Begin typing your search above and press return to search.

చీకట్లో గంటపాటు ఢిల్లీ, హైదరాబాద్ నగరాలు?

దేశంలో విద్యుత్ వినియోగం నానాటికి పెరిగిపోతోంది. పరిశ్రమలు, ఇతర సంస్థలు విద్యుత్ వినియోగంతోనే మనుగడ సాగిస్తున్నాయి

By:  Tupaki Desk   |   23 March 2024 6:54 AM GMT
చీకట్లో గంటపాటు ఢిల్లీ, హైదరాబాద్ నగరాలు?
X

దేశంలో విద్యుత్ వినియోగం నానాటికి పెరిగిపోతోంది. పరిశ్రమలు, ఇతర సంస్థలు విద్యుత్ వినియోగంతోనే మనుగడ సాగిస్తున్నాయి. దీంతో కరెంట్ వాడకం గతంలో కంటే రెండింతలు పెరగడం గమనార్హం. ఈనేపథ్యంలో విద్యుత్ వాడకం విరివిగా మారింది. ఏ పని కావాలన్నా విద్యుత్ తోనే ముడిపడి ఉందని తెలుసుకున్నాం. వేగంగా విస్తరిస్తున్న జనాభాకు కరెంట్ వాడకం కూడా అదేరేంజ్ లో పెరిగింది.

విద్యుత్ తయారు చేయడానికి ప్రభుత్వాలు కూడా ఆపసోపాలు పడుతున్నాయి. ఎండాకాలం విద్యుత్ వాడకం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వాడకం తప్పనిసరి. దీంతో బిల్లు కూడా ఓ రేంజ్ లో పెరుగుతుంది. ప్రస్తుతం ఫ్రీ కరెంటు తో ప్రభుత్వంపై పెనుభారమే పడనుంది. ఈనేపథ్యంలో కరెంట్ వాడకం అధికంగా మారనుంది. ప్రజలకు విద్యుత్ ను అందించేందుకు ప్రభుత్వం నానా ఇబ్బందులు పడాల్సిందే.

విద్యుత్ ను ఓ గంట పాటు బంద్ చేసి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) సంస్థ భావించింది. ఇందులో భాగంగా శనివారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో విద్యుత్ ను బంద్ చేసి మద్దతు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు అందరికి అవగాహన కల్పించారు.

ప్రతి సంవత్సరం ఓ గంట పాటు చీకట్లో ఉండేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీన్ని ఎర్త్ అవర్ గా చెబుతారు. శనివారం 23న రాత్రి గంట పాటు ఢిల్లీతో పాటు హైదరాబాద్ నగరాల్లో ఎర్త్ అవర్ నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం లైట్లను అందరు ఆపి కార్యక్రమానికి మద్దతు ఇవ్వనున్నారు. దీంతో ఈ రెండు నగరాల్లో గంట పాటు చీకట్లు కమ్ముకుంటాయి.

ఎర్త్ అవర్ సమయంలో కమ్యూనిటీలు, వ్యాపారాలు, ఎలక్ర్టిక్ ఉపకరణాలు గంట పాటు ఆఫ్ చేయాలని అవగాహన కల్పించారు. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సింబాలిక్ లైట్స్ అవుట్ కార్యక్రమంగా ఎర్త్ అవర్ ను 190కి పైగా దేశాల్లో పాటిస్తున్నారు. ఇదే ప్రస్తుతం ఉద్యమంలా మారి అన్ని నగరాలకు విస్తరించింది. ఎర్త్ అవర్ కార్యక్రమంతో పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తుందని చెబుతున్నారు.

హైదరాబాద్ నగరంలోని సచివాలయం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, హుస్సేన్ సాగర్ లోని బుద్ధ విగ్రహం, గోల్కొండ కోట, చార్మినార్, స్టేట్ సెంట్రల్ లైబ్రరీతో సహా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఐకానిక్ స్మారక చిహ్నాలు ఎర్త్ అవర్ కు మద్దతు తెలపనున్నాయి. ఇళ్లలోని లైట్లు, ఎలక్ట్రిక్ ఉపకరణాలు బంద్ చేయనున్నారు. ఢిల్లీలో కూడా జరిగే కార్యక్రమంలో 279 మెగావాట్ల విద్యుత్ ను ఆదా చేయనున్నట్లు అధికారులు తెలిపారు.