Begin typing your search above and press return to search.

వరల్డ్ బెస్ట్ విస్కీ: రాజస్థాన్‌ బార్లీ.. యమునా నీరు.. హిమాలయాల్లో తయారీ!

అవును... భారత్‌ లో తయారైన "ఇంద్రి విస్కీ" ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత బెస్ట్ విస్కీగా నిలిచింది.

By:  Tupaki Desk   |   3 Oct 2023 1:30 PM GMT
వరల్డ్  బెస్ట్  విస్కీ: రాజస్థాన్‌  బార్లీ.. యమునా నీరు.. హిమాలయాల్లో తయారీ!
X

"కొండపల్లి మన్నుతో, గోదారమ్మ నీళ్లతో మలిచిన బొమ్మరా ఇది.. ప్రాణమున్న బొమ్మరా ఇది".. అని తెలుగు సినిమాలో పాట! ఆ బొమ్మలకు అంత ప్రత్యేకత ఉంటుందని కవి భావానువాదం! ఇదే సమయంలో... "రాజస్థాన్ బార్లీ గింజలతో, హిమాలయాల్లో పుట్టిన యమునా నదిలోని స్వచ్చమైన నీటితో, హిమాలయ పర్వత ప్రాంతాల్లో తయారు చేస్తున్న విస్కీరా ఇది... ప్రపంచంలోని బెస్ట్ విస్కీరా ఇది".. అని ఇంద్రి విస్కీ గురించి చెబుతున్నారు ప్రపంచ మందు మేధావులు!

అవును... భారత్‌ లో తయారైన "ఇంద్రి విస్కీ" ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత బెస్ట్ విస్కీగా నిలిచింది. ఇందులో భాగంగా... "విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ అవార్డ్స్‌"లో "ఇంద్రి దీపావళి కలెక్టర్స్ ఎడిషన్ - 2023" వరల్డ్ బెస్ట్ విస్కీ అవార్డును సాధించింది. బహిరంగంగా గర్వపడాలా వద్దా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఈ అవార్డుతో భారత విస్కీలకు ప్రపంచంలోనే అరుదైన గుర్తింపు లభించిందని మాత్రం చెప్పవచ్చు!


ఇలా... "విస్కీస్ ఆఫ్ ది వరల్డ్" ప్రతి సంవత్సరం ప్రపంచంలోని 100కు పైగా వెరైటీల విస్కీలను ఉంచి అందులో ఉత్తమ విస్కీకి అవార్డును ప్రకటిస్తుంది. ఇలా ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న 100కు పైగా టాప్ విస్కీలు పోటీపడిన ఈ కాంపిటీషన్‌ లో "ఇంద్రి దీపావళి కలెక్టర్స్ ఎడిషన్ - 2023" కు "డబుల్ గోల్డ్ బెస్ట్ ఇన్ షో" అవార్డు దక్కింది. ఈ పోటీ ఏమీ అల్లాటప్పాగా జరగదు సుమా...! భారీ కాంపిటీషన్ ఉంటుంది!

ఇందులో భాగంగా... అమెరికన్ సింగిల్ మాల్ట్స్, బోర్బన్స్, స్కాచ్ విస్కీస్, కెనడియన్ విస్కీస్, బ్రిటీష్ సింగిల్ మాల్ట్స్, ఆస్ట్రేలియన్ సింగిల్ మాల్ట్స్ సహా వందకుపైగా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పాల్గొన్నాయి. వీటన్నింటితో పాటు రంగంలోకి దిగిన భారతీయ సింగిల్ మాల్ట్ ఇంద్రి దీపావళి కలెక్టర్స్ ఎడిషన్ - 2023... అన్నింటికంటే అత్యుత్తమమైన విస్కీగా ఎంపికైంది.

ఇలా ఇంటర్నేషనల్ అవార్డ్ దక్కించుకున్న ఈ అద్భుతమైన రుచిగల ఇంద్రి విస్కీని పికాడిల్లీ డిస్టిలరీస్ అనే సంస్థ తయారు చేస్తుంది. విస్కీ తయారీలో నాణ్యత, తమకున్న నిబద్ధత కారణంగానే ఈ అవార్డు వచ్చినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇదే సమయంలో ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు గతంలోనూ చాలా వచ్చినట్లు ఆ కంపెనీ తెలిపింది.

ఇక అసలు ఈ ఇంద్రీ విస్కీకి ఇంత టేస్ట్ రావడానికి, ఇంత నాణ్యత రావడానికి ఫలితంగా... ఇంత పేరు ప్రఖ్యాతులు రావడానికి గల కారణాలను సంస్థ వెల్లడించింది. అవును... ఈ సందర్భంగా ఇంద్రి దీపావళి కలెక్టర్స్ ఎడిషన్ - 2023 తయారీకి సంబంధించి వాడే ముడిపదార్ధాలను, అవి ఎక్కడనుంచి తీసుకొచ్చేదీ వంటి వివరాలను వెల్లడించింది.

ఇందులో భాగంగా... రాజస్థాన్‌ లో ప్రత్యేకంగా ఎంపిక చేసిన బార్లీ గింజలను తీసుకుని.. వాటికి, హిమాలయాల్లో పుట్టిన యమునా నదిలోని స్వచ్ఛమైన తాజా నీటిని ఉపయోగించి.. అనంతరం, హిమాలయ పర్వత ప్రాంతాలకు తరలించి అక్కడ్ద తయారు చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇదే సమయంలో ఎండు ద్రాక్షలను ఉపయోగించినట్లు పేర్కొంది.

అన్ని జాగ్రత్తలతో, అంత నిబద్ధతగా తయారు చేశాము కాబట్టే... విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ ఇచ్చే అవార్డ్స్ దక్కిందని తెలిపింది. ఇదే సమయంలో విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ అనేది లిక్కర్ ఇండస్ట్రీలోనే ఇచ్చే అత్యంత ముఖ్యమైన అవార్డ్ అని తెలిపింది.