Begin typing your search above and press return to search.

ఏడు నెలల్లో ఏడుకు చేరిన వైసీపీ

అయితే అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఫేట్ మారింది. ఘోరంగా ఓటమిని మూటకట్టుకుంది.

By:  Tupaki Desk   |   24 Jan 2025 5:54 PM GMT
ఏడు నెలల్లో ఏడుకు చేరిన వైసీపీ
X

వైసీపీ రాజ్యసభలో ఒక రికార్డుని క్రియేట్ చేసింది.ఏపీ నుంచి మొత్తం రాజ్యసభ సీట్లను ఆ పార్టీ సొంతం చేసుకుంది. ఏపీ కోటాలో మొత్తం 11 సీట్లు ఉంటే అన్నీ వైసీపీ పరం అయిన అరుదైన ఘనతను 2024 లో సాధించింది. అయితే అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఫేట్ మారింది. ఘోరంగా ఓటమిని మూటకట్టుకుంది.

దాంతో రాజ్యసభలో వైసీపీ బలం మెల్లగా తగ్గిపోవడం మొదలైంది. ఆగస్టులో ఇద్దరు వైసీపీ రాజ్యసభ సభ్యులు తమ రాజీనామాలను చేశారు. వారిలో ఒకరి మోపిదేవి వెంకట రమణ అయితే మరొకరు బీద మస్తాన్ రావు. ఆ తరువాత నెలలో బీసీ నేత ఆర్ క్రిష్ణయ్య రాజీనామా చేయడం వైసీపీకి షాక్ తినిపించింది.

ఇక చూసుకుంటే ఈ మధ్యనే మూడు రాజ్యసభ ఖాళీలకూ ఎన్నికలు జరిగాయి. బీద మస్తాన్ రావు, ఆర్ క్రిష్ణయ్య టీడీపీ బీజేపీ కోటా నుంచి తిరిగి తమ ఎంపీ సీట్లను అందుకుని రాజ్యసభలో ప్రవేశించారు. అదె విధంగా మరో ఎంపీ సీటు సానా సతీష్ కి దక్కింది. ఇక రాజ్యసభలో కూటమి బలం మూడుకు చేరుకుంది.

ఇపుడు చూస్తే భారీ షాకింగ్ పరిణామంగా విజయసాయిరెడ్డి రాజ్యసభ పదవికి రాజీనామాగా ఉంది అని అంటున్నారు. ఆయన రాజీనామాతో వైసీపీ బలం ఏకంగా ఏడుకు పడిపోతుంది అని అంటున్నారు. ఈ సీటు ఖాళీ కావడంతో అది కూడా కూటమికే దక్కనుంది.

మరి వైసీపీలో ఉన్న ఏడుగురు ఎంపీలలో కూడా కడదాకా వైసీపీలో ఎంతమంది ఉంటారు అన్నది ఇపుడు చర్చగా మారుతోంది. వైసీపీ పునాదుల నుంచి ఉన్న విజయసాయిరెడ్డి వంటి వారే రాజీనామాలు చేసి తప్పుకుంటున్న వేళ మిగిలిన వారి విషయంలో సందేహాలు ఉన్నా తప్పు లేదని అంటున్నారు.

వైసీపీలో 2030 వరకూ రాజ్యసభ పదవీ కాలం ముగ్గురికి ఉంది. వారే వైవీ సుబ్బారెడ్డి, గొల్లబాబూరావు, మేడా రఘునాధరెడ్డిగా ఉన్నారు. ఇక 2028లో పదవీ త్యాగం చేయాల్సిన వారుగా ఎస్ నిరంజన్ రెడ్డి ఉన్నారు. 2026లో వైసీపీ నుంచి పదవీ విరమణ చేసే వారిలో పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి ఉన్నారు.

ఇక మరో ఏడాదిలో వైసీపీ బలం ఏడు నుంచి నాలుగుకు పడిపోనుంది. మరి ఈ మధ్యలో ఏమైనా పరిణామాలు సంభవిస్తే ఇంకా తగ్గిపోవచ్చు అని అంటున్నారు. వైసీపీ నుంచి ఏ ఒక్కరు రాజీనామా చేసినా అది కూటమికే ప్లస్ అవుతుందన్న లెక్క ఉంది. దాంతో వైసీపీ వీక్ అవుతున్న నేపథ్యంలో కూటమి పెద్దల సభలో పుంజుకుంటుంది అని అంటున్నారు. చూడాలి మరి విజయసాయిరెడ్డి రాజీనామా ఖాళీ ఏ నేతకు చాన్స్ ఇస్తుందో.