Begin typing your search above and press return to search.

దారుణాతి దారుణం: మహిళా మంత్రికి డ్ర‌గ్స్ ఇచ్చి... అత్యాచారం ఎక్క‌డంటే!

భార‌త్‌వంటి దేశాలు మ‌రింత ముందుకు వెళ్లి.. క‌ఠిన‌మైన చ‌ట్టాలు కూడా చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   5 May 2024 9:45 AM GMT
దారుణాతి దారుణం: మహిళా మంత్రికి డ్ర‌గ్స్ ఇచ్చి... అత్యాచారం ఎక్క‌డంటే!
X

దారుణం అనుకునే సంఘ‌న‌లు త‌ర‌చుగా మ‌న‌కు క‌నిపిస్తూనే ఉంటాయి. అయితే.. ఇది దారుణాతి దారుణ‌మైన ఘ‌ట‌న‌.. ఏకంగా మహిళా మంత్రిని అపహరించి, డ్రగ్స్ ఇచ్చి రాత్రంతా అత్యాచార చేసిన ఘ‌ట‌న ఇప్పుడు ప్ర‌పంచాన్ని కుదిపేస్తోంది. ఒక‌వైపు ప్ర‌పంచ దేశాల‌న్నీ.. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు పెద్ద పీట వేస్తున్నామ‌ని చెబుతున్నాయి. భార‌త్‌వంటి దేశాలు మ‌రింత ముందుకు వెళ్లి.. క‌ఠిన‌మైన చ‌ట్టాలు కూడా చేస్తున్నాయి. ఇక‌, అభివృద్ధి చెందిన దేశాల్లో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ‌కు పెద్ద‌పీట వేస్తున్న విష‌యం వాస్త‌వం.

అయినా.. కూడా అత్యాచారాలు, అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. ఏకంగా మ‌హిళా మంత్రిని అప‌హ‌రించి.. ఆమెకు డ్ర‌గ్స్ ఇచ్చి.. ఆపై దారుణాతిదారుణంగా అత్యాచారానికి ఒడిగ‌ట్టిన ఘ‌ట‌న ఆస్ట్రేలియాలో జ‌రిగింది. ఇక్క‌డ నిరుద్యోగం, నిర‌క్ష‌రాస్య‌త వంటివి చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. అయినా.. కూడా.. అఘాయిత్యం జ‌ర‌గ‌డం ప్ర‌పంచ దేశాల‌ను నివ్వెర ప‌రుస్తున్నాయి. దీనిపై ప్ర‌పంచ వ్యాప్తంగా నిర‌స‌న‌, ఆవేద‌న‌.. ఆందోళ‌న అన్నీ వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఏం జ‌రిగింది.

ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ్రిట్నీ లౌగా విజ‌యం ద‌క్కించుకు న్నారు. ఈమె అధికార పార్టీకి చెందిన ఎంపీ. దీంతో మ‌హిళా కోటాలో ఆరోగ్య శాఖ స‌హాయ మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ.. నియోజ‌క‌వ‌ర్గంలోని ఎప్పూన్ ప్రాంతంలో నివ‌సిస్తున్న ఈమెను ఏప్రిల్ 28న కొంద‌రు దుండ‌గులు అప‌హ‌రించారు. ఆమెకు మ‌త్తు మందు ఇచ్చారు. డ్ర‌గ్స్ అని తెలుస్తోంది. అనంత‌రం.. ఆ రాత్రి ఆమెపై వారు ప‌దే ప‌దే అత్యాచారం చేశారు.

మ‌త్తు నుంచి తేరుకున్నాక‌.. విష‌యం గ్ర‌హించిన ఆమె.. స్తానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వైద్య ప‌రీక్ష‌ల్లోనూ ఇది నిజ‌మేన‌ని తేలింది. దీంతో ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం హుటాహుటిన దీనిపై ద‌ర్యాప్తు చేప‌ట్టింది. ఇక‌, త‌న బాధ‌ను ఆమె ఇన్ స్టాలో వెల్ల‌డించారు. తన సొంత‌ నియోజకవర్గంలోని ఎప్పూన్‌లో ఈ ఘటన జ‌రిగింద‌ని లౌగా వెల్ల‌డించారు. మంత్రి అయిన త‌న‌కే ఇలా జరిగితే.. సామాన్యులకు ఎందుకు జరగదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్ర‌పంచ దేశాలు కూడా నివ్వెర పోతున్నాయి.