వైసీపీ జీవోలు వెలుగులోకి.. ఏం జరుగుతుంది..?
వైసీపీ హయాంలో 2021-24 మధ్య కాలంలో ఇచ్చిన జీవోల్లో కొన్నింటిని మాత్రమే ఆన్‌లైన్ చేసి.. మరికొ న్నింటిని దాచేసిన జీవోలను ఇప్పుడు వెలుగులోకి తీసుకువస్తున్నారు.
By: Tupaki Desk | 29 Oct 2024 12:10 PM GMTవైసీపీ హయాంలో జగన్ సర్కారు ఇచ్చిన చాలా ఉత్తర్వులను బయటకు వెల్లడించలేదు. ఇలా.. 2021-24 మధ్య సుమారు 200లకు పైగానే జీవోలు బయట ప్రపంచానికి తెలియకుండా దాచేశారన్నది అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది. అంతేకాదు.. తాము అధికారంలోకి వస్తే.. ప్రతిజీవోను పారదర్శకంగా ప్రజల ముందు పెడతామని కూడా అప్పట్లో చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు.
వైసీపీ హయాంలో 2021-24 మధ్య కాలంలో ఇచ్చిన జీవోల్లో కొన్నింటిని మాత్రమే ఆన్‌లైన్ చేసి.. మరికొ న్నింటిని దాచేసిన జీవోలను ఇప్పుడు వెలుగులోకి తీసుకువస్తున్నారు. వీటిని యథాతథంగా గవర్నమెం ట్ ఆర్డర్ ఇష్యూ రిజిస్టర్(జీవోఐఆర్)లో అప్ లోడ్ చేయనున్నారు. తద్వారా.. వైసీపీ హయాంలో తీసుకు న్న రహస్య నిర్ణయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. ప్రజలకు తెలుస్తాయని కూటమి ప్రభుత్వం చెబు తోంది.
ఇక, వైసీపీ వాదన వేరేగా ఉంది. కొన్నికొన్ని జీవోలను ప్రజల సమక్షంలో పెట్టాల్సిన అవసరం లేదని, గోప్యత పాటించవచ్చని చెబుతుండడం గమనార్హం. అందుకే.. తాము కొన్ని జీవోలను బహిరంగ పరచలే దని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఇక, దేశవ్యాప్తంగా ఉన్న ప్రబుత్వాలు కూడా.. కొన్ని జీవోలను బయట పెడతాయి.. మరికొన్నింటిని దాచి పెడతాయి. ఇది కామన్‌గా జరిగే ప్రక్రియే. ఇలా చేసేందుకు ప్రభుత్వాలకు అవకాశం, సదుపాయం కూడా ఉంది.
కేంద్ర ప్రభుత్వం కూడా. కొన్ని జీవోలనే అందుబాటులో ఉంచుతుంది. మరికొన్నింటిని పక్కన పెడు తుంది. ఇక, ఇప్పుడు వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన జీవోలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టడం ద్వారా.. ఇది రాజకీయంగా వైసీపీని మరింత ఇరుకున పెట్టే ఉద్దేశం ఉందన్నది స్పష్టమవుతోంది. కానీ, ఇదిసరైన విధానం అయితే కాదు. ఎందుకంటే.. గతంలో తుందుర్రు ఆక్వాఫ్యాక్టరీకి సంబంధించి.. టీడీపీ ఇచ్చిన రహస్య జీవో వ్యవహారంపై వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నానా రచ్చ చేసింది.
కానీ, 2019లో అధికారంలోకి వచ్చాక.. ఆ జీవోను బయట పెట్టే అవకాశం ఉన్నా.. చేయలేదు. ఇది ప్రభుత్వాల విజ్ఞత. అంతే! కానీ, ఇప్పుడు చంద్రబాబు పారదర్శకత కోరుతున్నారో.. లేక రాజకీయం కోరుకుంటున్నారో.. మొత్తానికి వైసీపీ ఇచ్చిన రహస్య జీవోలు బయట పెడుతున్నారు. తద్వారా కొత్త సంప్రదాయానికి అయితే.. చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారనే చెప్పాలి.