వైసీపీ ఎమ్మెల్యే '11 ప్లేయర్స్' ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్
టీమ్ ఇండియా గత రాత్రి ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత విజయాన్ని సాధించింది, 12 సంవత్సరాల తర్వాత ఆ ప్రతిష్టాత్మక ట్రోఫీని ముద్దాడింది.
By: Tupaki Desk | 10 March 2025 3:22 PM ISTటీమ్ ఇండియా గత రాత్రి ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత విజయాన్ని సాధించింది, 12 సంవత్సరాల తర్వాత ఆ ప్రతిష్టాత్మక ట్రోఫీని ముద్దాడింది. దీంతో దేశమంతా ఈ చారిత్రాత్మక విజయాన్ని సంబరాలు చేసుకుంటుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నించారు. .
వైసీపీ యెర్రగొండపాలెం ఎమ్మెల్యే టి. చంద్రశేఖర్ భారత జట్టు 11 మంది ఆటగాళ్లతో ఎలాంటి కూటములు లేకుండా గెలిచిందని 100 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమైందని పేర్కొన్నారు. "ఎవరి పొతులేకుండా ఇండియా 11 మెంబర్స్ తో నిజాయితీగా కప్ గెలిచింది. 4 సంవత్సరాల తర్వాత ఏపీలో ఇదే రిపీట్ అవుతుంది," అని ఎమ్మెల్యే తన ట్వీట్‌లో రాశారు.
ఇక్కడ ఎమ్మెల్యే అర్థం చెప్పాలనుకున్నది.. భారత జట్టు ఎలాంటి కూటములు లేకుండా గెలిచిందని, '11' సంఖ్య తాము కలిగిన ఎమ్మెల్యే సీట్ల సంఖ్యకు సంకేతమని.. అయితే ఆయన పార్టీ కార్యకర్తల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేసిన ఈ ప్రయత్నం, అందుకు విరుద్ధంగా ట్రోలింగ్‌కు గురైంది.
ఎన్డీయే కూటమి మద్దతుదారులు సరదాగా స్పందిస్తూ, "టీమ్ ఇండియా 'వై నాట్ 175' అనలేదు కదా.. చివరికి 11 ఆటగాళ్లతోనే గెలిచింది," అని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. మరొకరు "క్రికెట్‌కి, రాజకీయాలకి పోలిక తెలియని ఈ ఎమ్మెల్యే, స్పోర్ట్స్‌లో కూటములు ఉండవని కూడా తెలియదా?" అని చమత్కరించారు.
వైసీపీ ఎమ్మెల్యే పార్టీ వైసీపీకి బూస్ట్ ను ఇవ్వాలనే ఉద్దేశంతో చేసిన ఈ ట్వీట్, సాక్షాత్తూ ఆయనకే ఎదురుదెబ్బ తగిలినట్టైంది.. టీమ్ ఇండియా అందరి ప్రశంసలు అందుకుంటుండగా ఈ ఎమ్మెల్యే ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతోంది.
అందుకే అంటారు.. ఏదైనా కానీ సోషల్ మీడియాలో పోస్టులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దాని పూర్వపరాలు తెలుసుకొని పోస్టులు పెట్టాలి.. లేదంటే ఇలానే ఎదురుదెబ్బలు తగిలే అవకాశాలు ఉంటాయి.