జగన్ కు అదానీ లంచాలు అబద్ధం.. ఇదిగో నిజం... వైసీపీ వివరణ!
దీంతో... ఈ అభియోగాలపై వైసీపీ స్పందించింది.
By: Tupaki Desk | 22 Nov 2024 7:21 AM GMTసోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వానికి అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ రూ.1,750 కోట్ల మేర లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేషన్ కోర్టులో పేర్కొందనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో... ఈ అభియోగాలపై వైసీపీ స్పందించింది.
అవును... ఏపీలో భారీ సోలార్ పవర్ ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అదానీ సంస్థల నుంచి నాటి సీఎం జగన్ కు రూ.1,750 కోట్ల లంచం ఇచ్చారంటూ వస్తోన్న ఆరోపణలపై వైసీపీ స్పందించింది. ఇందులో భాగంగా.. అసలు నాడు ఏమి జరిగిందనే విషయాన్ని సవివరంగా వివరించే ప్రయత్నం చేసింది.ఈ మేరకు.. ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ సందర్భంగా... ఏపీ విద్యుత్ సంస్థలు వ్యవసాయ రంగానికి ఏడాదికి 12,500 మెగావాట్ల ఉచిత విద్యుత్ ను సరఫరా చేస్తున్నాయని.. ఈ ఛార్జీలను డిస్కంలకు రాయితీ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పింది.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ను రైగులకు హక్కుగా కల్పించాలనే లక్ష్యంతో 7 వేల మెగావాట్ల విద్యుత్ ను అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున కొనుగోలుకు సెకీతో 2021 డిసెంబర్ 1న ఏపీ డిస్కం లు ఒప్పందం చేసుకున్నాయని వెల్లడించింది.
అయితే... రాష్ట్రంలో గత ప్రభుత్వల విధానాల కారణంగా అధిక టారిఫ్ లతో విద్యుత్ ఒప్పందాలు అమలు చేశారని.. రాష్ట్ర డిస్కంలపై ఇవి ప్రభావం చూపకుండా పంపిణీ వ్యవయంలో భాగంగా విద్యుత్ కొనుగోలు ఖర్చు సుమారు రూ. కిలోవాట్ కు రూ.5.10 చొప్పున చెల్లించడం ప్రభుత్వానికి భారంగా మారిందని వెల్లడించింది.
ఈ సమస్యను పరిష్కరించే ఉద్దేశ్యంతోనే 2020లో అప్పటి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి చేసే సోలార్ పార్కులలో 10,000 మెగావాట్ల సోలార్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిందని.. దీనికి సంబంధించి ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా నవంబర్ 2020లో 6,400 మెగావాట్ల సౌర అభివృద్ధి కోసం టెండర్ లు పిలిచిందని తెలిపింది.
ఇందులో 24 బిడ్ లు కిలో వాట్ కు రూ.2.49 నుంచి రూ.2.58 వరకూ చెల్లించేలా వచ్చాయని.. అయితే.. టెండర్ కు కొన్ని న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమవడం వల్ల ఈ టెండర్ ప్రక్రియ నిలిచిపోయిందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అంతరాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీలు (ఐ.ఎస్.టీ.ఎస్.) మినహాయించి యూనిట్ రూ.2.49 చొప్పున విద్యుత్ సరఫరా చేస్తామమంటూ సెకీ ప్రతిపాదించిందని చెప్పింది.
ఈ నేపథ్యంలో యూనిట్ రూ.2.49 చొప్పున 7,000 మెగావాట్ల విద్యుత్ ను 25 ఏళ్లపాటు సరఫరా చేసేలా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని.. ఇందులో 2024-25లో మూడు వెల మెగావాట్లు, 2025-26లో మూడు వేల మెగావాట్లు, 2026-27లో వెయ్యి మెగా వాట్లక్ను ఐ.ఎస్.టీ.ఎస్. లను మినహాయించుకుని సరఫరా చేయడానికి సెకీ అంగీకరించిందని స్పష్టం చేసింది.
ఈ ఒప్పందాన్ని 2021 నవంబర్ 11న ఏప్పీ.ఈ.ఆర్.సీ. ఆమోదించింది.. ఆ తర్వాత 2021 డిసెంబర్ 1న విద్యుత్ కొనుగోలుకు సెకీతో డిస్కం లు ఒప్పందం చేసుకున్నాయి.. ఈ సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి అత్యంత చౌకగా విద్యుత్ అందుబాటులోకి వస్తుంది దీనివల్ల ప్రభుత్వానికి ఏటా రూ.3,7000 కోట్ల మేర ఆదా అవుతుందని స్పష్టం చేసింది.
ఇదే సమయంలో... ఈ ఒప్పందం 25 సంవత్సరాల కాలవ్యవధికి సంబంధించినది కాబట్టి.. ఈ ఒప్పందం వల్ల రాష్ట్రానికి మొత్తం ప్రయోజనం అపారంగా ఉంటుందని స్పష్టం చేసింది.