Begin typing your search above and press return to search.

కొడాలి నాని మీద గట్టిగానేనట ?

ఇపుడు అది ఇంకాస్తా ముందుకు వచ్చి కొడాలి నాని వైపుగా సాగుతోంది అని అంటున్నారు. ఇప్పటికే టీడీపీ క్యాడర్ లో ఒక రకమైన అసంతృప్తి ఉంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   28 Nov 2024 1:30 AM GMT
కొడాలి నాని మీద గట్టిగానేనట ?
X

వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి నాని విషయంలో గట్టిగానే కూటమి పెద్దలు ఆలోచన చేస్తున్నారా అంటే ప్రచారం మాత్రం అవును అన్నట్లుగా ఉంది. ముందుగా వైసీపీ సోషల్ మీడియా క్యాడర్ మీద కేసులు పెట్టిన నేపధ్యం ఉంది. ఆ తరువాత ఒక మాదిరి నేతల మీద కేసులు పడుతున్నాయి.

ఇపుడు అది ఇంకాస్తా ముందుకు వచ్చి కొడాలి నాని వైపుగా సాగుతోంది అని అంటున్నారు. ఇప్పటికే టీడీపీ క్యాడర్ లో ఒక రకమైన అసంతృప్తి ఉంది అని అంటున్నారు. నేరుగా చంద్రబాబు లోకేష్ ల మీద నోరు చేసుకున్న వైసీపీ పెద్ద నాయకుల విషయంలో ఏమి చేశారు అని వారు అంటున్నారు. వారి మీద కూడా కేసులు పెట్టాలని కోరుతున్నారు.

అయితే ఇలా కేసు పెడితే అలా బెయిల్ వచ్చేట్లుగా కాకుండా గట్టిగానే ఉండాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇక చూస్తే గుడివాడలో జగనన్న కాలనీలకు సంబంధించి కేసులు పెట్టారని అంటున్నారు. దాంతో పాటు అనేక మంది టీడీపీ కార్యకర్తలు కొడాలి నాని మీద విశాఖ సహా ఇతర ప్రాంతాలలో పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేశారు.

ఆయన అనుచితంగా మాట్లాడారని, టీడీపీ పెద్దల మీద వాడిన భాష సరిగ్గా లేదని కంప్లైంట్ చేశారు. అయితే అప్పట్లోనే నానికి పోలీసులు నోటీసులు ఇస్తారు అని అనుకున్నారు. అయితే దానికి ఒక వ్యూహం ఉందని అంటున్నారు.

కొడాలి నాని వంటి వారి మీద కేసులు పెడితే గట్టిగా ఉండాలని బెయిల్ సైతం దొరకని విధంగా ఉండాలని వ్యూహరచన చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి చూస్తూంటే కొడాలి నానిని కొంతకాలం జైలులో ఉంచాలని పక్కా స్కెచ్ గీస్తున్నారని అంటున్నారు.

ఇక కొత్త కేసులతో పాటు నానికి సంబంధించి కొన్ని పాత కేసులను కూడా బయటకు తీసే పనిలో పోలీసులు ఉన్నారని ప్రచారం సాగుతఒంది. పకడ్బందీగానే కేసులను పెట్టాలని బలమైన సాక్ష్యాలను ఉంచాలని కూడా ఆలోచిస్తున్నారని ప్రచారం సాగుతోంది.

ఇక కొడాలి నాని గుడివాడకు రావడం లేదు అంటున్నారు. ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో కొందరు ముఖ్య నేతలకే తెలుసు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నానికి ముఖ్య అనుచరులుగా ఉన్న వారి మీద కూడా కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం అవుతోంది అని అంటున్నారు. కొడాలి నానికి బలమైన అనుచర వర్గం ఉంది. వారిలో కీలక నేతలను గుర్తించి వారి మీద గురి పెడుతున్నట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు లోకేష్ ల మీద కొడాలి నాని చేసిన వ్యాఖ్యలతో ఆయనను అరెస్ట్ చేసి తీరాల్సిందే అన్న డిమాండ్ కూటమి క్యాడర్ లో ఉందని అంటున్నారు. దాంతో వేగంగానే పావులు కదుపుతున్నారని అంటున్నారు. సాధ్యమైనంత తొందరలోనే కొడాలి నాని అరెస్ట్ కి సంబంధించిన వార్త వినిపిస్తుంది అని అంటున్నారు. మిగిలిన వారి విషయం ఒక ఎత్తు, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ ప్రభుత్వంలో మూడేళ్ల పాటు మంత్రిగా పనిచేసి ఏపీ పాలిటిక్స్ లో ఒకనాడు ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కొడాలి నాని అరెస్ట్ అంటే రాజకీయంగా ప్రకంపనలు సృష్టించడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.