Begin typing your search above and press return to search.

వారానికి నాలుగు రోజులే పని... వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

అవును... ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయాలని జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By:  Tupaki Desk   |   31 Aug 2024 10:30 PM GMT
వారానికి నాలుగు రోజులే పని... వారికి గుడ్  న్యూస్  చెప్పిన ప్రభుత్వం!
X

వారంలో ఏడు రోజులూ పనిచేయాల్సిన పరిస్థితి కొంతమందికి ఉంటే.. ఆరు రోజులు పనిచేసి, ఆదివారం పూట కాస్త విశ్రాంతి తీసుకునే అవకాశం చాలా మందికి ఉంటుంది! ఇక ఐటీ రంగంలో ఉన్నవారికైతే.. వారంలో ఐదు రోజులు మాత్రమే పని దినాలు! అయితే తాజాగా వారిని నాలుగు రోజులు మాత్రమే పని చేయాలంటూ ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది.

అవును... ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయాలని జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని అన్ని సంస్థల్లోనూ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో... ఇప్పుడు ఈ నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. దీనివల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతూ పిల్లల పెంపకంపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది.

వాస్తవానికి ఈ విధానాన్ని 2021లోనే అమలు చేయాలని జపాన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలూ జారీ చేసింది. అయితే... చాలా సంస్థలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి.. దీనివల్ల అభివృద్ధిలో కాలక్రమేణా జపాన్ వెనుకపడే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశాయి. అప్పట్లో 10శాతంలోపు సంస్థలే ఈ విధానాలను పాటించాయి.

ఈ నేపథ్యంలో తాజాజా ప్రభుత్వం మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా మిగిలిన అన్ని సంస్థలూ తమ ఉద్యోగులతో వారానికి 4రోజుఏ పని చేయించుకోవాలని తాజా పేర్కొంది. ఫలితంగా... ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని.. నిరుద్యోగిత రేటు కొంతైనా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

ఈ విధానాన్ని టోక్యోలోని అకికో యెకోహోమా అనే సంస్థ ఇప్పటికే పాటిస్తోంది. ఈ మేరకు తమ ఉద్యోగులకు శని, ఆదివారాలతో పాటు బుధవారం కూడా సెలవు ఇస్తోంది. దీనివల్ల ఉద్యోగులు ఒత్తిడికి గురి కాకుండా చురుగ్గా పనిచేస్తున్నట్లు సదరు యాజమాన్యం చెబుతుంది. ఉద్యోగుల పని వేగంలోనూ మెరుగైన మార్పు వచ్చిందని వెల్లడించింది.