Begin typing your search above and press return to search.

ఇండియా కూటమికి దూరంగా వైసీపీ ?

జగన్ వైసీపీని ఇండియా కూటమి వైపుగా నడిపిస్తున్నారు అని.

By:  Tupaki Desk   |   27 Oct 2024 11:30 PM GMT
ఇండియా కూటమికి దూరంగా వైసీపీ ?
X

వైసీపీలో షర్మిల వర్సెస్ జగన్ అన్న ఎపిసోడ్ తాజాగా స్టార్ట్ అయింది. ఇది ఎంత దూరం వెళ్తుందో ఎవరికీ తెలియదు. ఇదిలా ఉంటే ఆ మధ్య దాకా ఒక ప్రచారం అయితే సాగుతూ వచ్చింది. జగన్ వైసీపీని ఇండియా కూటమి వైపుగా నడిపిస్తున్నారు అని. ఎండీయేలో టీడీపీ జనసేన ఉన్నందువల్ల జాతీయ స్థాయిలో మరో జాతీయ పార్టీ అవసరం వైసీపీకి ఉందని కూడా అంటూ వచ్చారు.

దాంతో పాటు వైసీపీ ఒటమి పాలు అయిన కొత్తలో ఢిల్లీలో జగన్ నిర్వహించిన ధర్నాలో ఇండియా కూటమి నేతలు ఎక్కువగా కనిపించారు. దాంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. ఈ క్రమంలో ఇటీవల కాలంలో కొందరు ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా జగన్ ఇండియా కూటమిలోకి వస్తామంటే అంతా అనుకూలమేనని అన్నట్లుగా మాట్లాడారు.

ఇవన్నీ ఇలా ఉంటే ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉంటూ వచ్చిన షర్మిల తనకు ఆస్తులను జగన్ సరిగ్గా పంచలేదని ఆరోపిస్తూ జగన్ మీద విమర్శల దాడి చేస్తున్నారు. అయితే ఆమె విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు

ఈ క్రమంలో వారు చేస్తున్న కామెంట్స్ లో కాంగ్రెస్ ప్రస్తావన గట్టిగా వస్తోంది. కాంగ్రెస్ పార్టీ జగన్ ని అక్రమంగా జైలుకు పంపించిందని అటువంటి పార్టీలో షర్మిల చేరి వైఎస్సార్ ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారని అలాగే జగన్ కి కూడా కీడు చేస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ వల్లనే జగన్ కి 16 నెలల జైలు ప్రాప్తించిందని కూడా అంటున్నారు. జగన్ ఏకంగా సోనియాగాంధీని ఎదిరించిన ధీరుడు అని కూడా అంటున్నారు. జగన్ ని వైఎస్సార్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఇబ్బందుల పాలు చేసిందని కూడా వారు చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే కనుక షర్మిల ఇష్యూ కాదు కానీ జగన్ కాంగ్రెస్ మీద గతంలో చేసిన పోరాటాన్ని వైసీపీ నేతలు గుర్తు చాస్తున్నారు.

అంతే కాదు వైఎస్సార్ పేరుని ఎఫ్ ఐ ఆర్ లో కాంగ్రెస్ చేర్చిందని అంటున్నారు. అంతే కాకుండా జగన్ ని టార్గెట్ చేసిందని కూడా వారు ఆరోపిస్తున్నారు అలాంటి పార్టీలో షర్మిల చేరి వైఎస్సార్ కుటుంబాన్ని ఇరకాటంలో పెడుతున్నారని అంటున్నారు.

మరి వీటి భావమేమిటి అన్నది కనుక చూస్తే మాత్రం షర్మిలను విమర్శించే క్రమంలో విజయసాయిరెడ్డి లాంటి పెద్దలే కాంగ్రెస్ తో జగన్ కి వైసీపీకి ఉన్న విభేదాలను గుర్తు చేస్తున్నారు. అంటే ఇండియా కూటమిలో ఫ్యూచర్ లో వైసీపీ చేరదు అన్నట్లుగానే ఈ మాటల భావంగా అర్ధం చేసుకోవాలా అన్న చర్చ వస్తోంది

ఎందుకంటే షర్మిల కాంగ్రెస్ లో చేరి వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తోందని, ఇబ్బందుల పాలు చేస్తోందని చెప్పిన వారు తాము కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిలోకి చేరితే విమర్శలు అవే తమకు కూడా తగులుతాయన్న ఆలోచన ఉంటుంది కదా అంటున్నారు.

అంటే బయట జరుగుతున్న ప్రచారం ఎలా ఉన్నా జగన్ వరకూ చూస్తే కనుక ఇండియా కూటమిలోకి వైసీపీ వెళ్ళే చాన్స్ అయితే లేదు అన్నదే వైసీపీ సీనియర్ల మాటలకు అర్ధం అనుకోవాలా అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా షర్మిలను విమర్శించే క్రమంలో కాంగ్రెస్ ని టీడీపీని కూడా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు.

మరి జాతీయ రాజకీయాల్లో వైసీపీ ఆలోచనలు ఎలా ఉంటాయో ఈ రోజుకు అయితే తెలియదు అని అంటున్నారు. అయినా సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళకు పైగా సమయం ఉంది కాబట్టి అప్పటికి అనేక రాజకీయ సమీకరణలు చోటు చేసుకుంటాయి కాబట్టి ఈ మాటలు ఈ వ్యాఖ్యలు నాటికి ఏ రూపంగా మారుతాయో ఎవరూ చెప్పలేరని కూడా అంటున్నారు.