వైసీపీ ట్రూత్ బాంబ్... తెరపైకి ఘోరమైన వీడియో!
ఈ సమయంలో తాజాగా వైసీపీ ఈ రోజు ఉదయం 11:55కి "బ్రేకింగ్ న్యూస్" అంటూ ఓ పోస్ట్ పెట్టింది. మధ్యాహ్నం 1:01 వదిలింది! ఆ పోస్ట్ లోని వీడియో వైరల్ టాపిక్ గా మారుతోంది.
By: Tupaki Desk | 6 Dec 2024 8:38 AM GMTఈ మధ్యకాలంలో న్యూస్ ఛానల్స్ మాదిరిగా మరి కాసేపట్లో బ్రేకింగ్ న్యూస్ అనే టైపులో రాజకీయ పార్టీల సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా చేస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో తాజాగా వైసీపీ ఈ రోజు ఉదయం 11:55కి "బ్రేకింగ్ న్యూస్" అంటూ ఓ పోస్ట్ పెట్టింది. మధ్యాహ్నం 1:01 వదిలింది! ఆ పోస్ట్ లోని వీడియో వైరల్ టాపిక్ గా మారుతోంది.
అవును... "బ్రేకింగ్ న్యూస్! ఇంతకాలం దాగి ఉన్నది చివరకు వెలుగు చూసింది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు ట్రూత్ బాంబ్ పడనుంది.. చూస్తూనే ఉండండి # బిగ్ ఎక్స్ పోజ్ " అని పేర్కొంది. అన్నట్లుగానే మధ్యాహ్మం 1:01కి ఓ ఫోటోతో పాటు ఒక వీడియోను విడుదల చేసింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడి అనుచరుడి అరాచకాలంటూ రాసుకొచ్చింది.
ఇందులో భాగంగా... శ్రీకాకుళంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడి ఘరానా మోసం బట్టబయలు అయ్యిందని మొదలుపెట్టి.. "ఇండియన్ ఆర్మీ కాలింగ్" అనే సెంటర్ ను స్థాపించి.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి దగ్గర నుంచి రు.5 - 10 లక్షల వరకూ వసూళ్లకి పాల్పడ్డాడు బసవ రమణ అనే వ్యక్తి అని పేర్కొన్నారు.
ఈ క్రమంలో... శిక్షణ పేరుతో సెంటర్ కి వచ్చిన అమ్మాయిల గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి, వీడియోలు రికార్డ్ చేసి, వాటిని అడ్డుపెట్టుకుని స్నేహితులతో కలిసి అమ్మాయిలను వేధింపులకు గుర్తిచేస్తున్నారని.. ఈ విషయాన్ని అమ్మాయిల ఇంట్లో చెప్పిన నలుగురు కుర్రాళ్లని బంధించి, చిత్రహింసలకు గురిచేశారని తెలిపింది.
శ్రీకాకుళంలో మంత్రి రామ్మోహన్ నాయుడి పేరు చెప్పి.. బసవ రమణ దందాలు చేస్తున్నాడని.. ఇందులో భాగంగా షాపింగ్ మాల్స్, బార్స్ కి వెళ్లి బిల్లులు చెల్లించకుండా వేదిరిస్తున్నాడని.. "ఎన్నో ఏళ్లు" నుంచి ఇలా దుర్మార్గాలకి పాల్పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ కి ఇతడు సన్నిహితుడని పేర్కొంది.
ఈ సందర్భంగా... పాలన చేతగాకపోతే ఊరూరా ఇలాంటి దుర్మార్గులే రాజ్యమేలుతారు అనేదానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా చంద్రబాబు అంటూ ఎక్స్ పో ఓ పోస్ట్ పెట్టింది. దీనికి సాక్ష్యంగా అన్నట్లుగా... సదరు రమణ అనే వ్యక్తి.. రామ్మోహన్ నాయుడితో దిగిన ఫోటోలు.. అతడు ఓ కుర్రాడిని చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది.
అయితే... ఈ విషయాన్ని వెల్లడిస్తూ... ""ఎన్నో ఏళ్లు" నుంచి ఇలా దుర్మార్గాలకి పాల్పడుతున్నా" అనే పాయింట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కూడా కానప్పుడు.. గత ఐదేళ్లు అధికారంలో ఉన్నది తమరే కదా అంటు కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు! ఆ వాఖ్యాన్ని సెల్ఫ్ గోల్ గా అభివర్ణిస్తున్నారు!
ఆ సంగతి అలా ఉంటే... ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో జరిగిన దారుణం ఏమాత్రం క్షమించరాని చర్య అనే అంటున్నారు నెటిజన్లు! ఈ ఆటవిక చర్యను, రాక్షస వ్యవహారాన్ని, మూర్ఖపు దాడిని ఏమాత్రం క్షమించరాదని.. ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించాలని.. నిజానిజాలు నిగ్గు తేల్చి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అలాకానిపక్షంలో... ఇలాంటి విషయాలు ఇలా పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత కూడా చర్యలు తీసుకోకుండా వదిలేసిన అపవాదు కూటమి ప్రభుత్వంపై పడుతుందని అంటున్నారు.