Begin typing your search above and press return to search.

ఆ ఫ్లైట్ లో జర్నీ.. 90 సెకన్లలో గమ్యస్థానం చేర్చేస్తుంది

ఈ ప్రాంతం స్కాట్లాండ్ రాజధాని ఎడిన్ బర్గ్ విమానాశ్రయంలోకి రన్ వే పొడువుతో సమానంగా చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   13 Oct 2024 5:30 PM GMT
ఆ ఫ్లైట్ లో జర్నీ.. 90 సెకన్లలో గమ్యస్థానం చేర్చేస్తుంది
X

అవును.. మీరు తప్పుగా చదవలేదు. మేం తప్పుగా రాయలేదు. కేవలం 90 అంటే 90 సెకన్లలో(ఒకటిన్నర నిమిషాల్లో) గమ్యస్థానానికి చేర్చే ఫ్లైట్ జర్నీ ఒకటి ఉంటుందా? అదసలు సాధ్యమా? అందుకోసం విమానం ఎక్కుతారా? అన్న సందేహాలు బోలెడన్ని రావొచ్చు. కానీ.. ఇది నిజం. అంతేకాదు.. ఇటీవల కాలంలో ఈ షార్టెస్ట్ ఫ్లైట్ జర్నీ కోసం ఆసక్తి అంతకంతకూ ఎక్కువ అవుతున్న వైనం తెలిస్తే.. కొత్తదనానికి ఆదరణ ఎలా ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది.

ఇంతకూ 90 సెకన్ల జర్నీ కోసం విమానం ఎందుకు ఎక్కుతారా? దానికి కారణం ఏమిటి? అన్న సందేహానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకుంటే.. అక్కడున్న ప్రత్యేక పరిస్థితులే దీనికి కారణం. స్కాట్లాండ్ లోని ఒక విమానం కేవలం ఒకటిన్నర నిమిషాల జర్నీ కోసం ప్రత్యేకంగా విమాన సర్వీసును నడుపుతోంది. ఓర్క్ నీ దీవుల్లో ‘వెస్ట్ రే’.. ‘‘పాపా వెస్ట్ రే’’ అనేవి రెండు దీవులు. ఈ రెండు దీవుల్ని కలిపే వంతెన లేకపోవటంతో.. ప్రజలు రాకపోకల కోసం విమానాన్ని విడుతూ ఉంటారు 1.7 మైళ్ల దూరానికి విమానాలు సర్వీసులు అందిస్తూ ఉంటాయి.

ఈ ప్రాంతం స్కాట్లాండ్ రాజధాని ఎడిన్ బర్గ్ విమానాశ్రయంలోకి రన్ వే పొడువుతో సమానంగా చెప్పొచ్చు. విమానం టేకాఫ్ అయిన తర్వాత నుంచి కేవలం ఒకటిన్నర నిమిషాలకు ల్యాండ్ అవుతుంది. ఈ జర్నీ కోసం ఆయా ఎయిర్ లైన్స్ సంస్థలు బ్రిట్టెన్ నార్మన్ బీఎన్2బబీ-26 ఐలాండర్ విమానాల్ని వినియోగిస్తుంటాయి. ఈ విమానాల్లో కేవలం పది సీట్లు మాత్రమే ఉంటాయి. అంతేకాదు.. విమాన పైలెట్ పక్క సీట్లో కూడా కూర్చొని ప్రయాణించే వీలుంది.

పాపా వెస్ట్ రే ప్రాంతంలో జనాభా చాలా తక్కువ. వీరంతా తమ ప్రధాన భూభాగానికి కనెక్టు అయ్యేందుకు ఈ విమానాల మీద ఆధారపడుతుంటారు. ప్రపంచంలో అత్యంత తక్కువ గమ్యస్థానానికి ప్రయాణించే విమానసర్వీసుగా దీన్ని చెప్పాలి. మొదట్లో అవసరం కోసం ఈ విమానాలు వాడగా.. ఇప్పుడు ఈ తక్కువ జర్నీ అనుభూతి కోసం.. నేచర్ ను చూసేందుకు వీలుగా పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడకు వస్తూ..ఈ విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఇదంతా చదివిన తర్వాత.. మనకు వీలైతే ఒకసారి జర్నీ చేయాలనిపించట్లేదు?