విశాఖ తీరంలో 25 వేల కేజీల డ్రగ్స్... నిందితులతో టీడీపీ నేతలు!!
బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ దిగుమతి అయ్యిందంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి
By: Tupaki Desk | 22 March 2024 4:31 AM GMTబ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ దిగుమతి అయ్యిందంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ విషయం పెను సంచలనంగా మారింది. ఈ సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఈ వ్యవహారంపై స్పందించింది. ఇందులో భాగంగా... ఈ డ్రగ్స్ తో బయటపడిన దొంగలతో టీడీపీ నేతలకు నేరుగా లింకులు ఉన్నాయని తెలిపింది!
అవును... లక్షల కోట్లు విలువైన 25వేల కిలోల డ్రగ్స్ కంటైనర్ విశాఖ పోర్టుకు చేరిందనే వార్త ఇప్పుడు ఏపీలో తీవ్ర సంచలనమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై స్పందించిన వైఎస్సార్సీపీ... "విశాఖ తీరంలో దొరికిన 25 వేల కేజీల డ్రగ్స్ తో బయటపడిన దొంగలతో అడ్డంగా దొరికిన టీడీపీ నేతలు! ఈ డ్రగ్స్ స్కాంలో టీడీపీ నేతలకు నేరుగా లింకులు!" అంటూ ట్వీట్ చేసింది. దీనికి కొన్ని ఫోటోలను కూడా జోడించింది.
ఇదే క్రమంలో... "టీడీపీ నేతలు దామచర్ల సత్య, లావు శ్రీ కృష్ణ దేవరాయలు, రాయపాటి జీవన్ లతో నిందితుడు కోటయ్య చౌదరి కి దగ్గర సంబంధాలు. కాగా దామచర్ల సత్య, టీడీపీ అధినేత చంద్రబాబుకి అత్యంత ఆప్తుడు అన్న విషయం అందరికీ తెలిసిందే! ఈకేసులో నారా లోకేష్, చంద్రబాబు కి నేరుగా సంబంధం ఉండే అవకాశం ఉంది, అందుకే ముందే ఉలిక్కిపడి వరుసగా ట్వీట్లు వేసిన అబ్బాకోడుకులు" అని ఆ ట్వీట్ ని కంటిన్యూ చేసింది.
ఈ సందర్భంగా సంధ్యా ఆక్వా కంపెనీ ప్రతినిధులు.. టీడీపీ నేతలతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది వైసీపీ. అంతకముందు... "విశాఖలో దొరికిన డ్రగ్స్ విశాఖకు చెందిన సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్ సంస్థకు చెందిందని, దాని ఎండీ కూనం వీరభద్రరావు కాగా.. డైరెక్టర్ కునం కోటయ్య చౌదరిగా గుర్తించారు. ఇప్పుడు చెప్పు చంద్రబాబూ... వీళ్లు మీ టీడీపీకి చెందినవారు కాదా..? వీళ్లు ఎవరికి బంధువులు..? నీకా.. నీ కొడుక్కా..?" అని ట్వీట్ చేస్తూ.. కంపెనీ ప్రొఫైల్ స్క్రీన్ షాట్ ని పోస్ట్ చేసింది!
కాగా.. వైసీపీ చేసిన ట్వీట్ లో సంధ్యా ఆక్వా కంపెనీ సీఈఓ కునం కోటయ్య చౌదరి.. టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులు, చంద్రబాబుకి సన్నిహితంగా ఉండే దామచర్ల సత్యతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేయగా.. అవి ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి!