అజ.. పజా లేని వైసీపీ అధికార ప్రతినిధులు.. రీజనేంటి..!
ఇక, మరికొందరు మీడియా చర్చల్లోనూ పాల్గొని తమ పార్టీవిధానాలను సమర్థించుకుంటారు.
By: Tupaki Desk | 29 Nov 2024 7:30 PM GMTవైసీపీ అధికార ప్రతినిధులు ఎక్కడున్నారు? అంటే సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఏ పార్టీ కైనా అధికార ప్రతినిధులు కీలకం. పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపిస్తారు. అదేవిధంగా.. ప్రత్యర్థి నాయకులు చేసే విమర్శలకు కౌంటర్ ఇస్తారు. మీడియా ముందుకు కూడా వస్తారు. ఇక, మరికొందరు మీడియా చర్చల్లోనూ పాల్గొని తమ పార్టీవిధానాలను సమర్థించుకుంటారు. ఇదేసమయంలో అధికార పక్షంపైనా విమర్శలు గుప్పిస్తారు.
అయితే.. ఈ విషయంలో వైసీపీ నాయకులు ఎక్కడా కనిపించడం లేదు. వారి వాయిస్ కూడా వినిపించ డం లేదు. గతంలో వైసీపీ అధికారంలోఉన్నప్పుడు కొందరు నాయకులు మీడియా ముందుకు వచ్చేవా రు. ప్రభుత్వ విధానాలను వివరించేవారు. మరీ ముఖ్యంగా సజ్జల రామకృష్నారెడ్డి వంటివారు తరచుగా మీడియా ముందుకు వచ్చేవారు. ఇక, మంత్రులు కూడా ఫైర్ కామెంట్సు చేసేవారు. కానీ, ఇప్పుడు జగన్ తప్ప.. ఎవరూ మీడియా ముందుకు రావడం లేదు.
గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి మాజీ మంత్రులు మాత్రం ఇష్యూబేస్డ్ టాపి క్స్ ఎంచుకుని మీడియాతో మాట్లాడుతున్నారు తప్ప.. ఇంతకుమించి వారు కూడా పెద్దగా మీడియా ముం దుకు రాకపోవడం గమనార్హం. ఇలా వచ్చిన వారు కూడా.. చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇక, టీవీ చర్చల్లోనూ బలమైన వాయిస్ వినిపించేవారు కనిపించడం లేదు. కేవలం జగన్ మాత్రమే మీడియ సమావేశాలు పెడుతున్నారు. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు?
ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. 1) ప్రభుత్వం పెడుతున్న కేసులు. తద్వారా ఎదురవుతున్న చిక్కులు. మరొకటి.. పార్టీ పరంగా నాయకులకు దక్కని ఊరట వంటివి ఎవరూ సాహసం చేసేందుకు ముందుకు రావడం లేదు. కేవలం కేతిరెడ్డి ఒక్కరే సెల్పీ వీడియోలు చేస్తూ.. కామెంట్లు చేస్తున్నారు. ఇక, 2) పార్టీ పరంగా ఎంత చేసినాగుర్తింపు కొందరికే దక్కుతోందన్న ఆవేదన కూడా నాయకులను వేధిస్తుండడం. దీంతో అధికార ప్రతినిధులు ఉన్నా.. వారి అజ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.