా ఇరువర్గాల మధ్య వాగ్వాదం బలంగా చోటుచేసుకోవడంతో సీఐ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. దీంతో పోలీసు వాహనం వద్ద నీళ్లు తాగుతూ కళ్లు తిరిగి పడిపోయారు. పరిస్థితి గమనించిన సిబ్బంది వెంటనే జీపులో ఆయనను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో... వైద్యులు ప్రథమ చికిత్స అందించడంతో ప్రస్తుతం సీఐ కోలుకున్నారని తెలుస్తుంది.