Begin typing your search above and press return to search.

జగన్ కోసం వైసీపీ డొనాల్డ్ ట్రంప్ నినాదం!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రచారం కోసం ఉపయోగించిన "మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్" నినాదాన్ని ఏపీలో వైసీపీ పట్టుకున్నట్లు కనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   24 Feb 2025 4:59 AM GMT
జగన్ కోసం వైసీపీ డొనాల్డ్ ట్రంప్ నినాదం!
X

గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో ట్రంప్ అండ్ కో ప్రధానంగా ఎత్తుకున్న అంశం.. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ (ఎం.ఏ.జీ.ఏ.) అని. ఆ నినాదం అమెరికాలో ఫుల్ పాపులర్ అయ్యింది.. అమెరికాను ట్రంప్ చేతుల్లో పెడితేనే పూర్వవైభవం సొంతం అని అమెరికా ప్రజలు నమ్మారు!


ఫలితంగా... రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ సంగతి అలా ఉంటే... అమెరికాలో ట్రంప్ ఎత్తుకున్న మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (ఎం.ఏ.జీ.ఏ.) నినాదం ఇప్పుడు పేరు మారి ఏపీలో వినిపిస్తోంది.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రచారం కోసం ఉపయోగించిన "మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్" నినాదాన్ని ఏపీలో వైసీపీ పట్టుకున్నట్లు కనిపిస్తుంది. దాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, వైఎస్ జగన్ కు అప్లై చేసింది. ఇప్పుడు ఈ విషయం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

ఇందులో భాగంగా... "మేక్ ఆంధ్ర గ్రేట్ ఎగైన్ విత్ జగనన్న" అనే నినాదాన్ని ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి 2019 ఎన్నికల సమయంలో ఎక్కడ చూసినా "రావాలి జగన్.. కావాలి జగన్" అనే నినాదమే వైసీపీ నుంచి వినిపించేదనే సంగతి తెలిసిందే. ఆ నినాదం ఫుల్ పాపులర్ అయ్యింది.. ఆ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో విజయం సాధించింది.

ఈ నేపథ్యంలో వైసీపీ ఈ సమయంలో మరో ఆసక్తికర నినాదాన్ని లేవనెత్తింది. వాస్తవానికి "మళ్లీ రావాలి జగన్" అనే నినాదం నిన్నటి వరకూ వినిపించేది. అయితే అనూహ్యంగా ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఎత్తుకున్న నినాదం ఏపీ రాజకీయాల్లో కనిపించడం ఆసక్తిగా మారింది. మరి ఈ నినాదం ఏపీలో ఎలాంటి ఫలితాలు ఇస్తుందనేది వేచి చూడాలి.