Begin typing your search above and press return to search.

12రోజులు.. 100 కిలోమీటర్లు..! ట్రాఫిక్‌లోనే వాహనదారులు

దాదాపుగా దేశ, రాష్ట్ర రాజధానుల్లో ఇలాంటి ట్రాఫిక్ కష్టాలు కనిపిస్తూ ఉంటాయి.

By:  Tupaki Desk   |   6 Sep 2024 2:30 PM GMT
12రోజులు.. 100 కిలోమీటర్లు..! ట్రాఫిక్‌లోనే వాహనదారులు
X

పెద్ద పెద్ద నగరాల్లో ట్రాఫిక్ జామ్ కామన్. అది కూడా ఐదు లేదా పది నిమిషాలు.. మహా అయితే ఓ గంట. ఆ గంటపాటు ట్రాఫిక్‌లో ఉండాలంటే కూడా గగనమే. అంత ఓపిక కానీ.. అంత టైమ్ కానీ ఉండదు. అయితే.. ఓ మహానగరంలో ట్రాఫిక్ 12 రోజుల పాటు నిలిచిపోయింది. ఒకటి కాదు.. రెండు కాదు.. వంద కిలోమీటర్ల పొడవు వాహనాలు ఆగిపోయాయి.

ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోవడం ఎవరూ సహించరు. ఎవరూ సాహసించరు కూడా. కానీ.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడిన ఘటనగా నిలిచింది. రోజుల తరబడి వాహనదారులు ట్రాఫిక్‌ సుడిగుండంలోనే చిక్కుకుపోయారు. వెరైటీ అంశం ఏంటంటే.. ఆ రోడ్డులో వీరి కోసం నిత్యావసరాల దుకాణాలు సైతం వెలిశాయి. కానీ.. పది రెట్లు అధిక ధరలకు విక్రయించారు.

దాదాపుగా దేశ, రాష్ట్ర రాజధానుల్లో ఇలాంటి ట్రాఫిక్ కష్టాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఆ దేశ రాజధానిలో కనిపించాయి. 12 రోజులైనా ట్రాఫిక్ క్లియర్ కాలేదు. ఇది ఎక్కడ జరిగిందంటే.. చైనా రాజధాని బీజింగ్‌లో. చైనా జాతీయ రహదారి 110పై ఏర్పడిన ఈ ట్రాఫిక్ జామ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.

ఎక్కడైనా అరకిలో మీటరు, కిలో మీటరు వరకు ట్రాఫిక్ నిలిచిపోవడం చూస్తుంటాం.. కానీ 100 కిలోమీటర్ల పాటు నిలిచిపోయాయని తెలిసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే.. ఇంతటి రికార్డుకు దారితీసిన పరిస్థితులో ఏంటో ఒకసారి తెలుసుకుందాం. బీజింగ్-టిబెట్ హైవేపై పెద్ద సంఖ్యలో బొగ్గుతో కూడిన ట్రక్కులు నిలిచిపోయాయి. వాటిని నిర్మాణ సామగ్రి ఉంది. అదంతా కూడా మంగోలియా నుంచి బీజింగ్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే.. వాటిని క్లియర్ చేసే క్రమంలో ట్రక్కులకు మార్గం కోసం ఎక్స్‌ప్రెస్ వేలోని అన్ని వాహనాలను సింగిల్ లేన్‌లో నడపాలని ఆదేశించారు. దాంతో అసలు చిక్కు వచ్చిపడింది. వాటిని మళ్లించే క్రమంలో హైవే పైనుంచి కిందకు వెళ్తున్న వాహనాలన్నీ అక్కడికక్కడే నిలిచిపోయాయి. దాంతో వాహనదారులు ఇలాంటి ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

మరోవైపు.. 12 రోజులుగా వాహనదారులు ట్రాఫిక్‌లోనే ఉండడంతో వారు చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. తినేందుకు తిండి లేక.. తాగేందుకు నీళ్లు లేక అవస్థలు పడ్డారు. ఇక రాత్రి అయిందంటే కారులోనే నిద్రపోయారు. వరల్డ్ రికార్డు సాధించిన ఈ ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు అక్కడి యంత్రాంగం ఓ యుద్ధమే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రక్కులన్నింటిన ఒక్కొక్కటిగా హైవే పై నుంచి తొలగించి రెండు లేన్లు ఓపెన్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. దాంతో వాహనదారులంతా ఊపిరి పీల్చుకొని తమతమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే ఈ ఘటన ఆగస్టు 10, 2010 నాటిది.