Begin typing your search above and press return to search.

బాలయ్య చిన్నల్లుడు టికెట్ కి వైసీపీ ఫిట్టింగ్...!?

విజయనగరం జిల్లాలో యువగళం పాదయాత్రం ముగింపు జరిగితే విశాఖ నిండా ఫ్లెక్సీలు వేసి మరీ లోకేష్ ని మంచి చేసుకునే ప్రయత్నం చేశారు.

By:  Tupaki Desk   |   17 Jan 2024 2:45 AM GMT
బాలయ్య చిన్నల్లుడు టికెట్ కి వైసీపీ ఫిట్టింగ్...!?
X

విశాఖ ఎంపీగా పోటీ చేద్దామని నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ గట్టిగానే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆయన చంద్రబాబుతో పాటు చినబాబు లోకేష్ కి పూర్తిగా టచ్ లోకి వెళ్లారు. విజయనగరం జిల్లాలో యువగళం పాదయాత్రం ముగింపు జరిగితే విశాఖ నిండా ఫ్లెక్సీలు వేసి మరీ లోకేష్ ని మంచి చేసుకునే ప్రయత్నం చేశారు.

ఒక విధంగా విశాఖ ఎంపీ టికెట్ మీద శ్రీభరత్ కోటి ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు. ఆయన 2019లో మొదటిసారి పోటీ చశారు. అయితే కేవలం నాలుగు వేల ఓట్ల స్వల్ప తేడాతో నాడు ఓటమి పాలు అయ్యారు. ఇపుడు చూస్తే శ్రీభరత్ కి నమ్మకం వచ్చేసింది అని అంటున్నారు. తనకు టికెట్ ఇస్తే చాలు గెలిచి చూపిస్తాను అని ఆయన అంటున్నారు.

కానీ శ్రీభరత్ కి టికెట్ దక్కాలంటే చాలా ఆటంకాలను అధిగమించాల్సి ఉంది అని అంటున్నారు. పొత్తులు కుదిరితే ఈ సీటు బీజేపీకి పోతుంది. అలా కాదు అనుకుంటే జనసేన కూడా విశాఖ సీటు మీద కన్నేసింది అని అంటున్నారు. కాపులకు ఎంపీ టికెట్ ఇవ్వాలని కూడా మిత్రపక్షం నుంచి డిమాండ్ వస్తోందిట.

ఇంకో వైపు చూస్తే జనసేనతో పొత్తు వల్ల సీనియర్ నేతలు పలువురు ఖాళీ అవుతున్నారు. వారికి ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేయాల్సి ఉంది. దాంతో విశాఖ ఎంపీ సీటు ఇవ్వవచ్చు అన్న మాట ఉంది. ఇవన్నీ పక్కన పెడితే విశాఖ ఎంపీ సీటు గత నాలుగు దశబ్దాలుగా ఓసీలకే పరిమితం అవుతుంది. దాంతో ఈసారి వైసీపీ విశాఖ సీటుకు బీసీని ఎంపిక చేసింది. అలా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీలక్ష్మి పేరుని ప్రకటించారు.

ఆమె లోకల్ క్యాండిడేట్ కావడమే కాకుండా బీసీ మహిళగా ఉన్నారు. దాంతో ఇపుడు టీడీపీ మీద కూడా ఈ సామాజిక సమీకరణ ప్రభావం గట్టిగా ఉండబోతోంది అని అంటున్నారు విశాఖ ఎంపీ టికెట్ ని బీసీలకు టీడీపీ ఇవ్వక్పోతే వైసీపీకి అది భారీ అడ్వాంటేజ్ అవుతుంది. పొత్తులో బీజేపీకి జనసేనకు ఇస్తే వారు ఎవరిని అభ్యర్ధులుగా పెడతారు అన్నది వేరే విషయం కానీ టీడీపీ ఎంపికలో మాత్రం కచ్చితంగా బీసీ ముద్ర ఉండాల్సిందే అన్న చర్చ వస్తోంది.

బీసీల పార్టీగా తనకు తాను క్లెయిం చేసుకుంటున్న టీడీపీ వైసీపీతో పోటీ పడే క్రమంలో కచ్చితంగా విశాఖ ఎంపీ సీటుని బీసీలకే ఇస్తుంది అని అంటున్నారు. దాంతో శ్రీభరత్ ఆశలు పూర్తిగా నీరుకారుతాయని అంటున్నారు.

తాను ఎంపీగా మాత్రమే పోటీ చేస్తాను అని శ్రీభరత్ అంటున్నారు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనుకున్నా కూడా సామాజిక సమీకరణలు అడ్డు వస్తున్నాయని అంటున్నారు విశాఖ తూర్పు నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన వెలగపూడి రామక్రిష్ణబాబు ఉన్నారు దాంతో విశాఖ సౌత్ నుంచి కానీ నార్త్ నుంచి కానీ శ్రీభరత్ ని ఎమ్మెల్యేగా పోటీ నుంచి దించాలనుకున్నా వల్ల కాదని అంటున్నారు.

మొత్తానికి చూస్తే బాలయ్య చిన్నల్లుడి ఆశలు ఈసారి ఎంతమేరకు నెరవేరుతాయన్నది చూడాల్సిందే అంటున్నారు. ఆయన ఎంపీ సీటుకు ఎమ్మెల్యే రూటుకు కూడా ఎన్నో బ్రేకులు ఉన్నాయని అంటున్నారు. వాటిని దాటుకుని ఆయన సీటు తెచ్చుకుని పోటీ చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.