70 కి.మీ మైలేజ్‌తో రోడ్ కింగ్ RX 100 కొత్త వెర్షన్
ఈసారి యమహా ఆర్.ఎక్స్ 100 కొత్త బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, స్పీడోమీటర్, డిజిటల్ క్లాక్, డిజిటల్ ట్రిప్ మీటర్ వంటి కొన్ని ఆధునిక ఫీచర్లను జోడించారు.
By: Tupaki Desk | 10 Jun 2024 4:10 AM GMTయమహా RX 100 బైక్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఏకంగా ఆ టైటిల్ తోనే సినిమా తీసి కోట్లలో ఆర్జించారు. 90లలో కుర్రకారు హృదయాలను దోచుకున్న ఈ బైక్ కి ఇప్పటికీ బోలెడంత క్రేజ్ ఉంది. మార్కెట్లో ఎన్ని బ్రాండ్లు ఉన్నా యమహా పాత బైక్‌లను రీమోడిఫికేషన్ చేయించుకుని మరీ యూత్ ఉపయోగిస్తోంది. తాత ముత్తాతల కాలం నుంచి ఆర్.ఎక్స్ 100 క్రేజ్ అలానే ఉంది. 90 లలో ఈ బైక్‌ను రోడ్ కింగ్ గా చూస్తుంది యువతరం. బైక్ నుండి వచ్చే 'ఫటా ఫట్' శబ్దం ప్రజలకు ఇప్పటికీ గుర్తుంది.
అందుకే ఈ క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకునేందుకు యమహా ఇప్పుడు RX 100 గురించి పెద్ద శుభవార్త చెబుతోంది. కంపెనీ ఈ బైక్‌ను అధునాతన ఫీచర్లతో మళ్లీ భారతీయ మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. అయితే లాంచ్ చేయడానికి ముందు ఈ బైక్‌లో ఉన్న కొన్ని ఫీచర్లు, ఇంజన్ గురించిన సమాచారం రివీలైంది. ఈసారి యమహా ఆర్.ఎక్స్ 100 కొత్త బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, స్పీడోమీటర్, డిజిటల్ క్లాక్, డిజిటల్ ట్రిప్ మీటర్ వంటి కొన్ని ఆధునిక ఫీచర్లను జోడించారు. ఇవే కాకుండా మరెన్నో ఫీచర్లు అదనంగా ఉన్నాయి.
యమహా RX 100 మునుపటి కంటే శక్తివంతమైన ఇంజన్ తో వస్తోంది. మైలేజీ విషయంలోను అత్యుత్తమంగా ఉంటుందని సమాచారం. 250సిసి శక్తివంతమైన ఇంజన్‌ని కొత్త వెర్షన్ కి అమర్చారు. దీని పికప్ బుల్లెట్ రేంజులో ఉండనుందని తెలుస్తోంది. ఇది గంటకు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. యమహా ఆర్‌ఎక్స్ 100లో కంపెనీ 14 లీటర్ల ఇంధన ట్యాంక్ తో వస్తోంది. మైలేజీ ఫీచర్ నిజంగా అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ బైక్ లీటరుకు 70 కి.మీ మైలేజీని అందించనుందని తెలిసింది. ట్యూబ్‌లెస్ టైర్లతో సౌకర్యంగా ఉండనుంది. యమహా ఆర్‌ఎక్స్ 100 ధర .. లాంచ్ డేట్ గురించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. కంపెనీ యమహా ఆర్‌ఎక్స్ 100 బైక్‌ను 2026 సంవత్సరంలో విడుదల చేయనుందని తెలుస్తోంది. యమహా ఆర్‌ఎక్స్ 100 ప్రారంభ ధర దాదాపు రూ. 2 లక్షలుగా ఉంటుందని తెలుస్తోంది.