ప్రపంచంలోని టాప్-10 స్మార్ట్ సిటీలివే... హైదరాబాద్ ప్లేస్?
ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ (ఐఎండీ) స్మార్ట్ సిటీ ఇండెక్స్ ను విడుదల చేసింది
By: Tupaki Desk | 21 July 2024 2:30 PM GMTఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ (ఐఎండీ) స్మార్ట్ సిటీ ఇండెక్స్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా... యూరప్, ఆసియాలోని స్మార్ట్ సిటీలు ప్రపంచవ్యాప్తంగా ప్రాబల్యం సాధిస్తుండగా.. ఉత్తర అమెరికా నగరాలు ర్యాంకింగ్స్ లో వెనకపడిపోయాయని వెల్లడిస్తుంది. ఈ సందర్భంగా టాప్-10 స్మార్ట్ సిటీల వివరాలు ప్రకటించింది!
అవును... అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న నగరాలు తమ పౌరుల జీవన నాణ్యతను అందించే కార్యక్రమాలను అభివృద్ధి చేశాయి.. పచ్చని ప్రదేశాల సృష్టి, సాంస్కృతిక కార్యక్రమాల విస్తరణ, సామాజిక బంధాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించడం స్మార్ట్ సిటీ ఎంపికలో కీలకం అంటూ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ (ఐఎండీ) స్మార్ట్ సిటీ ఇండెక్స్ ని విడుదల చేసింది!
ఇదే సమయంలో... వినూత్న వ్యూహాలు, ప్రతిభను ఆకర్షించడం, దాన్ని నిలుపుకోవడం, పెట్టుబడిని పెంపొందించడం, భౌగోళిక అసమానతలకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం అనేది కూడా ర్యాకింగ్ లలో విజయానికి దోహదపడే అంశమని పేర్కొంది. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 142 స్మార్ట్ నగరాలను ర్యాంక్ చేసింది.
ఈ క్రమంలోనే ప్రపంచంలోని టాప్-10 నగరాలను పంచుకుంది. అయితే టాప్-10 సిటీస్ లో భారతదేశ నగరాలకు చోటు దక్కకపోయినా... 142 స్మార్ట్ నగరాల జాబితాలో మాత్రం నాలుగు మెట్రోపాలిటన్ సిటీలు చోటు దక్కించుకున్నాయి. ఇందులో భాగంగా... ఢిలీ (106), ముంబై (107), బెంగళూరు (109), హైదరాబాద్ (111) ర్యాంకులను దక్కించుకున్నాయి.
టాప్-10 సిటీలు, ఆ సిటీ ఉన్న దేశం వివరాలు:
1 - జ్యూరిచ్ - స్విట్జర్లాండ్
2 - ఓస్లో - నార్వే
3 - కాన్బెర్రా - ఆస్ట్రేలియా
4 - జెనీవా - స్విట్జర్లాండ్
5 - సింగపూర్ - సింగపూర్
6 - కోపెన్ హాగన్ - డెన్మార్క్
7 - లౌసన్నే - స్విట్జర్లాండ్
8 - లండన్ – యునైటెడ్ కింగ్ డమ్
9 - హెల్సింకి - ఫిన్లాండ్
10 - అబూ ధాబీ – యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్