Begin typing your search above and press return to search.

ప్రపంచలోనే టాప్ 10 టెక్ కంపెనీల గురించి తెలుసా?

ఫలానా కంపెనీలో జాబ్ చేస్తున్నారంటే.. ఆ వ్యక్తి లెవెల్ ఇంకాస్త పెరుగుతుందని అంటుంటారు.

By:  Tupaki Desk   |   8 Feb 2025 5:30 PM GMT
ప్రపంచలోనే టాప్  10 టెక్  కంపెనీల గురించి తెలుసా?
X

ఫలానా కంపెనీలో జాబ్ చేస్తున్నారంటే.. ఆ వ్యక్తి లెవెల్ ఇంకాస్త పెరుగుతుందని అంటుంటారు. ఇదే సమయంలో.. ఫలానా కంపెనీకి చెందిన ప్రోడక్ట్స్ వాడుతున్నామన్నా.. మార్కెట్ లో గౌరవం పెరుగుతుందని చెబుతుంటారు. ప్రస్తుతం సొసైటీ అలానే ఆలోచిస్తుందనేది కొసమెరుపు! ఈ సమయంలో ప్రపంచలోనే టాప్ 10 టెక్ కంపెనీల గురించి తెలుసుకుందాం..!

అవును... టెక్నాలజీ, ఆవిష్కరణల ద్వారా నడిచే నేటి ప్రపంచంలో పలు టెక్ కంపెనీలు ప్రజల దైనందిన జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తున్నాయని చెబుతారు. ఈ సమయంలో మార్కెట్ క్యాపిటలైజేషన్, షేర్ వేల్యూ ఆధారంగా టాప్ 10 కంపెనీల గురించి తెలుసుకుందాం..! ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఆ పదింటిలో 8 కంపెనీలు అమెరికాలో ఉన్నాయి!

యాపిల్:

ఏప్రిల్ 1976లో స్థాపించబడిన ఈ సంస్థ 2024 ఆదాయం 3.54 ట్రిలియన్ డాలర్లు. ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్ కంపెనీల్లో ఒకటైన యాపిల్.. ఐఫోన్, మాక్, ఆపిల్ వాచ్ వంటి హై-ఎండ్ ఉత్పత్తులకు ప్రసిద్ధి. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మానవ జీవనశైలితో సాంకేతికతను మిళితం చేస్తుంది.

మైక్రోసాఫ్ట్:

ఏప్రిల్ 1975లో స్థాపించబడిన ఈ సంస్థ గత ఏడాది ఆదాయం 3.06 ట్రిలియన్ డాలర్లు. దశాబ్ధాలుగా ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్ కంపెనీల్లో ఒకటిగా మైక్రోసాఫ్ట్ ఉంటుంది. ప్రముఖ సాఫ్ట్ వేర్, క్లౌడ్ కంప్యూటింగ్, టెక్ సేవల కేంద్రంగా ఇది ఉంది. విండోస్, ఆఫీస్ సూట్ లకు ప్రసిద్ధి చెందిన ఇది క్లౌడ్ సొల్యూషన్స్ లోనూ అగ్రగామిగా ఉంది.

ఎన్విడియా:

జనవరి 1993లో స్థాపించబడిన ఈ సంస్థ ఆదాయం 2024లో 2.98 ట్రిలియన్లుగా ఉంది. ఇది పీసీలు, గేం కన్సోల్ కోసం అత్యాధునిక గ్రాఫిక్ ప్రాసెసర్లు, చిఫ్ సెట్ లను తయారు చేయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో ఉంది.

ఆల్ఫాబెట్ (గూగుల్):

అక్టోబర్ 2015లో స్థాపించబడిన ఈ సంస్థ ఆదాయం 2024నాటికి 2.50 ట్రిలియన్ డాలర్లు. గుగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్.. సెర్చ్ ఇంజిన్, క్లౌడ్ కంప్యూటింగ్, ప్రకటనలకు ప్రసిద్ధి చెందింది. బెస్ట్ ఎక్స్ పీరియన్స్ అందించడం ద్వారా ఆల్ఫాబెట్ కంప్యూటింగ్ కు ప్రసిద్ధి చెందింది. ఇది ఇటీవల ఏఐ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది.

అమెజాన్:

జూలై 1994లో స్థాపించబడిన ఈ సంస్థ ఆదాయం 2024 నాటికి 2.49 ట్రిలియన్ డాలర్లు. గాడ్జెట్లు, ఫ్యాషన్ నుండి కిరాణా సామాన్ల వరకూ.. అన్ని నిత్యావసర వస్తువులకు ఇది స్టోర్ గా ఉంది. ఒకప్పుడు బుక్ స్టోర్ గా ప్రారంభమైన సంస్థ ఇప్పుడు ఆల్ ఇన్ వన్ అమెజాన్ గా రూపాంతరం చెందింది.. ఈ కామర్స్ ప్రపంచంలో అగ్రగామిగా ఉంది.

మెటా ఫ్లాట్ ఫారమ్స్:

జనవరి 2004లో స్థాపించబడిన మెటా ఫ్లాట్ ఫారమ్స్ అనేది ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సప్ వంటి ప్రధాన సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్స్ లను కలిగి ఉంది. ఈ సేవలు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మందిని అనుసంధిస్తాయి. కంటెంట్ షేరింగ్ ను సులభతరం చేస్తుంది. ఈ సంస్థ 2021లో మెటాగా రీబ్రాండ్ చేయబడింది. 2024 నాటికి దీని ఆదయం 1.74 ట్రిలియన్ డాలర్లు.

టెస్లా:

జూలై 2003లో స్థాపించబడిన ఈ సంస్థ ఆదాయం 2024 నాటికి 1.30 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలు, సౌరశక్తి ఉత్పత్తులను తయారు చేయడం, అమ్మడంలో ప్రసిద్ధి చెందింది. ఏఐ ఆవిష్కరణలలో అగ్రగామిగా ఉన్న టాప్ 10 టెక్ కంపెనీల్లో టెస్లా ఒకటిగా ఉంది. రాబోయే కాలంలో ఇంధన రంగంలో టెస్లా కీలక భూమిక పోషించవచ్చని అంటున్నారు.

టీ.ఎస్.ఎం.సీ:

ఫిబ్రవరి 1987లో స్థాపించబడిన ఈ తైవాన్ సెమీకండక్టర్ తయారీ కంపెనీ (టీ.ఎస్.ఎం.సీ).. దాని అధునాతన చిప్ టెక్నాలజీలకు ప్రసిద్ధి చెందింది. ఇది స్మార్ట్ ఫోన్ ల నుంచి అధునాతన ఏఐ వ్యవస్థల పరికరాలకు పవర్ ఇవ్వగలదు! ఈ సంస్థ 2024 నాటికి 1.08 మిలియన్ డాలర్ల ఆదాయంతో ఉంది.

బ్రాడ్ కామ్:

ఆగస్టు 1991లో స్థాపించబడిన ఈ సంస్థ 2024 నాటికి 1.03 ట్రిలియన్ డాలర్ల ఆదాయంతో ఉంది. కాలిఫోర్నియాలోని శాన్ జోస్ లో ఉన్న బ్రాడ్ కామ్ ఇంక్ డాట్.. సెమీకండక్టర్లు, మౌలిక సధుపాయాల సాఫ్ట్ వేర్ సొల్యూషన్ లలో ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ సంస్థ టెలీకమ్యునికేషన్స్, పారిశ్రామిక ఆటోమేషన్ వంటి కీలక రంగాలకు సేవలు అందిస్తాయి.

టెన్సెంట్:

నవంబర్ 1998లో స్థాపించబడిన ఈ సంస్థ 2024 నాటికి 482.63 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఉంది. చైనాలోని అతిపెద్ద టెక్ దిగ్గజాలలో ఒకటైన టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్, ప్రపంచ టెక్ కంపెనీల జాబితలో 10వ స్థానంలో ఉంది. వియ్ చాట్, క్యూక్యూ వంటి ఫ్లాట్ ఫాం లతో డిజిటల్ సేవల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల మంది వినియోగదరులను కలుపుతుంది.