వైసీపీలో జమిలి నిర్ణయం వెనుక!
ఈ పరిణామాలతో పాటు.. నాయకులకు ఎదురవు తున్న ఇబ్బందులు కూడా పార్టీని కోలుకోలేకుండా చేశాయి.
By: Tupaki Desk | 26 Dec 2024 11:30 AM GMTకేంద్రంలోని రెండు కూటముల్లో దేనికి మద్దతు ఇవ్వాలన్న విషయంపై వైసీపీ యూటర్న్ తీసుకుంది. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయింది. దీంతో సహజంగానే పార్టీపై దాడులు ప్రారంభమయ్యాయి. నాయకులు తిరోగమనం పట్టారు. ఈ పరిణామాలతో పాటు.. నాయకులకు ఎదురవు తున్న ఇబ్బందులు కూడా పార్టీని కోలుకోలేకుండా చేశాయి. దీంతో కేంద్రం నుంచి సహకారం కోరుకున్నారు. దీర్ఘకాలంగా కేంద్రంలోని బీజేపీతో అప్రకటిత స్నేహం చేస్తున్న విషయం తెలిసిందే.
దీంతో తమపై జరుగుతున్న దాడుల విషయంలో కేంద్రం స్పందిస్తుందని భావించారు. కానీ.. స్పందన రాలేదు. రాష్ట్రంలో కూడా.. బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో కేంద్రంలోని పెద్దలు పెద్దగా పట్టించుకో లేదు. ఈ పరిణామాల క్రమంలోనే ఢిల్లీలో జగన్ ధర్నా, నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనకు అనూహ్యంగా ఇండియా కూటమి నాయకుల నుంచి మద్దతు లభించింది. దీంతో వైసీపీ ఇండియా వైపు మొగ్గు చూపుతున్నట్టు చర్చ జరిగింది.
దీనికితోడు.. కాంగ్రెస్ నేతృత్వం కాకుండా.. ఇంకెవరు ఇండియా కూటమికి మద్దతిచ్చినా.. తమకు అభ్యం తరం లేదన్న సంకేతాలు కూడా వైసీపీ నుంచి వచ్చాయి. దీంతో ఇక, వైసీపీ కేంద్రంలో ఇండియా కూట మి వైపు మొగ్గు చూపుతోందన్న చర్చ మొదలైంది. దీనికి కీలక నేత విజయసాయి రెడ్డి వంటి వారు కూడా.. దన్నుగా నిలిచారు. ఎందుకు ఇండియా కూటమితో ఉండకూడదని ఆయన ప్రశ్నించారు. ఈ పరిణామం తో ఇండియా కూటమివైపు వైసీపీ మొగ్గు చూపుతోందని అంచనాలు వేసుకున్నారు.
అయితే.. అనూహ్యంగా వైసీపీ ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. జమిలి ఎన్నికల బిల్లును లోక్‌సభలో ప్రవే శ పెట్టడానికి ముందు బీజేపీ పెద్దలు.. వైసీపీ కీలక నాయకుడు.. సాయిరెడ్డితో భేటీ అయ్యారు. ఆ తర్వాత.. ఏం జరిగిందో ఏమో.. అనూహ్యంగా జమిలి ఎన్నికలకు వైసీపీ జై కొట్టింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం అం టూ.. వైసీపీ పార్లమెంటులో మద్దతు తెలిపింది. ఇది తక్షణ అవసరం అంటూ.. రాజ్యసభలో సాయిరెడ్డి కూడా చెప్పుకొచ్చారు. దీంతో జమిలిని వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమికి వైసీపీ దూరం జరిగినట్టు స్పష్టమైంది. మొత్తంగా కూటమికి మద్దతు ఇచ్చే విషయంలో యూటర్న్ తీసుకోవడం.. వెనుక కేసుల వ్యవహారాలే ఉన్నాయన్నది రాజకీయ వర్గాల టాక్!!