Begin typing your search above and press return to search.

వైసీపీలో జంబ్లింగ్ తప్పదా ?

రాబోయే ఎన్నికలకు సంబంధించి వైసీపీ పోటీచేసే కొన్ని నియోజకవర్గాల్లో జంబ్లింగ్ తప్పేట్లు లేదు. జంబ్లింగ్ అంటే ఏమీలేదు అటు ఇటు మార్చటమే

By:  Tupaki Desk   |   15 Dec 2023 5:57 AM GMT
వైసీపీలో జంబ్లింగ్ తప్పదా ?
X

రాబోయే ఎన్నికలకు సంబంధించి వైసీపీ పోటీచేసే కొన్ని నియోజకవర్గాల్లో జంబ్లింగ్ తప్పేట్లు లేదు. జంబ్లింగ్ అంటే ఏమీలేదు అటు ఇటు మార్చటమే. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు రెండు ఒకేసారి వస్తున్నాయి కదా. దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం కొందరు సిట్టింగ్ ఎంపీలను రాబోయే ఎన్నికల్లో ఎంఎల్ఏలుగా పోటీచేయించాలని అనుకుంటున్నారట. అలాగే మరికొందరు ఎంఎల్ఏలను ఎంపీలుగా పోటీచేయించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

పార్టీవర్గాల సమాచారం ప్రకారమైతే సుమారు 15 మంది ఎంపీలు రాబోయే ఎన్నికల్లో ఎంఎల్ఏలుగా పోటీచేయబోతున్నారట. ఇలాంటి వారిలో వంగా గీత, మార్గాని భరత్, ఎంవీవీ సత్యనారాయణ, ఆదాల ప్రభాకరరెడ్డి, చింతా అనూరాధ, వల్లభనేని బాలశౌరి పేర్లు బాగా వినబడుతున్నాయి. ఇదే సమయంలో సుమారు 20 మంది ఎంఎల్ఏలను జగన్ ఎంపీలుగా పోటీ చేయించబోతున్నారట. మాజీమంత్రి కన్నబాబు, బొత్సా సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, కొలుసు పార్ధసారధి లాంటి వాళ్ళ పేర్లు వినబడుతున్నాయి.

ఇదే సమయంలో 30 నియోజకవర్గాల్లో కొత్త నేతలు అభ్యర్ధులుగా పోటీచేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అంటే 30 మంది ఎంఎల్ఏలకు జగన్ టికెట్లు ఇవ్వబోవటంలేదని అర్ధమవుతోంది. మొత్తంమీద అధికారపార్టీలో విప్లవాత్మకమైన మార్పులుంటాయని మాత్రం అర్ధమైపోతోంది. మామూలుగా అయితే ఏ పార్టీ అధినేత కూడా ఇంత బారీ ఎత్తున మార్పులు చేయటానికి సాహసం చేయరు. కానీ ఇక్కడున్నది జగన్ కదా. అందుకనే మార్పులకు ఏమాత్రం వెనకాడటంలేదు. ఇప్పటికే మంత్రులు, ఎంఎల్ఏల్లో 11 మందిని కొత్త నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా వేసిన విషయం తెలిసిందే.

వీరిలో కూడా అందరికీ టికెట్లిస్తారని గ్యారెంటీలేదు. కొత్తవారికి టికెట్లివ్వటంలో భాగంగానే ముందుజాగ్రత్తగా మార్పులు చేసుండచ్చనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జగన్ చేసిన, తొందరలో మార్పులు చేయబోతున్నారని జరుగుతున్న ప్రచారం సంచలనంగా మారింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైసీపీలో జరుగుతున్న మార్పులపై చంద్రబాబునాయుడు అండ్ కో పదేపదే మండిపడుతుండటం. వైసీపీలో జరుగుతున్న మార్పులు తమకు అడ్వాంటేజ్ అని చంద్రబాబు ఒకవైపు చెబుతునే మరోవైపు జగన్ నిర్ణయాలను ఎగతాళి చేస్తు ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధంకావటంలేదు.