Begin typing your search above and press return to search.

వైసీపీలో వారంతా సైలెంట్... ఎందుకలా ?

వైసీపీ అధికారంలో ఉన్న అయిదేళ్లలో ఒక వెలుగు వెలిగిన నేతలు అంతా ఇపుడు ఫుల్ సైలెంట్ అవుతున్నారు.

By:  Tupaki Desk   |   7 Dec 2024 4:51 AM GMT
వైసీపీలో వారంతా సైలెంట్... ఎందుకలా ?
X

వైసీపీ అధికారంలో ఉన్న అయిదేళ్లలో ఒక వెలుగు వెలిగిన నేతలు అంతా ఇపుడు ఫుల్ సైలెంట్ అవుతున్నారు. పార్టీని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. అధినాయకత్వం సమీక్షలు చేసినా లేక ప్రజలతో మమేకం కావాలని కోరినా పెద్దగా రియాక్టు కావడం లేదు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ అత్యంత పటిష్టంగా ఉంది. వైసీపీ వేవ్ లో సైతం విశాఖ సిటీలో నాలుగు అసెంబ్లీ సీట్లను టీడీపీ గెలుచుకుని సత్తా చాటింది.

ఇక 2024 ఎన్నికలకు వచ్చేసరికి కూటమి పెను ప్రభంజనంలో విశాఖ మొత్తం రూరల్ సిటీ అన్న తేడా లేకుండా అన్ని చోట్లా కూటమి అభ్యర్ధులే గెలిచారు. అలా కూటమిలోని మూడు పార్టీలూ ఫుల్ యాక్టివ్ మోడ్ లో పనిచేస్తూంటే వైసీపీలో మాత్రం నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోంది.

పార్టీలో మంత్రులుగా పనిచేసిన వారు సీనియర్ నేతలు కూడా సందడి చేయడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదటి మూడేళ్ళ పాటు మంత్రిగా పనిచేసిన భీమిలీ మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు ఇప్పుడు గప్ చుప్ అయ్యారు అని అంటున్నారు. ఆయన తన విద్యా సంస్థలను తన వ్యవహారాలను చూసుకుంటూ వాటికే పరిమితం అయ్యారని చెబుతున్నారు

ఆయనకు వైసీపీ పెద్ద పీట వేసింది మంత్రి పదవి పోగానే జిల్లా ప్రెసిడెంట్ గా కూడా చేసింది. అయితే ఆయన ఇపుడు పార్టీలో అయితే అంతగా కనిపించడం లేదు. తన వ్యాపార వ్యవహారాలకు ఈ రాజకీయాలు అడ్డు వస్తాయని ఆలోచిస్తున్నారేమో అని కూడా అంటున్నారు. అదే విధంగా చూస్తే ఉప ముఖ్యమంత్రిగా చేస్తూ కీలకమైన పంచాయతీ రాజ్ శాఖలను గ్రామీణాభివృద్ధి శాఖలను రూరల్ జిల్లాకు చెందిన బూడి ముత్యాలనాయుడుకు వైసీపీ అధినాయకత్వం అప్పగించింది. ఆయన కుమార్తెకు 2024 ఎన్నికల్లో మాడుగుల టికెట్ ఇచ్చి ఆయనను అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీకి దించింది.

అయితే ఓటమి పాలు అయ్యాక బూడి ముత్యాల నాయుడు పెద్దగా కనిపించడం లేదు అని అంటున్నారు. ఆయనను అనకాపల్లి వైసీపీ అధ్యక్షుడిగా పార్టీ నియమించినా ఆయన ఎక్కడా పెద్దగా సీన్ లోకి రావడం లేదు అని అంటున్నారు. తనకు మాడుగుల సీటునే 2024 ఎన్నికల్లో ఇస్తే గెలిచి వచ్చేవాడిని అన్న భావన ఆయనలో ఉందని అంటున్నారు. అలా హ్యాట్రిక్ విక్టరీ పార్టీ నిర్ణయం వల్ల పోయిందని ఆయనలో అసంతృప్తి అయితే ఉందని చెబుతున్నారు

ఏది ఏమైనా బూడి మాత్రం యాక్టివ్ గా అయితే లేరు అని అంటున్నారు. ఇక గుడివాడ అమర్నాథ్ కి వైసీపీ ఇచ్చిన అవకాశాలు ఎవరికీ ఇవ్వలేదు. ఆయనకు అనకాపల్లి నుంచి ఎంపీగా ఎమ్మెల్యేగా, అలాగే గాజువాక నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చింది. ఇక 2014 నుంచి 2019 మధ్యలో ఆయననె ఉమ్మడి విశాఖ జిల్లాకు అధ్యక్షుడిగా ఇఊడా చేసింది. ఇపుడు మరో మారు విశాఖ జిల్లా బాధ్యతలు అప్పగించింది. అయితే గుడివాడ దూకుడు అయితే గతంలో ఉన్నంతగా లేదని అంటున్నారు. ఆయన కూడా స్పీడ్ పెంచాల్సి ఉందని చెబుతున్నారు.

మొత్తానికి చూస్తే వైసీపీలో మంత్రులుగా చేసిన వారే బాధ్యత తీసుకుని జనంలోకి రాకపోతే పార్టీ క్యాడర్ కోసం నిలబడి ముందు ఉండకపోతే మిగిలిన వారు ఎందుకు వస్తారు అన్న చర్చ సాగుతోంది. వైసీపీ అధినాయకత్వం ఈ నెల 13 నుంచి దశల వారీగా ఆందోళలకు పిలుపు ఇచ్చింది. దాంతో మరి ఇప్పటికైనా ఈ మాజీ మంత్రులతో పాటు కీలక నేతలు అంతా జనంలోకి వస్తారా అన్నది అంతా ఆసక్తిగా చూస్తున్నారు. వైసీపీ మళ్లీ పుంజుకుని ఫ్యాన్ స్పీడ్ పెంచాలీ అంటే ఇంతకు పదింతలు కష్టపడాలని అంటున్నారు. మరి ఆ దూకుడు అయితే వైసీపీ పెద్దలలో కనిపించడం లేదు అన్నదే క్యాడర్ నుంచి వస్తున్న ప్రధాన ఫిర్యాదుగా ఉంది.


Feature Image Credits: DevianArt