Begin typing your search above and press return to search.

వర్కింగ్‌ ఏజ్‌ పీపుల్‌ తగ్గుదల... ఈ ప్రమాదం భారత్ కు ఉందా?

అవును... ఏ దేశంలోనైనా వర్కింగ్‌ ఏజ్‌ పీపుల్‌ సరిపడా ఉండి.. దానికి ఇతర కారణాలు కూడా తోడైతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతోంది

By:  Tupaki Desk   |   23 May 2024 11:30 AM GMT
వర్కింగ్‌ ఏజ్‌ పీపుల్‌ తగ్గుదల... ఈ ప్రమాదం భారత్ కు ఉందా?
X

ఒక దేశం ప్రస్తుతం ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందినా.. ప్రపంచంతో పోటీపడి ఎంత ముందుకు పోతున్నా.. పనిచేసే వయసు కలిగిన ప్రజలు (వర్కింగ్‌ ఏజ్‌ పీపుల్‌) సరిపడా లేకపోతే ఆ దేశం సరికొత్త సమస్యలను ఎదుర్కోవడంతోపాటు అభివృద్ధిలో, ఆర్థిక ప్రగతిలో తిరోగమనం బాట పట్టే ప్రమాదాలు లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో భారత్ లో ఈ ప్రమాదం ఎంత ఉందనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... ఏ దేశంలోనైనా వర్కింగ్‌ ఏజ్‌ పీపుల్‌ సరిపడా ఉండి.. దానికి ఇతర కారణాలు కూడా తోడైతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతోంది. అలా కాకుండా... ఇతర కారణాలు బాగున్నప్పటికీ వర్కింగ్‌ ఏజ్‌ ప్రజలు సరిపడా లేకపోతే మాత్రం సమస్యలు తప్పవని అంటున్నారు నిపుణులు. ఈ సందర్భంగా జపాన్, దక్షిణ కొరియా, చైనా లతోపాటు భారత్ లోని పరిస్థితులను ప్రస్థావిస్తున్నారు.

వాస్తవానికి జపాన్ లో మూడొంతుల జనాభా కేవలం నగరాల్లోనే నివసిస్తోంది. దానికి సమీపంలోని మరో ఆధునిక ఆర్థికవ్యవస్థ దక్షిణ కొరియాలో జనాభా పెరుగుదల రేటు రోజురోజుకు తగ్గిపోతుంది. ఈ రెండు దేశాల్లోనూ సంతాన సాఫల్య రేటును పెంచడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి అని అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకొవచ్చు.

తాజాగా ఈ విషయాలపై స్పందించిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యెవల్‌... గత 65 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక స్థానాలుగా ఎదిగిన జపాన్, దక్షిణ కొరియాలు ఒకేరకమైన ప్రత్యేక సమస్యలతో ఇబ్బందిపడుతున్నాయని తెలిపారు. టాప్ 5 అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో జపాన్ 4వ స్థానంలో ఉండగా.. టాప్ 20 అగ్రస్థాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో దక్షిణ కొరియా 14వ స్థానంలో ఉంది.

ఆ సంగతి అలా ఉంటే... ఈ రెండు అభివృద్ధి చెందిన దేశాల్లోనూ జనాభా పెరుగుదల ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. కీలకమైన సంతాన సాఫల్య రేటు బాగా తగ్గిపోవడం ఈ రెండు దేశాలను సంక్షోభాల వైపునకు నడిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు ఆర్థికంగా దూసుకుపోతున్న చైనాలో కూడా సంతాన సాఫల్య రేటు ఘననీయంగా తగ్గిపోవడం అక్కడ పాలకులను ఆందోళన కలిగిస్తోంది.

ఇదే క్రమంలో... భారత్‌ లోనూ భవిష్యత్తులో సంతాన సాఫల్య రేటు కాస్త ఆందోళన కలిగించే స్థాయికి చేరే అవకాశం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. పారిశ్రామికాభివృద్ధి సాధించిన అనేక యూరప్‌ దేశాలకు కూడా ఇదే ప్రధాన సమస్యగా ఉందని.. యువ జనాభా బాగా తగ్గిపోవడం పాశ్చాత్య దేశాలకు చాలా ఏళ్ల కిందటి నుంచే పెద్ద ఇబ్బందిగా మారిందని నిపుణులు చెబుతున్నారు.

అయితే... అమెరికాతో పాటు కొన్ని పశ్చిమాసియా దేశాల్లో సంతాన సాఫల్య రేటు ఆందోళన కలిగించేలా ఉన్నప్పటికీ... అక్కడ వలస వచ్చి స్థిరపడుతున్న ప్రజలవల్ల ఈ సమస్యకు కొంత ఉపశమనం కలుగుతోందని అంటున్నారు. అయితే ఇలాంటి విధానాలు లేని జపాన్, దక్షిణ కొరియాకు మాత్రం ఇబ్బందులు తప్పడంలేదని చెబుతున్నారు. ఈ సమయంలో... అభివృద్ధి చెందిన దేశాల్లో వర్కింగ్‌ ఏజ్‌ జనాభా సరిపడా ఉండేలా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు!