Begin typing your search above and press return to search.

కార్యకర్తలకు తిప్పలు.. జగన్ నిప్పులు.. నేతల ట్రిప్పులు..!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ - బీజేపీ - జనసేన పార్టీలతో ఉన్న కూటమి ప్రభుత్వం కొలువుదీరింది.

By:  Tupaki Desk   |   8 Nov 2024 6:28 AM GMT
కార్యకర్తలకు తిప్పలు.. జగన్  నిప్పులు.. నేతల ట్రిప్పులు..!
X

ఏపీలో గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ.. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. 2019లో 151 స్థానాలు కైవసం చేసుకున్న ఆ పార్టీ.. కారణాలు ఏవైనప్పటికీ 2024లో 11 స్థానాలకు పరిమితమైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ - బీజేపీ - జనసేన పార్టీలతో ఉన్న కూటమి ప్రభుత్వం కొలువుదీరింది.

ఈ సమయంలో... వైసీపీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. సోషల్ మీడియాలో పోస్టుల పేరు చెప్పి 41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేస్తున్నారని.. ఆ విషయం కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం లేదని.. అరెస్ట్ చేసినట్లు చెప్పినప్పటికీ కోర్టులో హాజరుపరచడం లేదని వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా మీడియా ముందుకు వచ్చిన జగన్... ఈ విషయాలపై ప్రభుత్వం తీరును ఎండగట్టారు.. పోలీసులకు సూచనలతో కూడిన హెచ్చరికలు చేశారు! మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా అన్ని వర్గాలనూ మోసం చేస్తున్నారని జగన్ ఫైరవుతున్నారు. ఈ నేపథ్యంలో... వైసీపీ నేతలు ఒకరితర్వాత ఒకరు హాలిడేస్ కి వెళ్తున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అవును... వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా హాలిడేస్ కు వెళ్తున్నారు. ఇందులో భాగంగా... 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం మాజీ మంత్రి రోజా కుటుంబ సభ్యులతో సహా విదేశాల్లో కనిపించారని చెప్పే ఫోటోలు నెట్టింట హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రోజా పార్టీ మార్పుపై ప్రచారాలు జరిగాయి!


ఇక వైసీపీ కీలక నేతల్లో ఒకరు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇటీవల యూరోపియన్ కంట్రీస్ ట్రిప్పుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విదేశాల్లో సరికొత్త లుక్ లో అంబటి రాంబాబు దర్శనమిచ్చారు. ఈ పిక్స్ నెట్టింట హల్ చల్ చేశాయి. కామెంట్ సెక్షన్ లో నెటిజన్లు క్రియేటివిటీకి పని చెప్పారు!


ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ కీలక నేతల్లో మరో కీలక నేత అయిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హాలిడేకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఈ శీతాకాలం ఎంట్రన్స్ లో కాశ్మీర్ లోయలో, మంచు పర్వత శ్రేణిలో ఆయన విహార యాత్రకు వెళ్లినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలూ నెట్టింట దర్శనమిస్తున్నాయి!


మరోపక్క వైసీపీ అధినేత జగన్ కూడా వారాంతాలను ఆస్వాధిస్తున్నారని అంటున్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు వైసీపీ నేతలు హాలిడేస్ కి వెళ్లి వస్తుండటంపై ఆసక్తికర చర్చ జరుగుంది. ఇందులో భాగంగా... నియోజకవర్గాల్లో కార్యకర్తలు సోషల్ మీడియా పోస్టుల కారణాలతో కేసులు ఎదుర్కొంటుంటే.. నేతలు అందుబాటులో లేకపోతే ఎలా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

ఇక సంక్రాంతి తర్వాత ఏపీలో కథ వేరేగా ఉంటుందని.. సంక్రాంతి నాటికి కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పిరియడ్ ముగుస్తుంది కాబట్టి.. ఇక జగన్, నేతలు జనాల్లోనే ఉంటారని.. ఇది ఫైర్ అవ్వడానికి ముందు చిన్న ఛిల్ అంతే అని మరికొందరు స్పందిస్తున్నారు. ఏది ఏమైనా... వైసీపీ నేతల ట్రిప్పుల వ్యవహారం వైరల్ గా మారింది.