Begin typing your search above and press return to search.

కదులుతున్న మంచుకొండ.. సైజు రెండు లండన్స్ అంత.. డ్యామేజ్?

ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ సుమారు 30 ఏళ్లుగా కదులుతూ.. ఇప్పుడు సరికొత్త టెన్షన్ పెడుతోంది.

By:  Tupaki Desk   |   27 Jan 2025 10:30 AM GMT
కదులుతున్న మంచుకొండ.. సైజు రెండు లండన్స్ అంత.. డ్యామేజ్?
X

ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ సుమారు 30 ఏళ్లుగా కదులుతూ.. ఇప్పుడు సరికొత్త టెన్షన్ పెడుతోంది. ఒకప్పుడు సముద్రం అడుగున, తర్వాత సముద్రం పైభాగానికి వచ్చి కదులుతున్న ఈ మంచుకొండ.. బ్రెజిల్ కు సమీపంలో ఉందనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది భూభాగాన్ని తాకితే పరిస్థితి ఏమిటనేది ఆందోళనగా ఉంది.

అవును... జార్జియా ఐలాండ్ ను ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ ఢీకొట్టనుంది. ఇది ముంబై లాంటి ఆరు నగరాలతో, రెండు లండన్ నగరాల కంటే ఎక్కువ సైజు ఉందని చెబుతున్నారు. ఈ స్థాయిలో ఉన్న మంచుకొండ ఇంతకాలం సముద్రాన్నే అంటిపెట్టుకుని ఉండగా.. ఇప్పుడు భూభాగం వైపు తన దిశను మార్చుకుందని చెబుతున్నారు.

తాజాగా ఈ విషయాలపై స్పందించిన బ్రిటీష్ భౌతిక సముద్ర శాస్త్రవేత్త (ఫిజికల్ ఓషియనోగ్రాఫర్) ఏ23ఏ అని పిలవబడే ఈ మంచుకొండ దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలోని బ్రిటీష్ ఓవర్సీస్ టెరిటరీ అయిన దక్షిణ జార్జియా వైపు ప్రవాహంతో కదులుతుందని తెలిపారు. ఈ సందర్భంగా యూఎస్ నేషనల్ ఐస్ సెంటర్ చెప్పిన కొలతలను వివరించారు.

ఇందులో భాగంగా... గత ఏడాది ఆగస్టులో కొలిచినప్పుడు ఈ మంచుకొండ సైజు 3,672 చదరపు కిలోమీటర్లు (1,418 చదరపు మైళ్లు) విస్తీర్ణంలో ఉందని.. రోడ్ ఐలాండ్ కంటే కొంచెం చినంగా, లండన్ కంటే రెండింతలు ఎక్కువగా ఉందని తెలిపారు. ఇదే సమయంలో దీని బరువు కొన్ని ట్రిలియన్ టన్నులు ఉండొచ్చని చెబుతున్నారు.

ఈ సమయంలో.. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ మంచుకొండ జార్జియా ద్వీపాన్ని ఢీకొడితే జరగబోయే ప్రమాదం అత్యంత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మరో రెండు నుంచి నాలుగు వారాల్లో జార్జియాకు సమీపంగా రావొచ్చని అంటుననరు. దిశ మార్చుకునే అవకాశాన్ని కొట్టివేయలేమని చెబుతున్నారు.

మరోపక్క ఇది దక్షిణ జార్జియాకు సమీపంలో ఉంటే.. అది ద్వీపంలో తమ పిల్లలను పెంచే సీల్స్, పెంగ్విన్ ల ఆహర విధానాలకు అంతరాయం కలిగింవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే ఇవి బర్డ్ ఫ్లూ వ్యాప్తి కారణం సవాళ్లను ఎదుర్కొంటున్నాయని.. ఏ23ఏ రాక ఈ పరిస్థితిని మరింత దిగజార్చొచ్చని అంచనా వేస్తున్నారు.