పుంగనూరు ఘర్షణ.. చిత్తూరు బంద్‌కు వైసీపీ పిలుపు
By: Tupaki Desk | 4 Aug 2023 5:03 PM GMTఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఉద్రిక్తత, పోలీసుల లాఠీచా ర్జి.. టీడీపీ కార్యకర్తలకు గాయాలు వంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆయా ఘట నలపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేసేందుకు రెడీ అయ్యారు. దీనిని సీరియస్‌గా తీసుకుంటు న్నామని ఎస్పీ రితేష్ రెడ్డి చెప్పారు. ఇదిలావుంటే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా.. ఇక్కడ జరిగి న ఘటనపై చంద్రబాబుదే బాధ్యతని తేల్చి చెప్పారు.
ఇక, తాజాగా వైసీపీ నాయకులు శనివారం చిత్తూరు బంద్‌కు పిలుపునిచ్చారు. ``ఈ రోజు పుంగనూరులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సృష్టించిన విధ్వంసాన్ని నిరసిస్తూ, పోలీసులపై దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఖండిస్తున్నాం. ఈ నేపథ్యంలో టీడీపీ ఆగడాలకు నిరసనగా శనివారం జిల్లా వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిస్తున్నాం. ప్రజలు, వైసీపీ శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొని తమ నిరసన తెలియజేసి బందు ను విజయవంతం చేయాలని కోరుతున్నాం`` అని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్ పిలుపునిచ్చారు.
మరోవైపు పోలీసులు కూడా ఈ దాడుల ఘటనలకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలను నిశితంగా పరిశీలిస్తున్నారు. పోలీసులపై జరిగిన దాడులు, వాహనాల విధ్వంసం వంటివాటిని వారు సీరియస్‌గా తీసుకున్నట్టు ఎస్పీ స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు(శుక్రవారం) అర్థరాత్రి నుంచే అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ జిల్లా స్థాయి నేతలను పోలీసులు అరెస్టు చేశారని సమాచారం. వారిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా టీడీపీ నేతలకు చెందిన కారులో లభించిన తుపాకి, బుల్లెట్ల విషయాన్ని కూడా సీరియస్‌గా పరిశీలిస్తున్నారు.