Begin typing your search above and press return to search.

గన్నవరం పోటీపై క్లారిటీ ఇచ్చిన యార్లగడ్డ... వాట్ నెక్స్ట్ ?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ గన్నవరం నియోజకవర్గంలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి

By:  Tupaki Desk   |   14 Aug 2023 5:36 AM GMT
గన్నవరం పోటీపై క్లారిటీ ఇచ్చిన యార్లగడ్డ... వాట్ నెక్స్ట్ ?
X

ఏపీలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ గన్నవరం నియోజకవర్గంలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. గతకొన్ని రోజులుగా యార్లగడ్డ మీడియా ముందుకు వస్తుండటంటో వ్యవహారం రసవత్తరంగా మారుతోంది. వల్లభనేని వంశీ వర్సెస్ యార్లగడ్డ వెంకటరావుల వ్యవహారంలో తాజాగా ఒక కీలక విషయం తెరపైకి వచ్చింది.

అవును... కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ కార్యకర్తలతో తాజాగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు గన్నవరం టికెట్ ఇవ్వాలని మరోసారి జగన్ ను కోరుతున్నట్లు తెలిపారు. ఇక తన భవిష్యత్ ను గన్నవరం ప్రజలు నిర్ణయిస్తారని యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు.

ఇదే సమయంలో ఈ ఆత్మీయ సమావేశానికి రాకుండా కొందరు బెదిరించారని తెలిపారు. మరోవైపు వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ... సొంత కార్యకర్తలపై కేసులు తీయలేదని యార్లగడ్డ ఆరోపించారు. మరోవైపు తనను దుట్టా రామచంద్రరావు డొక్క చించి డోలు కడతారని తిట్టినా పార్టీ స్పందించలేదని తెలిపారు.

పార్టీకి ఒబిడియెంట్ గా ఉంటూ ఎన్నో అవమానాలు భరించానని.. అయినా సరే తాను ఏనాడూ జగన్ ను ఏమీ అనలేదని పేర్కొన్నారు. అనంతరం... జగన్ తమ రాజకీయ భవిష్యత్ కు భరోసా ఇచ్చి గన్నవరం తీసుకువచ్చారని గుర్తుచేసుకున్నారు. అయితే గడిచిన రెండేళ్లుగా తనకు సీఎం దగ్గర నుంచి అపాయింట్ మెంట్ లేదని వాపోయారు.

గత ఎన్నికల్లో దురదృష్టం, విధి వంచించటం వల్ల అతిస్వల్ప ఓట్ల తేడాతో (280 ఓట్లు) ఓడిపోయానని యార్లగడ్డ పేర్కొన్నారు. పదోతరవగతి చదువుకునే రోజుల్లోనే తాను ఎమ్మెల్యే అవ్వాలని అనుకున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో తాను 2024లో గన్నవరం నుంచి పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. అయితే తనను విజయవాడ ఎంపీకి ఇంఛార్జిగా వెళ్ళాలని పార్టీ పెద్దలు కోరారని.. తాను మాత్రం అంగీకరించలేదని తెలిపారు.

ఇదే సమయంలో వంశీ టాపిక్ ఎత్తారు యార్లగడ్డ. వంశీతో తనకు ఎలాంటి తగాదాలు లేవని.. కాదంటే వంశీతో కలిసి పనిచేయలేనన్నట్లు తాను సీఎం జగన్ కి చెప్పినట్లు వెంకట్రావు తెలిపారు. వైసీపీ అభ్యర్ధిగా తాను పోటీ చేయటం వల్లే వంశీకి శత్రువుగా మారానని తెలిపారు. ఇదే సమయంలో 2024లో గన్నవరం నుంచి పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

దీంతో ఈ వ్యాఖ్యలు స్థానికంగా వైరల్ గా మారుతున్నాయి. ఇదే సమయంలో 2024లో గన్నవరం నుంచి పోటీచేయబోయే వైసీపీ అభ్యర్థి ఎవరవుతారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.