నేను ఇప్పుడు గాందేయవాదిని..యాసిన్ మాలిక్ షాకింగ్ స్టేట్మెంట్..
అలాంటి ఒక దాడిలో నిందితుడు చెబుతున్న మాటలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
By: Tupaki Desk | 5 Oct 2024 11:30 PM GMTకాశ్మీర్, శ్రీనగర్.. ప్రకృతి అందాలతో టూరిస్ట్ స్పాట్లుగా ఎంతో గుర్తింపు తెచ్చుకోవాల్సిన ఈ రెండు ప్లేసుల గురించి చెప్పిన మరుక్షణం గుర్తు వచ్చేది తీవ్రవాదులు. ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య కాశ్మీర్ ఎప్పటి నుంచో నలిగిపోతోంది. ఈ రాపిడి అక్కడ ప్రజలపై తీవ్రంగా ఉండి అనడంలో ఎటువంటి డౌట్ లేదు. కాశ్మీర్లో ప్రతి రాయి ఎన్నో కథలు చెబుతుంది.. సైనికులపై జరిగిన ఎన్నో దాడులను వివరిస్తుంది. అలాంటి ఒక దాడిలో నిందితుడు చెబుతున్న మాటలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
యాసిన్ మాలిక్ తాను ఒక గాందేయవాదిని మారిపోయాను అని అంటున్నాడు. అంతేకాదు 1994 నుంచే తాను సాయుధ పోరాటానికి టాటా చెప్పానని.. చట్టవ్యతిరేకమైన ఎటువంటి కార్యకలాపాలను చేయడం లేదని పేర్కొన్నాడు ఈ విషయాన్ని అతను స్వయంగా.
చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం
ఉపా ట్రైబ్యునల్ కు తెలియజేశాడు. స్వతంత్రంగా ఐకమత్యంగా ఉండే కాశ్మీర్ కోసం తాను హింసను వదిలేసాను అని ట్రైబ్యునల్ కు సమర్పించిన అఫిడివిట్లో యాసిన్ పేర్కొన్నాడు.
1990 జనవరి 25న పాత శ్రీనగర్ ఎయిల్ఫీల్డ్లో విధులకు హాజరు కావడానికి సిద్ధమవుతున్న వాయు సేన
సిబ్బంది పై దాడి జరిగింది. శ్రీనగర్ శివారులోని అల్పూర్ ప్రాంతంలో వారు తమ పికప్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఉగ్రవాదులు వారిపై దాడి చేసి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘాతుకం యాసిన్ నాయకత్వంలో జరిగింది అని ఆరోపణలు ఉన్నాయి. ఈ దారుణమైన ఘటనలో స్క్వాడ్రన్ లీడర్ రవిఖన్నా తో పాటు మరొక నలుగురు ఆఫీసర్లు మృతి చెందగా 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఆ సమయంలో మాలిక్ జమ్ము కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ కోసం పనిచేసేవాడు. అదుపులోకి తీసుకున్న తర్వాత అతనిపై సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే 1994లో అతను జైలు నుంచి విడుదలైన తర్వాత 1995 లో విచారణపై కోర్టు స్టే విధించింది. అదే సమయంలో జేకేఎల్ఎఫ్ ముక్కలవ్వడం తో ఒక వర్గానికి మాలిక్ నాయకుడిగా మారాడు. ఆ తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సేకరణ చేసినట్టు అతనిపై ఆరోపణలు రుజువు కావడంతో శిక్ష పడింది. ప్రస్తుతం తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.