పాక్‌లో వెటరన్ స్టార్ల ఇళ్లకు ప్రపంచ బ్యాంక్ లోన్
పాకిస్తాన్ లో జాతీయ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించిన బాలీవుడ్ లెజెండ్స్ దిలీప్ కుమార్ , రాజ్ కపూర్‌ల పూర్వీకుల గృహాల పరిరక్షణకు ప్రపంచ బ్యాంక్ నిధులు మంజూరు చేస్తుందని పాకిస్తాన్ అధికారులు శుక్రవారం తెలిపారు.
By: Tupaki Desk | 15 Dec 2024 3:40 AM GMTపాకిస్తాన్ లో జాతీయ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించిన బాలీవుడ్ లెజెండ్స్ దిలీప్ కుమార్ , రాజ్ కపూర్‌ల పూర్వీకుల గృహాల పరిరక్షణకు ప్రపంచ బ్యాంక్ నిధులు మంజూరు చేస్తుందని పాకిస్తాన్ అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫిజికల్ పనులు నాలుగు నెలల్లో రూ. 200 మిలియన్ల ప్రాథమిక బడ్జెట్ కేటాయింపుతో ప్రారంభం కానున్నాయి అని ఆర్కియాలజీ డైరెక్టర్ డాక్టర్ అబ్దుస్ సమద్ తెలిపారు. ప్రపంచ బ్యాంకు `ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ఇంటిగ్రేటెడ్ టూరిజం డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్` నుండి నిధులు వస్తాయని ఆయన చెప్పారు.
వరల్డ్ బ్యాంక్ నిధులతో ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రభుత్వ ప్రాజెక్ట్ పర్యాటక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టడానికి ఈ ప్రావిన్స్‌లో ఆర్థిక అభివృద్ధి కోసం ఏర్పాటు అని అధికారులు తెలిపారు. పరిరక్షణ పనిలో భాగంగా చారిత్రక ప్రదేశాలను వాటి అసలు రూపంలోకి పునరుద్ధరించడం, చారిత్రాత్మక ఖిస్సా ఖ్వానీ బజార్‌లో ఉన్న రెండు ఇళ్లలో అత్యాధునిక మ్యూజియంలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు దిలీప్ కుమార్ - రాజ్ కపూర్ చేసిన సేవలపై అవగాహన పెంచడానికి ఈ మ్యూజియంలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
రాజ్ కపూర్ హవేలీ ఢక్కీ దల్గారన్ ప్రాంతంలో ఉండగా, దిలీప్ కుమార్ పూర్వీకుల నివాసం మొహల్లా ఖుదాదాద్‌లో ఉంది. రెండు ప్రాపర్టీలు కిస్సా ఖ్వానీ బజార్ కు అర మైలు కంటే తక్కువ దూరంలో ఉన్నాయి.
ఖైబర్ పఖ్తుంఖ్వా డైరెక్టరేట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ 2021లో ఈ పూర్వీకుల గృహాలను స్వాధీనం చేసుకుంది. వాటి యాజమాన్యం చట్టబద్ధంగా ప్రాంతీయ ప్రభుత్వానికి బదిలీ అయింది. ఇద్దరు లెజెండ్‌ల కుటుంబ సభ్యులను సంప్రదించాలని డైరెక్టరేట్ యోచిస్తోందని పాక్ అధికారి సమద్ చెప్పారు. పునరుద్ధరణ చేయడం ద్వారా.. బాలీవుడ్‌తో పెషావర్‌కు ఉన్న చారిత్రక సంబంధాన్ని కాపాడుకోవడం.. ఈ సినిమా చిహ్నాల వారసత్వాన్ని జరుపుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది.