Begin typing your search above and press return to search.

మార్చిన సీట్లలో మళ్ళీ 20 సీట్లు చేంజ్ అయ్యే చాన్స్...!

వైసీపీ అధినాయకత్వం ఇప్పటికి ఏడు విడతలుగా వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించింది

By:  Tupaki Desk   |   21 Feb 2024 1:57 PM GMT
మార్చిన సీట్లలో మళ్ళీ 20 సీట్లు చేంజ్ అయ్యే చాన్స్...!
X

వైసీపీ అధినాయకత్వం ఇప్పటికి ఏడు విడతలుగా వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించింది. వారే రేపటి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు అని అంతా అనుకున్నారు. ఇప్పటిదాకా అలా మార్చిన నియోజకవర్గాలు ఏకంగా డెబ్బై నుంచి డెబ్బై అయిదు దాకా ఉన్నాయి. ఇందులో నుంచి చూస్తే చాలా మంది కొత్త ఇంచార్జిల పనితీరుని అదే పనిగా వైసీపీ అధినాయకత్వం మధింపు చేస్తోంది అని అంటున్నారు.

సిట్టింగుల మీద జనంలో అసంతృప్తి ఉందని వారి పనితీరు బాగా లేదని భావించి అక్కడ సామాజిక సమీకరణలు ఇతరత్రా అన్నీ దృష్టిలో ఉంచుకుని ఇంచార్జిలను మార్చారు. అయితే ఈ ఇంచార్జిలలో కూడా ఇపుడు గ్రాఫ్ పెరగని వారు చాలా మంది ఉన్నారు అని అంటున్నారు. చాలా మంది ఇంకా తామున్న చోట నుంచి గడప దాటలేదని అంటున్నారు.

అదే సమయంలో ఎన్నికలు దగ్గరకు వచ్చే సమయంలో చాలా ఇంచార్జిలకు క్యాడర్ తో పూర్తి స్థాయిలో కనెక్షన్ లేదని కూడా వార్తలు వస్తున్నాయి. ఇంచార్జిలుగా నియమితులు అయిన వారితో సిట్టింగులకు కొన్ని చోట్ల విభేదాలు ఉన్నాయి. దాంతో వర్గ పోరు కూడా అండర్ కరెంట్ గా సాగుతోంది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీ హై కమాండ్ కొన్ని సీట్లలో పునరాలోచన చేస్తోంది అని అంటున్నారు.

నిజానికి చూస్తే వైసీపీ అధినాయకత్వం వై నాట్ 175 అన్న నినాదంతో భారీగా మార్పులు చేసింది. అయితే ఈ మార్పుచేర్పులలో పెద్దగా వర్కౌట్ కాని నియోజకవర్గాలు కూడా ఉన్నాయని లేటెస్ట్ గా వస్తున్న సొంత సర్వేలలో తెలుస్తోంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే టెక్నికల్ గా కొత్త అభ్యర్ధులు జనంలోకి దూసుకుని పోవడానికి ఎంతవరకూ అవకాశాలు ఉన్నాయన్న దాని మీద కూడా వైసీపీ హై కమాండ్ ఆలోచనలు చేస్తోంది అని అంటున్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపుగా వంద దాకా పంచాయతీలు ఉంటాయనుకుంటే అందులో కలుపుకుని రెండు లక్షల మంది ఓటర్లు ఉంటారు.

అయితే ఇందులో కొత్త ఓటర్లు కేవలం అయిదు శాతం ఓటర్లతో ఇరవై శాతం పంచాయతీలను కవర్ చేయడానికే సరిపోతోంది అని కూడా లెక్క కడుతున్నారుట. ఈ విధంగా చేసుకుంటూ పోతే ఎన్నికల వేళ ఇబ్బందులు వస్తాయని అందువల్ల కొత్త అభ్యర్ధులతో చాలా కష్టం అని సర్వేలలో వచ్చిందని అంటున్నారు.

ఇక వైసీపీ హై కమాండ్ చేయిస్తున్న సర్వేలు తీసుకుంటే ఆ విధంగా రావడంతో అందులో దాదాపుగా ఇరవై అసెంబ్లీ సీట్లలో ఇదే రకంగా ఉండడంతో ఆయా చోట్ల కొత్త ఇంచార్జిల స్థానంలో మళ్ళీ పాత వారికే ఇచ్చే చాన్స్ ఉందని అంటున్నారు. ఈ విధంగా భారీ మార్పులు కొత్త ఇంచార్జిల విషయంలో ఉండవచ్చు అని తాడేపల్లిలో ఒక టాక్ నడుస్తోంది అని అంటున్నారు.

ఇదిలా ఉంటే విశాఖలో గాజువాక, అలాగే అనకాపల్లి ఇంచార్జిలు దూకుడు చేయలేకపోతున్నారు అని టాక్ ఉంది. అదే విధంగా విశాఖ తూర్పు లో చూసుకుంటే ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అభ్యర్ధిగా ఉంటే టీడీపీకి ఈజీగా సీన్ మారుతోంది అని అంటున్నారుట. ఇలాగే ఉత్తరాంధ్రాలో కొన్ని కీలక నియోజకవర్గాలతో పాటు గోదావరి జిల్లాలలో కూడా మార్పుచేర్పులు ఉంటాయని అంటున్నారు.

సిట్టింగులకు సీట్లు ఇస్తే వీరి మీద బెటర్ అని కనుక తేలితే వారికే లక్కీ చాన్స్ అని అంటున్నారు. నిజం చెప్పాలంటే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లుగా ఏపీలో ఉన్న మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థి ఒక్క జగనే అని అంటున్నారు. జగన్ ని చూసే ఓటేస్తారు. జగన్ కావాలి అనుకుంటేనే ఓటు పడుతుంది. కాబట్టి అభ్యర్ధులను మార్చినా లేకపోయినా వైసీపీ ఎన్నికలను ఫేస్ చేయవచ్చు.

కానీ వైసీపీ మాత్రం భారీ ఎత్తున మార్పు చేర్పులు చేసింది. అది కూడా తెలంగాణాలో బీఆర్ఎస్ ఓటమి తో ఇంకా ఎక్కువగా ఫోకస్ చేసింది. కనీసం ఇరవై పాతిక సీట్లలో మార్పు చేర్పులు చేసి ఆగి ఉంటే బాగుండేది. కానీ అలా కాకుండా పెద్ద ఎత్తున చేయడం వల్ల అడ్వాంటేజ్ కొత్తగా ఎంతవరకూ వస్తుంది అన్న చర్చ ఎపుడూ ఉంది. ఇపుడు వైసీపీ పునరాలోచనలో పడడం అంటే మంచిదే అని అంటున్నారు. చూడాలి మరి వైసీపీ ఇంచార్జిల విషయంలో చేసే మార్పు చేర్పులు ఏ నియోజకవర్గాలలో ఉంటాయో.