రెండు తుఫానులను తట్టుకున్న వైసీపీ ..!
ఇక,ఇప్పుడు షర్మిల వ్యవహారం. తల్లి-చెల్లినే కోర్టుకు లాగాడని, ఆస్తులు పంచకుండా వేధిస్తున్నాడని వైసీపీ వ్యతిరేక మీడియా చేసిన ప్రచారం కూడా జగన్ కు పెను తుఫానుగానే పరిణమించింది.
By: Tupaki Desk | 26 Oct 2024 1:30 AM GMTసాధారణంగా రాజకీయాల్లో విమర్శలు.. ప్రతి విమర్శలు కామనే. ఒకరిపై ఒకరు నిందలు వేసుకునేందుకు కూడా ప్రస్తుత రాజకీయ నేతలు వెనుకాడే పరిస్థితి లేదు. ఇక, తమకు ప్రత్యర్థి అనుకున్న పార్టీతో అయితే .. మరింత ఎక్కువ దూకుడుగా ఉంటారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఏపీలో వైసీపీ విషయంలో టీడీపీ ఇలానే వ్యవహరిస్తోంది. చాలా మంది వైసీపీకి 11 సీట్లే కదా వచ్చింది! అని పెదవి విరవొచ్చు. అయినా.. టీడీపీ దూకుడుగా ఉంది.
దీనికి కారణం .. వచ్చింది 11 సీట్లే అయినా.. 40 శాతం ఓటు బ్యాంకు మాత్రం వైసీపీకి బలంగా ఉంది. ఈ బలమే రేపు పుంజుకుంటే.. ఏంటనేది టీడీపీ సహా కూటమి పార్టీల లెక్క. అందుకే వైసీపీని చావు దెబ్బ తీయాలనేది రాజకీయ వ్యూహం. దీనిని ఎవరూ కాదనరు. రాజకీయాల్లో ప్రత్యర్థులు పోట్లాడుకోకుండా.. గౌరవించుకోరు కదా! ఇలా.. ఈ నాలుగు మాసాల కాలంలో.. వైసీపీపై అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా తుఫాన్లు అనదగ్గ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి.
ఇలా వచ్చిన రెండు తుఫాన్లు.. వైసీపీని పెను కుదుపునకు గురి చేశాయి. అయినా.. పార్టీ వెంటనే తట్టుకు ని నిలబడగలగడం ఇప్పుడు చర్చనీయాంశం. టీడీపీకి కూడా గతంలో ఇలాంటి పరిణామాలే వస్తే.. జనసేన వచ్చి చేయిచ్చి కాపాడిన విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు వైసీపీ తనంతట తనే నిలదొక్కు కుందనడంలో సందేహంలేదు. 1)తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారం. ఇది చంద్రబాబు నోటి నుంచి వచ్చినప్పుడు ఉధ్రుతమైన వేగంతో వ్యతిరేకత వైసీపీ వైపు వీచింది.
ఇక, వైసీపీ పరిస్థితి అయిపోయిందని అందరూ అనుకున్నారు. హిందూ సామాజిక వర్గం పెను ప్రభావానికి గురైందని.. ఇక, వైసీపీ ఖాళీ అయిపోవడం కాదు..జెండా పీకేస్తారని కూడా చెప్పుకొచ్చారు. కానీ, అనూహ్యం గా పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టి.. ప్రభుత్వ దూకుడుకు బ్రేకులు వేసింది. ఈ సమయంలో జగన్ పదే పదే మీడియా ముందుకురావడం.. నిజాలు ఇలా ఉంటాయని చెప్పడం ద్వారా.. ఆయన ఈ సెగ నుంచి తప్పించుకోగలిగారు.
ఇక,ఇప్పుడు షర్మిల వ్యవహారం. తల్లి-చెల్లినే కోర్టుకు లాగాడని, ఆస్తులు పంచకుండా వేధిస్తున్నాడని వైసీపీ వ్యతిరేక మీడియా చేసిన ప్రచారం కూడా జగన్ కు పెను తుఫానుగానే పరిణమించింది. కీలకమైన మహిళా సెంటిమెంటును ఆయన నుంచి దూరం చేయాలన్న వుద్దేశం స్పష్టంగా కనిపించిందని నాయకులు చెబుతున్నారు. అయితే.. దీనికి కూడా.. జగన్ వ్యూహాత్మకంగా పేర్ని నానిని రంగంలోకి దించి అనుకూల మీడియాను అలెర్ట్ చేసి.. వాస్తవాలు చెప్పించడం(జగన్ దృస్టిలో) ద్వారా.. ఈ తుఫాను నుంచి కూడా తృటిలో తప్పించుకున్నారన్నది విశ్లేషకుల మాట.