Begin typing your search above and press return to search.

అంబటి ఇంట్లో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్!

అవును.. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట్లో వైసీపీ సోషల్ మీడియాకు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   13 Nov 2024 9:55 AM GMT
అంబటి ఇంట్లో వైసీపీ సోషల్  మీడియా కార్యకర్త అరెస్ట్!
X

సోషల్ మీడియా వేదికగా పలువురు రాజకీయ ప్రముఖులు, వారి వారి ఇళ్లల్లోని మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినవారిపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. అలాంటి పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా.. మరికొంతమంది కోసం గాలిస్తున్నారని అంటున్నారు.

ప్రధానంగా ముందస్తు సమాచారం అంది కొంతమంది.. లీకుల వల్ల సమాచారం తెలుసుకుని కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారని.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో వైసీపీకి చెందిన ఓ సోషల్ మీడియా కార్యకర్తను ఆ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట్లో అరెస్ట్ చేశారు.

అవును.. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట్లో వైసీపీ సోషల్ మీడియాకు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హోంమంత్రి వంగలపూడి అనితపై పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన కార్యకర్త వైసీపీ సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టారు. దీనిపై నూజివీడు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో సదరు రాజశేఖర్ కోసం నూజివీడు పోలీసులు గత కొన్ని రోజులుగా గాలిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా నకరికల్లులో అతడి ఇంటికి వెళ్లారు. ఈ వ్యవహారంపై అంబటి రాంబాబు ఇప్పటికే స్పందించారు. ఇందులో భాగంగా.. సంబంధిత ఆధారాలు ఉంటే అధికారికంగా అరెస్ట్ చేయవచ్చని మీడియా ముఖంగా తెలిపారు.

అరెస్టుల పేరు చెప్పి వేదించడం.. పలు పోలీస్ స్టేషన్లకు తిప్పడం.. భౌతికంగా హింసించడం వంటివి చేయకుండా అధికారికంగా అరెస్ట్ చేయాలని.. కోర్టులో సబిమిట్ చేయాలని తెలిపారు. అప్పటివరకూ సదరు రాజశేఖర్ తన ఇంట్లోనే ఉంటాడని మీడియా ముఖంగా వెల్లడించారు. రాజశేఖర్ ను మీడియా ముందు ప్రవేశపెట్టారు.

ఈ సమయంలో సంబంధిత ఆధారలు ఉంటే అధికారికంగా అరెస్ట్ చేసుకోవచ్చని, కోర్టులో ప్రవేశపెట్టాలని తెలిపారు. దీంతో బుధవారం నూజివీడు పోలీసులు గుంటూరులో అంబటి రాంబాబు ఇంటికి వెళ్లారు. ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను చూపించారు. అనంతరం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.