రికార్డు స్థాయిలో వైసీపీ కంటే ఎక్కువగా 16 శాతం!
తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించిన మేరకు.. వైసీపీ కంటే కూడా..కూటమి పార్టీలకు 16 శాతం ఓటు బ్యాంకు ఎక్కువగా వచ్చింది.
By: Tupaki Desk | 5 Jun 2024 9:38 AM GMTఏపీలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కనీ వినీ ఎరుగని రీతిలో టికెట్లు దక్కించుకున్న టీడీపీ నేతృత్వంలోని బీజేపీ, జనసేన కూటమి.. ఓట్లలోనూ భారీ స్థాయిలో కుమ్మేసింది. నిన్న మొన్నటి వరకు వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకును కూడా... ఈ పార్టీ సొంతం చేసుకుంది. దీంతో ఎవరూ ఊహించనంతగా విజయం దక్కించుకుంది. తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించిన మేరకు.. వైసీపీ కంటే కూడా..కూటమి పార్టీలకు 16 శాతం ఓటు బ్యాంకు ఎక్కువగా వచ్చింది.
ఎన్నికలకు రెండేళ్ల కిందటే.జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఓట్ల బదిలీ జరగాలని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని చెప్పినట్టుగానే ఈ ఓట్ల షేర్ పడిపోయింది. దీంతో వైసీపీని మించి... ఓట్లు దక్కించుకున్నాయి. ప్రధానంగా 25 సంవత్సరాలుగా విజయం దక్కించుకోని ననియోజకవర్గాల్లోనూ ఈ సారి పార్టీలు గెలుపుగుర్రం ఎక్కాయి. మొత్తంగా రికార్డు స్థాయిలో వైసీపీ కంటే ఎక్కువగా 16 శాతం ఓట్లు కూటమికి బదిలీ అయ్యాయి. దీంతో వైసీపీ మట్టికరిచింది.
వీటిలోనూ.. టీడీపీ ఒంటరిగానే వైసీపీ కంటే.. ఎక్కువగా 6 శాతం ఓట్లు దక్కించుకుంది. ఇది .. ఆ పార్టీకి భారీ మేలు చేసింది. అందుకే ఊహించని రీతిలో టీడీపీకి 135 స్థానాలు వచ్చాయి. అదేవిధంగా 1 శాతం కూడా లేని బీజేపీకి ఈ సారి 2.83 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తంగా చూస్తే.. ఓటు బ్యాంకు విషయంలో వైసీపీకి భారీ గండి పడిందనేది తాజా లెక్కలు చెబుతున్న వాస్తవం.
ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం..
TDP : 45.60%
YCP : 39.37%
JSP : 8.53%
BJP : 2.83%
INC : 1.72%
NOTA : 1.09%