Begin typing your search above and press return to search.

తూర్పు నుంచి విజ‌యం త‌న‌దే అనుకున్న టైంలో.. యువ‌నేత ఫేట్ మార‌నుందా?

అయితే.. వాస్త‌వానికి అప్ప‌ట్లోనూ అవినాష్ విజ‌య‌వాడ తూర్పును ఆశించారు

By:  Tupaki Desk   |   2 Jan 2024 5:20 AM GMT
తూర్పు నుంచి విజ‌యం త‌న‌దే అనుకున్న టైంలో.. యువ‌నేత ఫేట్ మార‌నుందా?
X

ఆయ‌న వైసీపీ యువ‌నాయ‌కుడు, పైగా ఫైర్‌బ్రాండ్‌. నిన్న మొన్న‌టి వ‌ర‌కు విజ‌య‌వాడ తూర్పు నియోజ క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని అనుకున్నారు. దీనికి అధిష్టానం కూడా ఓకే చెప్పిన‌ట్టు అప్ప ట్లో ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే.. ఎన్నిక‌ల వేళ మారిన స‌మీక‌ర‌ణ‌లతో యువ‌నేతకు స్థాన చ‌ల‌నం త‌ప్ప‌ద‌నే లెక్క‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. ఆయ‌నే దేవినేని నెహ్రూవార‌సుడిగా రంగంలోకి వ‌చ్చిన‌.. దేవినే ని అవినాష్‌. 2016లో టీడీపీతో అరంగేట్రం చేసిన అవినాష్‌.. 2019 ఎన్నిక‌ల్లోనే గుడివాడ టికెట్ నుంచి పోటీ చేశారు.

అయితే.. వాస్త‌వానికి అప్ప‌ట్లోనూ అవినాష్ విజ‌య‌వాడ తూర్పును ఆశించారు.కానీ, టీడీపీకి ఈ నియోజ‌క వ‌ర్గంలో సిట్టింగ్ గ‌ద్దె రామ్మోహ‌న్ ఉండడంతో అప్పట్లో చంద్ర‌బాబు సూచ‌న‌ల మేర‌కు.. ఆయ‌న గుడివాడ నుంచి పోటీ చేశారు. అయితే.. అక్క‌డ స్వ‌ల్ప మెజారిటీ తేడాతో అవినాష్ ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇక ఆ త‌ర్వాత‌.. టీడీపీ బై చెప్పి.. వైసీపీ కండువా క‌ప్పుకొన్నారు. ఈ క్ర‌మంలో అడిగిన వెంట‌నే జ‌గ‌న్‌.. అవినాష్‌కు తూర్పు టికెట్‌పై హామీ ఇచ్చేశార‌నే ప్ర‌చారం జ‌రిగింది. మ‌రోవైపు అవినాష్ కూడా.. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న‌లు చేశారు.

కొండ ప్రాంతాల్లో కూడా ప‌ర్య‌టించి.. అనేక ప‌నులు చేశారు. ఇంటింటికీ తిరిగారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మా ల‌కు ఠంచ‌నుగా హాజ‌ర‌య్యేవారు. అనేక సంద‌ర్భాల్లో సీఎం జ‌గ‌న్‌తో క‌లిసి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఇక‌, తూర్పులో విజ‌యం త‌న‌దే అనుకున్నారు. ఇక‌, మ‌రో రెండు మాసాల్లో ఎన్నిక‌లు అన‌గా.. ఇప్పుడు అవినాష్ ను తూర్పు నుంచి పెన‌మ‌లూరుకు బ‌దిలీ చేయ‌నున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

పెనమలూరు స్థానానికి తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న దేవినేని అవినాష్‌ను పంపిస్తారనే వాదన పార్టీలో బ‌లంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో దేవినేని అవినాష్ ఏం చేస్తారు? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. ఎందుకంటే.. ఇప్ప‌టికే త‌మ‌ది కాని.. గుడివాడ‌లో పోటీ చేసి చేతులు కాల్చుకున్నారు. ఇక‌, ఇప్పుడు కూడా ఇదే ప‌రిస్థితి ఎదురైంది. త‌మ‌ది కాని.. పెన‌మ‌లూరు అంటే.. ఆయ‌న పోటీ చేస్తారా? లేక విరమించుకుంటారా? అనేది చూడాలి.