రెజ్లర్ అంతిమ్ పంఘాల్ అరెస్ట్ కాలేదట!... మరి ఐఓఏ నిషేధం?
అయితే వాటిలో నిజం లేదంటూ తాజాగా అంతిమ్ స్పందించింది. ఇందులో భాగంగా... తనతో పాటు తన సోదరి అరెస్ట్ అయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పినట్లు ఓ మీడియా ఛానల్ వెల్లడించింది.
By: Tupaki Desk | 8 Aug 2024 12:29 PM GMTపారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత్ ఆటగాళ్లకు సంబంధించి పలు వివాదాలు, విషాద సంఘటనలు తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఒలింపిక్స్ క్రీడల సమయంలో రెజ్లర్ అంతిమ్ పంఘాల్ పై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) చర్యలు తీసుకుంది.. మూడేళ్లు నిషేధం విధించింది! మరోపక్క ఆమెను పోలీసులు చేశారంటూ కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా.. అంతిమ్ పంఘాల్ అక్రిడేషన్ తో ఆమె సోదరి నిశా ఒలింపిక్ విలేజ్ లోకి ప్రవేశించడంతో పోలీసులు అరెస్ట్ చేశారంటూ కథనాలొచ్చాయి. అయితే అసలు అప్పుడు ఏమి జరిగింది.. ఎలా జరిగింది.. ఎందుకు జరిగింది.. పోలీసులు అరెస్ట్ మొదలైన విషయాలపై అంతిమ్ పంఘాల్ స్పందించింది. ఈ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించింది.
అవును... తన అక్రిడేషన్ తో ఆమె సోదరిని ఒలింపిక్ విలేజ్ లోకి తన అక్రిడేషన్ తో పంపించడం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీంతో... వీరిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వతున్నాయి. అయితే వాటిలో నిజం లేదంటూ తాజాగా అంతిమ్ స్పందించింది. ఇందులో భాగంగా... తనతో పాటు తన సోదరి అరెస్ట్ అయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పినట్లు ఓ మీడియా ఛానల్ వెల్లడించింది.
వాస్తవానికి క్వార్టర్స్ లో ఓటమి అనంతరం తనకు జ్వరం వచ్చిందని.. ఈ సమయంలో ఓపిక లేకపోవడంతో తన సోదరి హోటల్ కు తీసుకెళ్తానందని చెప్పిన అంతిమ్.. కోచ్ ల అనుమతి తీసుకుని హోటల్ కు వెళ్లినట్లు తెలిపింది. అయితే తనకు అవసరమైన కొన్ని వస్తువులు ఒలింపిక్ విలేజ్ లో ఉండిపోవడంతో.. తన అక్రిడేషన్ కార్డు తీసుకుని తన సోదరి అక్కడకు వెళ్లిందని తెలిపింది.
ఈ సమయంలో అక్కడున్న అధికారులు ఆమె వద్ద ఉన్న అక్రిడేషన్ కార్డు తీసుకుని ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారని.. అది కూడా కేవలం వెరిఫికేషన్ కోసం మాత్రమే అని.. కాసేపటి తర్వాత క్లారిటీ రావడంతో కార్డు ఇచ్చి ఆమెను పంపించేశారని.. వాస్తవంగా జరిగింది ఇదని అంతిమ్ వివరించింది. మరోపక్క దుర్వినియోగం ఆరోపణలతో ఆమె అక్రిడేషన్ ను ఒలింపిక్ నిర్వాహకులు రద్దు చేశారు.
ఈ నేపథ్యంలో... మూడేళ్ల నిషేధంపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ పునరాలోచన చేస్తుందా అనే చర్చ మొదలైంది. ప్రస్తుతానికైతే ఈమె అరెస్ట్ విషయంపై మాత్రం క్లారిటీ వచ్చినట్లయ్యింది!