Begin typing your search above and press return to search.

విమానం హైజాక్.. అందులో కరెన్సీ కింగ్.. ఉన్మాద ఉగ్రవాదులు ఏంచేశారు?

1999 డిసెంబరు 24న ఖాట్మండు-ఢిల్లీ విమానం హైజాక్ అయింది.

By:  Tupaki Desk   |   11 Sep 2024 12:30 PM GMT
విమానం హైజాక్.. అందులో కరెన్సీ కింగ్.. ఉన్మాద ఉగ్రవాదులు ఏంచేశారు?
X

అది చిక్కటి చలికాలం.. అందులోనూ హిమాలయ దేశం నేపాల్ రాజధాని ఖాట్మండు.. అక్కడినుంచి ఓ భారత విమానం (ఐసీ 814) ఢిల్లీకి బయల్దేరింది.. ప్రయాణికుల్లో హనీమూన్ ముగించుకున్న ఓ యువ భారత జంట కూడా ఉంది.. అంతా సవ్యంగా జరిగి ఉంటే ఆ విమానం ఢిల్లీకి రావాలి. కానీ.. పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు హైజాక్ చేశారు. చివరకు అఫ్ఘానిస్థాన్ లోని కాందహార్ కు తీసుకెళ్లారు. అక్కడి కొన్ని రోజుల పాటు డ్రామా నడిచింది. భారత్ అరెస్టు చేసిన భయంకర ఉగ్రవాదులను విడిపించుకుని.. విమానాన్ని విడిచిపెట్టి వారు తమ పంతం నెగ్గించుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ మీద ఇటీవల సినిమా కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇందులో ఓ ఆసక్తికర అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

ఆ విమానంలో కుబేరుడు

1999 డిసెంబరు 24న ఖాట్మండు-ఢిల్లీ విమానం హైజాక్ అయింది. ఇందులోని కొందరు ప్రయాణికులు ఉగ్రవాదుల మీద తిరగబడే ప్రయత్నం చేశారు. కానీ.. వారిని కొట్టి తిట్టి అరవకుండా చేశారు. అయితే, ఉన్మాదమే తప్ప ఆలోచన కొంత కూడా లేని ఉగ్రవాదులు ఓ ప్రయాణికుడి గురించి మాత్రం వారు పట్టించుకోలేదు. కనీసం కాస్త బుర్ర పెట్టినా అప్పటి పరిస్థితి వేరుగా ఉండేది. ఎందుకంటే.. హైజాక్ చేసిన విమానంలో.. ప్రపంచంలో వినియోగించే 90 శాతం నోట్లను ముద్రించేందుకు మెటీరియల్‌ సరఫరా చేసే ఓ బడా వ్యాపారి కూడా ఉన్నారు. అతడి పేరు రాబర్టో గియోరి. అసలు ఆయన హైజాక్ అయిన విమానంలో ఉన్నట్లు తెలిస్తే 70 దేశాలు అల్లకల్లోలం అయ్యేవి. స్విట్జర్లాండ్ -ఇటాలియన్‌ వ్యాపారవేత్త అయిన

గియోరి.. ‘డె లా ర్యూ’ అనే సంస్థకు యజమాని. ఇది ప్రపంచంలో వాడే 90 శాతం కరెన్సీ నోట్ల ముద్రణకు అత్యంత ముఖ్యమైన మెటీరియల్‌ సరఫరా చేస్తుంది. 70పైగా దేశాలకు ఈ సంస్థ మెటీరియల్‌ వాడే ప్రింటింగ్‌ చేసేవారు. గియోరి.. స్విట్జర్లాండ్ లో అత్యంత ధనవంతులు కూడా.

భార్య క్రిస్టినా కలాబ్రెసితో కలిసి ఖాట్మండు వెళ్లిన ఆయన హైజాక్ లో చిక్కుకున్నారు.

ఉగ్రవాదులు.. 200 మిలియన్ డాలర్లు

సరిగ్గా 25 ఏళ్ల కిందట జరిగిన హైజాక్ లో ఉగ్రవాదులు కొన్ని డిమాండ్లు పెట్టారు. భారత్ అరెస్టు చేసిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల విడుదలతో పాటు 200 మిలియన్ డాలర్లు కోరారు. అయితే, తమ ఆధీనంలోని విమానంలోనే అపర కుబేరుడు ఉన్నారని పసిగట్టలేకపోయారు. ప్రపంచంలోని అత్యధిక శాతం దేశాలకు కరెన్సీ సరఫరా చేసే వ్యక్తి ఇతడే అని తెలిస్తే ఇంకెంత డిమాండ్ చేసేవారో కానీ.. వారి కళ్లు ఉన్మాదంతో పూడుకుపోవడంతో గుర్తించలేకపోయారు. మరోవైపు విమానాన్ని తొలుత అమ్రత్ సర్, లాహోర్, దుబాయ్ కి తీసుకెళ్లి చివరకు తాలిబన్ల ఆధీనంలోని కాందహార్ లో ల్యాండ్ చేశారు.

హర్కతుల్ ఉగ్రవాదుల పనే

హర్కతుల్ ముజాహిదీన్ కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హైజాక్ కు పాల్పడ్డారు. మసూద్ అజహర్ మరో ఇద్దరు ఉగ్రవాదులను కశ్మీర్ జైలు నుంచి విడిపించుకున్నాక వారం రోజుల తర్వాత 1999 డిసెంబరు 31న విమానాన్ని వదిలేశారు. కాగా, విమానంలో గియోరి ఉండడంతో

ఉగ్రవాదుల డిమాండ్లను ఆమోదించాలంటూ భారత్‌ పై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగింది. ఇక స్విట్జర్లాండ్‌ ఆయన కోసం ఓ బృందాన్నే కాందహార్ కు పంపింది.

నోట్లలోని థ్రెడ్ ఆయన సంస్థదే..

కరెన్సీ నోట్లపై ఉండే రహస్య థ్రెడ్‌, సెక్యూరిటీ హోలోగ్రామ్‌ ‘డె లా ర్యూ’నే తయారు చేస్తుంది. 2016 వరకు భారత్‌ కూ సరఫరా చేసింది. 2010 తర్వాత వాటర్‌ మార్క్‌ పేపర్‌ లో లోపాలు బయటపడడంతో బ్లాక్‌ లిస్ట్‌ లో పెట్టారు.

190 మంది (ఐదుగురు హైజాకర్లు, 179 మంది ప్యాసింజర్లు సహా) ఉన్న విమానంలో 27 మందిని దుబాయ్ లో విడుదల చేశారు ఉగ్రవాదులు. వీరిలో కత్తిపోట్లతో గాయపర్చడంతో తీవ్ర అస్వస్థతకు గురయిన ఓ పురుష ప్రయాణికుడూ ఉన్నారు. ఇక 190 మందిలో ఒక్కరే చనిపోయారు. అతడే.. పైన చెప్పుకొన్న హనీమూన్ జంటలోని వ్యక్తి. విమానంలో అతడు తిరగబడడంతో ఉగ్రవాదులు కాల్చివేశారు.