సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు.. వైసీపీ సంచలన నిర్ణయం!
అయితే... దూషణలు కాకుండా, ప్రశ్నించిన వారిపై కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తుంది.
By: Tupaki Desk | 14 Nov 2024 4:39 PM GMTసోషల్ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టులు పెడుతూ పలువు రాజకీయ ప్రముఖులను, వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి, అవమానపరిచిన వారిపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. అయితే... దూషణలు కాకుండా, ప్రశ్నించిన వారిపై కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తుంది.
ఇదే సమయంలో 41ఏ నోటీసులు ఇవ్వకుండా.. ఇంట్లో వారికి సమాచారం చెప్పకుండా.. అరెస్టు చేసినట్లు చూపించి కోర్టులో హాజరుపరచకుండా.. అరెస్ట్ పేరు చెప్పి తీసుకువెళ్లి చిత్ర హింసలకు గురిచేస్తున్నారని.. ఈ అక్రమ అరెస్టులు చేస్తున్న పోలీసులు ఎక్కడున్న పిలిపిస్తామని వైసీపీ గట్టిగా చెబుతోంది. ఈ సమయంలో కీలక ప్రకటన చేసింది.
అవును... ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు జరుగుతున్న వేళ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. జరుగుతున్న అరెస్టులు, వేధింపులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ ప్రత్యేక బృందాలు అని చెబుతున్నారు.
ఈ సందర్భంగా.. అక్రమ నిర్భంధాలకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు.. వారికి భరోసా ఇవ్వడం, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం పార్టీ బృందాలు పనిచేయనున్నాయని చెబుతున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా పార్టీ బృందాల వివరాలను వెల్లడించింది.
శ్రీకాకుళం - సీదిరి అప్పలరాజు, శ్యాంప్రసాద్
విజయనగరం - బెల్లాని చంద్రశేఖర్, జోగావారు
విశాఖపట్నం - భాగ్యలక్ష్మి, కేకే రాజు
తూర్పు గోదావరి - వంగ గీత, జక్కంపూడి రాజా
పశ్చిమ గోదావరి – సునీల్ కుమార్ యాదవ్, జయప్రకాశ్
కృష్ణా - మొండితోక అరుణ్ (ఎమ్మెల్సీ), దేవభక్తుని చక్రవర్తి
గుంటూరు - విడదల రజని, డైమండ్ బాబు
ప్రకాశం - టీజేఆర్ సుధాకర్ బాబు, వెంకటరమణారెడ్డి
నెల్లూరు - రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి (ఎమ్మెల్సీ)
చిత్తురు - గురుమూర్తి (ఎంపీ), చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
అనంతపురం - కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రమేష్ గౌడ్
కడప - సురేష్ బాబు, రమేష్ యాదవ్
కర్నూలు – హఫీజ్ ఖాన్, సురేందర్ రెడ్డి (ఆలూరు)