Begin typing your search above and press return to search.

దువ్వాడ పేరాడ : ఒకరితో ఒకరిని ముడేసిన వైసీపీ...!

ఒకరు దువ్వాడ శ్రీనివాస్. వైసీపీ ఎమ్మెల్సీ, దూకుడుగా ఉండే నేత. మరొకరు పేరాడ తిలక్. ఆయన అందరితోనూ సఖ్యత నెరిపే నేత

By:  Tupaki Desk   |   16 Jan 2024 3:44 AM GMT
దువ్వాడ పేరాడ : ఒకరితో ఒకరిని ముడేసిన వైసీపీ...!
X

ఒకరు దువ్వాడ శ్రీనివాస్. వైసీపీ ఎమ్మెల్సీ, దూకుడుగా ఉండే నేత. మరొకరు పేరాడ తిలక్. ఆయన అందరితోనూ సఖ్యత నెరిపే నేత. కాళింగ కార్పోరేషన్ స్టేట్ చైర్మన్. ఈ ఇద్దరూ శ్రీకాకుళం జిల్లాలో బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ ఇద్దరిని ఒకరికి ఒకరిని ముడేసి ఏకంగా కింజరాపు ఫ్యామిలీ మీదకు వైసీపీ పంపిస్తోంది.

ఇక్కడే వైసీపీ మాస్టర్ ప్లాన్ అర్ధం అవుతోంది. ఈ ఇద్దరికీ ఎవరికి వారిగా బలం ఉంది కలిపి కూడితే కింజరాపు ఫ్యామిలీని ధీటుగా నిలదీసి గెలుపుని సాధించే సత్తా ఉంది. అందుకే ఈ ఇద్దరినీ వైసీపీ అధినాయకత్వం చాలా వ్యూహాత్మకంగా కలుపుతోంది.

ఇక వివరాల్లోకి వెళ్తే టెక్కలి నుంచి 2014లో దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ తరఫున పోటీ చేసి కింజరాపు అచ్చెన్నాయుడు చేతిలో ఓటమి పాలు అయ్యారు. 2019లో అదే సీటు నుంచి పేరాడ తిలక్ పోటీ చేసి అచ్చెన్నాయుడు మీద ఓడారు. కానీ అక్కడ టఫ్ ఫైట్ నడచింది. కేవలం ఎనిమిది వేల ఓట్ల తేడాతో అచ్చెన్నాయుడు గెలిచారు

ఇక దువ్వాడ శ్రీనివాస్ 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడారు. ఇక్కడ కూడా ఆయన టఫ్ ఫైట్ ఇచ్చారు. టీడీపీ నుంచి పోటీ చేసిన కింజరాపు రామ్మోహన్ మీద ఆయన ఆరేడు వేల తేడాతోనే ఓడారు. ఇలా ఇద్దరూ గత ఎన్నికలో ఓటమి పాలు అయినా కింజరాపు ఫ్యామిలీకి గట్టి ఫైట్ ఇచ్చారు.

దాంతో ఈసారి వీరినే బరిలోకి దింపుతోంది వైసీపీ. అయితే సీట్లు మార్చేసింది. గతసారి ఎంపీగా చేసిన దువ్వాడ ఈసారి టెక్కలి ఎమ్మెల్యే క్యాండిడేట్ అవుతున్నారు అలాగే పేరాడ ఎంపీ క్యాండిడేట్ గా ఉన్నారు. దువ్వాడకు పేరాడ సహకరించాల్సి ఉంది. అలాగే పేరాడకు దువ్వాడ హెల్ప్ కావాలి.

మరో విషయం ఏంటి అంటే శ్రీకాకుళం జిల్లాలో చక్రం తిప్పుతున్న ధర్మాన బ్రదర్స్ తో పేరాడకు మంచి సంబంధాలు ఉన్నాయి. దాంతో ఈసారి ఎంపీ సీటు కచ్చితంగా గెలుచుకుని తీసుకు రావాలని హై కమాండ్ జిల్లా పెద్దలను కోరిందని అంటున్నారు.

ఇదంతా బాగానే ఉన్నా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి కూడా టెక్కలిలో కొంత బలం ఉంది. ఆమెకు కూడా ఎక్కడో అడ్జస్ట్ చేయడమో లేక ఏ రకమైన హామీని అయినా ఇవ్వడమో చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఆమె కూడా కలిస్తే కచ్చితంగా ఈసారి ఎన్నికల్లో బలమైన కాళింగ సామాజిక వర్గం హవా ఉంటుందని అది వైసీపీని గెలిపించి తీరుతుందని అంటున్నారు.