Begin typing your search above and press return to search.

వైసీపీ డోర్స్ ఓపెన్.....చేరేది ఎవరు ?

ఏపీలో విపక్ష పాత్రలో వైసీపీ ఉంది. ఆ పార్టీ గత తొమ్మిది నెలలుగా పరిమితమైన ప్రతిపక్ష పాత్రనే పోషిస్తోంది.

By:  Tupaki Desk   |   16 March 2025 6:00 PM IST
వైసీపీ డోర్స్ ఓపెన్.....చేరేది ఎవరు ?
X

ఏపీలో విపక్ష పాత్రలో వైసీపీ ఉంది. ఆ పార్టీ గత తొమ్మిది నెలలుగా పరిమితమైన ప్రతిపక్ష పాత్రనే పోషిస్తోంది. క్యాడర్ లో ఇంకా జోష్ రావడం లేదు. లీడర్లలో నిస్తేజం అయితే వీడడం లేదు. అయితే కూటమి ప్రభుత్వం పది నెలల పాలన మీద ఇపుడిపుడే జనాలకు ఒక స్పష్టత వస్తోంది. ప్రయారిటీలు కూడా తెలుస్తున్నాయి.

కూటమి ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్న కొన్ని సెక్షన్లలో అయితే తమ హామీలు తీరడం లేదని వైరాగ్యం వస్తోంది. దాంతో ఏమైనా గ్రాఫ్ వైసీపీ వైపు మళ్ళుతుందా అన్న చర్చ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ మీద అలిగి ఆ పార్టీ టికెట్లు ఇవ్వలేదని కోపగించి పార్టీని ఎన్నికల ముందు వీడి వెళ్ళిన వారు కాస్తా ఇపుడు కొందరైనా వెనక్కి రావాలని అనుకుంటున్నారుట.

నిజం చెప్పాలంటే వీరంగా వైసీపీకి చెందిన వారే. వారే అయిదేళ్ళ పాటు అధికారంలో ఉన్నారు. అయితే కూటమి పార్టీలలో చేరితే తమకు అధికారంలో వాటా దక్కుతుందని భావించారు. ఆ విధంగా వారు ఆ వైపునకు వెళ్ళారు. కానీ అధికారంలోకి కూటమి వచ్చింది కానీ అక్కడ పదవులకు బోలెడన్ని లెక్కలు ఉన్నాయి.

ఏ పదవి వచ్చినా మూడు పార్టీలూ సర్దుకోవాలి. పైగా అనేక సమీకరణలు పనిచేస్తాయి. దాంతో బయట నుంచి వెళ్ళిన వారికీ మరీ ముఖ్యంగా వైసీపీలో అయిదేళ్ళ పాటు అధికారం అనుభవించిన వారికి పదవులు ఇవ్వడం అంటే అసలు కాని పనిగా ఉంది. దాంతో వారిలో కొందరికి తొందరగా జ్ఞానోదయం అయి ఘర్ వాపసీఎ అన్నట్లుగా వెనక్కి రావాలని చూస్తున్నారుట.

అలా చూస్తే కనుక అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తిరిగి వైసీపీ వైపు చూస్తున్నారని అంటున్నారు. ఆయనకు ఎన్నికల ముందు టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించారు. దాంతో ఆయన ఆవేశపడి బీజేపీలో చేరారు. ఇపుడు అక్కడ ఉండలేక ఆయా వైసీపీ నీడకు రావాలని చూస్తున్నారు. ఆయన తాను వైసీపీలో చేరుతాను అని కబురు పంపారని తెలుస్తోంది. ఆయనను చేర్చుకోవడానికి జగన్ ఓకే చెప్పారని అంటున్నారు.

ఒక మంచి ముహూర్తం చూసి ఆయన మెడలో కండువా కప్పి తిరిగి పాత సభ్యుడిగా చేర్చుకోవడానికి చూస్తున్నారుట. ఆయన ఒక్కరే కాదు చాలా మంది రాయలసీమలో వైసీపీ నుంచి ఇతర పార్టీలలో చేరారు. వారిని కూడా చేర్చుకోవడానికి వైసీపీ చూస్తోంది అని అంటున్నారు.

ఈ విధంగా వైసీపీ ద్విముఖ వ్యూహంతో ఉంది అని అంటున్నారు. ఒక వైపు వైసీపీ పాత కాపులను తీసుకుంటూ మరో వైపు కాంగ్రెస్ లోని నేతలను రప్పించుకుంటూ వైసీపీ బలంగా ఉందని చాటి చెప్పాలని చూస్తోంది అని అంటున్నారు. ఇక కూటమిలోని పార్టీల నేతలు అయితే ఇప్పట్లో రారు అని వైసీపీ డిసైడ్ అయింది అని అంటున్నారు.

కానీ నాలుగేళ్ళకు పైగా కూటమిని అధికారం ఉంది. దాంతో వారు వచ్చేది ఉండదని అంటున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీ డోర్స్ అన్నీ ఓపెన్ చేసి మరీ వచ్చే వారిని వచ్చినట్లుగా చేర్చుకోవాలని చూస్తోందిట. ఒక విధంగా వైసీపీలో వచ్చిన మార్పుగానే దీనిని చూస్తున్నారు. పార్టీని ఒకసారి వీడితే వారిని చేర్చుకోవడానికి వైసీపీ అధినాయకత్వం సుముఖంగా ఉండేది కాదు. కానీ ఇపుడు మాత్రం పార్టీ కోసం ఈ రకంగా చేస్తున్నారు అని అంటున్నారు. సో వైసీపీ డోర్స్ తెరిస్తే చేరేవారు ఎవరు అన్నదే పెద్ద చర్చగా ఉంది మరి.