Begin typing your search above and press return to search.

డ్రైవ్ చేయాల్సిన అవసరం లేని స్కూటర్ వచ్చేసిందోచ్

కానీ.. చైనీస్ కన్ఫ్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షియోమీ మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.

By:  Tupaki Desk   |   27 March 2025 6:30 AM
Self driving scooty by Xiamoi
X

కాలం మారుతోంది. అందుకు తగ్గట్లుగా కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇందులో కొన్ని అద్భుతం అనే మాటను మించేలా ఉండే ఆవిష్కరణలు ఇటీవల కాలంలో వస్తున్నాయి. ఇప్పుడుచెప్పే డ్రైవర్ లెస్ స్కూటర్ ఆ కోవకు చెందిందే. స్కూటర్ అన్నంతనే బ్యాలెన్సు చేసుకోవటం.. డ్రైవ్ చేయటం అంత సులువైనది కాదు. కేర్ ఫుల్ గా ఉండాలి. లేదంటే ప్రమాదానికి గురి కావటం ఖాయం. కానీ.. చైనీస్ కన్ఫ్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షియోమీ మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.

ఈ సంస్త తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరి సాయం అవసరం లేకుండా నోటిమాటతో నడిపేయొచ్చు. తనకు తానుగానే ముందుకు వెళుతుంది. పూర్తి ఆటోమేటిక్ అయిన ఈ స్కూటర్ ను నోటి మాటతో కమాండ్లు ఇవ్వొచ్చు. సాధారణ రోడ్డు మీదనే కాదు.. మెట్ల మీదా ముందుకు వెళ్లటం.. అవసరానికి తగ్గట్లే వెనక్కి వెళుతుంది. అంతేకాదు.. ఏ మాత్రం డ్రైవింగ్ రానోళ్లు సైతం ఈ స్కూటర్ మీద ఇట్టే రైడ్ చేసేయొచ్చు.

అంతేనా.. ఇంకేమైనా ఉన్నాయా? అంటే ఉన్నాయనే చెప్పాలి. స్కూటర్ మీద జర్నీ పూర్తి అయిన తర్వాత తనను తాను పార్కు చేసుకుంటుందా? స్టాండ్ వేసుకుంటుందా? అంటే.. అన్నింటికి ఎస్ అన్న మాటే తప్పించి.. నో అన్న మాటకు తావివ్వకుండా దీన్ని రూపొందించారు. అంతేకాదు.. స్కూటర్ స్టాండ్ వేసి లేకున్నా.. కింద పడకుండా బ్యాలెన్సు దీని సొంతం. వాయిస్ కమాండ్ తో కంట్రోల్ చేసే ఈ స్కూటర్ రానున్న రోజుల్లో మనిసి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని చెప్పాలి. ఇన్ని చెబుతున్నారు.. మరి.. ఫ్రూప్ ఏమిటి? అని మీరు అడగొచ్చు. వీడియోకు చెందిన లింక్ ను క్లిక్ చేస్తే.. మీ నోటి నుంచి వరుస పెట్టి వావ్ అనే మాటల్ని వచ్చేలా చేస్తుంది అ అద్భుతాల స్కూటర్.