యనమలకు రాజకీయ విశ్రాంతి ?
టీడీపీ సీనియర్ నేత పొలిట్ బ్యూరో మెంబర్ అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన గోదావరి జిల్లాల పెద్దాయన యనమల రాంక్రిష్ణుడుకు ఇక పర్మనెంట్ గా పొలిటికల్ రెస్ట్ ఇచ్చేస్తున్నారా అన్నది పార్టీలో చర్చగా సాగుతోంది.
By: Tupaki Desk | 25 Feb 2025 5:30 PM GMTటీడీపీ సీనియర్ నేత పొలిట్ బ్యూరో మెంబర్ అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన గోదావరి జిల్లాల పెద్దాయన యనమల రాంక్రిష్ణుడుకు ఇక పర్మనెంట్ గా పొలిటికల్ రెస్ట్ ఇచ్చేస్తున్నారా అన్నది పార్టీలో చర్చగా సాగుతోంది. ఎమ్మెల్సీగా ఆయన పదవీ కాలం మార్చి 30తో పూర్తి అవుతోంది.
దాంతో పాటు ఆయన ఇప్పటికే పన్నెండేళ్ళుగా ఎమ్మెల్సీగా ఉన్నారు. మూడవ టెర్మ్ ఆయనకు చాన్స్ ఇస్తారా అన్నది ఒక అతి పెద్ద డిస్కషన్ గానే ఉంది. అయిదు ఎమ్మెల్సీ పదవుల ఖాళీలకు వచ్చే నెలలో ఎన్నికలు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ అయిదూ ఎమ్మెల్సీలూ టీడీపీకి చెందినవే ఉన్నాయి. ఈ ఖాళీలలో మాత్రం కూటమి పార్టీలు మూడూ పంచుకుంటాయని చెబుతున్నారు. జనసేనకు ఒకటి కచ్చితంగా ఖరారు అయిందని అంటున్నారు. మరొకటి బీజేపీకి ఇస్తారు అని అంటున్నారు. ఇక చూస్తే టీడీపీకి మిగిలినవి ముచ్చటగా మూడే మూడు ఉన్నాయి.
ఈ మూడింటినీ తెలుగుదేశం పార్టీ ఎవరితో భర్తీ చేస్తుంది అన్నదే చర్చగా ఉంది. ఇందులో ఒకటి కచ్చితంగా పిఠాపురం వర్మకు ఖాయమని చెబుతున్నారు. మరొకటి విజాయవాడకు చెందిన వంగవీటి రాధాకు ఇస్తారని అంటున్నారు. మూడవ పోస్టు కోసం భారీ పోటీ ఉంది.
పైపెచ్చు పిఠాపురం వర్మ గోదావరి జిల్లాలకు చెందిన వారే. దాంతో యనమలకు సీటు రెన్యూవల్ అయ్యేది లేదు అని అంటున్నారు. ఆయన కుటుంబంలో ఇప్పటికే రెండు ఎమ్మెల్యే పదవులు ఒక ఎంపీ పదవి ఇచ్చారని అంటున్నారు. దాంతో యనమలకు నో చాన్స్ అనే అంటున్నారు.
పైగా కాకినాడ పోర్టు ఇష్యూలో బీసీ నినాదం తెచ్చి అధినాయకత్వాన్ని బహిరంగ లేఖతో ఇరుకున పెట్టినట్లుగా యనమల మీద అప్పట్లో ప్రచారం సాగింది. ఇక ఆయనకు పార్టీకి మధ్య తెలియని గ్యాప్ అయితే ఉందని అంటున్నారు. ఈ క్రమంలో యనమల పేరు ఎక్కడా పరిశీలనకు ఉండే చాన్సే లేదని అంటున్నారు.
ఏడున్నర పదులకు చేరువ అవుతున్న యనమలకు ఇక పొలిటికల్ గా రిటైర్మెంట్ ఇస్తారని అంటున్నారు. యనమల మొత్తం రాజకీయ జీవితంలో టీడీపీలో అత్యధిక కాలం అధికారం అందుకున్నారని ఆ విధంగా ఆయనకు న్యాయమే జరిగిందని అంటున్నారు. దాంతో యనమల విషయం ఏ దశలోనూ పరిశీలనలో ఉండదన్నది ఒక ప్రచారంగా ఉంది.
యనమల విషయం తీసుకుంటే ఆయన రాజ్యసభకు వెళ్ళాలని కోరుకుంటున్నారు. లేదా గవర్నర్ పదవి అయినా ఇస్తే ఈ రాజకీయాలకు గుడ్ బై కొట్టి రాజ్ భవన్ లోకి వెళ్ళాలని చూస్తున్నారు. మరి టీడీపీ అధినాయకత్వం ఆయన కోరికల్లో దేనినైనా రానున్న కాలంలో అయినా మన్నిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.