Begin typing your search above and press return to search.

టీడీపీ టచ్ లోకి వైసీపీ నేతలు ?

మరి వివిధ జిల్లాలలో వైసీపీ నుంచి పెద్ద తలకాయలను కూడా టీడీపీలో చేర్పించే కార్యక్రమం కూడా రానున్న రోజులలో జరుగుతుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   9 Oct 2024 6:52 AM GMT
టీడీపీ టచ్ లోకి  వైసీపీ నేతలు ?
X

ఏపీలో మరోమారు రాజకీయ జంపింగులకు ముహూర్తం కుదిరింది. వైసీపీ ఏరి కోరి ఎంపిక చేసిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు తమ పదవులకు గత ఆగస్ట్ నెలలో స్వచ్చందంగా రాజీనామాలు చేసి వైసీపీకి గుడ్ బై కొట్టారు. వారు ఇపుడు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నారు.

వైఎస్సార్ కి జగన్ కి ఎంతో విధేయతతో ఉండే మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడడం ఒక సంచలనమే అయింది. అలాగే టీడీపీలోనే ఉంటూ 2019 ఎన్నికల వేళ వైసీపీలోకి వచ్చి ఆ పార్టీ ద్వారా రాజ్యసభ మెట్లెక్కి తన చిరకాల కోరికను తీర్చుకున్న బీద మస్తాన్ రావు కూడా సొంత గూటికి చేరుకుంటున్నారు. ఈ ఇద్దరికీ చంద్రబాబు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించనున్నారు.

అయితే ఈ ఇద్దరు నేతలతో పాటు ఇంకా ఎవరెవరు టీడీపీలోకి చేరుతారు అన్నది ఆసక్తిగా మారింది. విషయానికి వస్తే ఏపీలోని చాలా జిల్లాల నుంచి వైసీపీ నేతలు టీడీపీ వారితో టచ్ లో ఉంటున్నారు అని అంటున్నారు. వారంతా తాము పార్టీలోకి రావాలని చూస్తున్నారు అని చెబుతున్నారు.

అయితే ఆయా జిల్లాల పరిస్థితులు, రాజకీయ సామాజిక సమీకరణలు అన్నీ బేరీజు వేసుకున్న మీదటనే టీడీపీ అధినాయకత్వం వారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అంతే కాదు వారి చేరిక వల్ల పార్టీకి అదనంగా ఏదైనా మేలు జరుగుతుంది అనుకుంటేనే పార్టీలోకి రానిస్తోంది. లేకపోతే నో చెప్పేస్తోంది.

అయితే వైసీపీని బాగా వీక్ చేయాలీ అంటే వారూ వీరూ అని చూడకుండా నోరున్న బలమున్న నేతలను అందరికీ పార్టీలో చేర్చుకోవాలన్న మరో ప్లాన్ కూడా ఉంది అని అంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఇపుడిపుడుదే కుదుట పడుతోంది. అధికారంలోకి వచ్చాక పదవుల పందేరం కూడా మెల్లగా మొదలైంది.

మూడు పార్టీలకు చెందిన ఆశావహులకే ఈ పదవులు పంచాల్సి రావడంలోనే ఎన్నో చిక్కులూ చికాకులూ ఉన్నాయి. దాంతో ఇపుడు కొత్తగా చాలా మందిని తీసుకుని రచ్చ చేసుకోవడం అవసరమా అన్న చర్చ కూడా ఉంది. అయితే వచ్చిన వారిని కాదనకుండా చేర్చుకుని వారికి ఏ పదవులూ ఇప్పట్లో ఇవ్వలేమని చెప్పి ఆ కండిషన్ మీదనే రానీయాలని కూడా మరో ప్లాన్ ఉంది.

ఏది ఏమైనా చూస్తే కనుక వైసీపీని బలహీనం చేయాలన్నది టీడీపీ అజెండాగా ఉంది. ఇక వైసీపీ నేతలను టీడీపీ చేర్చుకోకపోతే వారికి ఆల్టర్నేషన్ గా జనసేన కూడా ఉంది. దాంతో వారు అటు వైపు మళ్ళుతారు అన్నది కూడా పసుసు శిబిరంలో చర్చగా ఉంది. అందుకే వారిని తమ వైపే ఉంచుకునేలా ఈ చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు అని అంటున్నారు.

ఇక వీటిని కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా నిర్వహిస్తే పార్టీకి పాజిటివ్ సిగ్నల్స్ వెళ్తాయని అదే సమయంలో వైసీపీలో కూడా జోష్ తగ్గిస్తూ ఆ పార్టీని నెమ్మదిగా వీక్ చేయవచ్చు అన్న ఆలోచన కూడా ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా కూడా వైసీపీని టీడీపీ టార్గెట్ చేసినట్లే ఉంది

దానికి తగినట్లుగానే వైసీపీ నుంచి వెళ్ళే నేతలను ఆ పార్టీ అసలు పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. ఇక అధికారం ఎటూ ఉంది. రాజకీయాల్లో ఉన్న వారికి అధికారం అండ కావాలి. అయిదేళ్ల కాలం వారికి చాలా విలువ అయినది. అందుకే ఫ్యాన్స్ నీడను ఉండలేక సైకిలెక్కుదామని అనుకుంటున్న వారికి పసుపు పార్టీ బాగానే సమాదరిస్తోంది అని అంటున్నారు. మరి వివిధ జిల్లాలలో వైసీపీ నుంచి పెద్ద తలకాయలను కూడా టీడీపీలో చేర్పించే కార్యక్రమం కూడా రానున్న రోజులలో జరుగుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.