Begin typing your search above and press return to search.

మరో మలుపు : ఈ రోజు వర్కింగ్ డే కాదు : అసెంబ్లీపై కూటమి టాక్.. వైసీపీకి షాక్!

ఈ రోజు నుంచి బడ్జెట్ సెషన్ మొదలైనా అటెండెన్స్ కౌంటింగ్ రేపటి నుంచే ఉంటుందని అసెంబ్లీ సిబ్బంది చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   24 Feb 2025 11:26 AM GMT
మరో మలుపు : ఈ రోజు వర్కింగ్ డే కాదు : అసెంబ్లీపై కూటమి టాక్.. వైసీపీకి షాక్!
X

ఏపీ అసెంబ్లీలో టెక్నిక్ వార్ మరో మలుపు తిరిగింది. బడ్జెట్ భేటీలో గవర్నర్ ప్రసంగానికి హాజరై మమ అనిపించిన వైసీపీకి అసెంబ్లీ సిబ్బంది షాక్ ఇచ్చారంటున్నారు. ఈ రోజు నుంచి బడ్జెట్ సెషన్ మొదలైనా అటెండెన్స్ కౌంటింగ్ రేపటి నుంచే ఉంటుందని అసెంబ్లీ సిబ్బంది చెబుతున్నారు. దీంతో వైసీపీపై 60 రోజుల అనర్హత కత్తి వేలాడుతోందనే అంటున్నారు.

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి వచ్చి అనంతరం వాకౌట్ చేసిన వైసీపీ టెక్నికల్ గా సభకు హాజరైనట్లేనని చెబుతోంది. అయితే.. ఈ రోజు సభలో బిజినెస్ జగరలేదు కనుక ఆ హాజరు చెల్లదని.. రేపటి నుంచి వచ్చే ఎమ్మెల్యే హాజరే తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో డిప్యూటీ సీఎం రఘురామ రాజు హెచ్చరికలు మరోసారి చర్చకు తావిస్తున్నాయి. సభకు వరుసగా 60 రోజులు గైర్హాజరైతే రాజ్యాంగంలో ఆర్టికల్ 101 క్లాజ్ ప్రకారం స్పీకర్ అనర్హత వేటు వేయొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ రోజు సభకు వచ్చిన వైసీపీ నేతలు 60 రోజుల హాజరు నిబంధనను బ్రేక్ చేశామని సంబరపడ్డారు. కానీ, ఇంతలోనే ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం వైసీపీని షాక్ కు గురిచేసిందంటున్నారు.

అనర్హత వేటు నుంచి తప్పించుకోవడాకి ఈ రోజు సభకు వైసీపీ హాజరైందని ప్రచారం జరగుతుండగా, అసలు ఈ రోజు అసెంబ్లీ జరిగినట్లు పరిగణించరని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. తమ వాదనకు సపోర్టుగా కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలంటే స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాన్నే వర్కింగ్ డే అంటారని చెబుతున్నారు. పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం ముందు గవర్నర్ ప్రసంగం ఉంటుందని, ఇది కేవలం కస్టమరీ సెషన్ మాత్రమేనంటూ ప్రభుత్వం చెబుతోంది. స్పీకర్ ఆధ్వర్యంలో జరిగే సమావేశాల్లో అసెంబ్లీ బిజినెస్ జరుగుతుంది కనుక ఆ రోజునే వర్కింగ్ డేగా పరిగణిస్తారని చెబుతున్నారు. దీంతో వైసీపీ ఇరకాటంలో పడినట్లేనని టాక్ వినిపిస్తోంది.

గవర్నర్ ప్రసంగానికి వెళ్లిన వైసీపీ టెక్నికల్ గా తప్పించుకుందని అనుకుంటుండగా, ప్రభుత్వం చెప్పిన సమాచారం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గవర్నర్ ప్రసంగానికి వెళ్లినందున రేపటి నుంచి జరిగే సమావేశాలకు వెళ్లకూడదని ఇప్పటికే వైసీపీ నిర్ణయం తీసుకుంది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలకు 60 రోజుల సభకు గైర్హాజర్ అనర్హత ప్రమాదం పొంచేవుందని అంటున్నారు.