Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రాలో వైసీపీ: గ్రౌండ్ రియాలిటీ ఇదేనా...?

ఈసారి కూడా అన్ని సీట్లు గెలుచుకోవాలని వైసీపీ తపన పడుతోంది. అంతే కాదు గత ఎన్నికల్లో టీడీపీకి వదిలేసిన ఆరు సీట్లను తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది.

By:  Tupaki Desk   |   9 Sept 2023 8:45 AM IST
ఉత్తరాంధ్రాలో వైసీపీ: గ్రౌండ్ రియాలిటీ ఇదేనా...?
X

వైసీపీకి ఉత్తరాంధ్రా కంచుకోటగా మారి 2019 ఎన్నికల్లో ఏకంగా 34 అసెంబ్లీ సీట్లకు 28 సీట్లు ఇచ్చింది. ఇక అయిదు ఎంపీ సీట్లలో నాలుగు ఫ్యాన్ పార్టీ పరం అయ్యాయి. అయితే అదే మ్యాజిక్ 2024లో కూడా రిపీట్ అవుతుందా అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు. ఈసారి కూడా అన్ని సీట్లు గెలుచుకోవాలని వైసీపీ తపన పడుతోంది. అంతే కాదు గత ఎన్నికల్లో టీడీపీకి వదిలేసిన ఆరు సీట్లను తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. టోటల్ గా వైనాట్ 34 సీట్స్ అంటోంది.

అయితే గ్రౌండ్ రియాల్టీస్ చూస్తే వైసీపీకి కొరుకుడు పడని విధంగానే ఉన్నాయని అంటున్నారు. మొత్తం మూడు ఉమ్మడి జిల్లాలో ఒక జిల్లాలోనే ఈ రోజుకు వైసీపీకి ఆశాజనకంగా పరిస్థితి ఉందని అంటున్నారు ఆ జిల్లా విజయనగరంగా చెబుతున్నారు. ఈ జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉంటే 2019లో అన్నీ గెలిచేసి మరీ వైసీపీ క్లీన్ స్వీప్ చేసి పారేసింది. అయితే ఈసారి తొమ్మిదికి తొమ్మిదీ రావు. కానీ మెజారిటీ సీట్లు మాత్రం వైసీపీ ఖాతాలో పడడం ఖాయమని అంటున్నారు.

బొబ్బిలి, విజయనగరం, ఎస్ కోట వంటివి ఈసారి టీడీపీకి కలసిరావచ్చు అని కూడా అంటున్నారు. ఇక వైసీపీ ప్రాణప్రదంగా భావించే ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో రూరల్, ఏజెన్సీ సీట్లను 11 కలుపుకుని 2019లో వైసీపీ గెలుచుకుంది. విశాఖ సిటీలోని నాలుగు సీట్లు టీడీపీ పరం అయ్యాయి. ఇపుడు చూస్తే రూరల్ జిల్లాలో కూడా సీన్ కొంత మారుతుంది అని అంటున్నారు.

చోడవరం, నర్శీపట్నం, ఎలమంచిలి, పాయకరావుపేట టీడీపీతో హోరాహోరీ తప్పదని అంటున్నారు. మాడుగుల, అనకాపల్లి, చోడవరంలలో వైసీపీకి కలసి వస్తుంది అంటున్నారు. ఇక ఏజెన్సీలోని రెండు సీట్లు పాడేరు, అరకు మరోసారి వైసీపీ గెలుస్తుంది అని అంటున్నారు. విశాఖ సిటీలోకి వస్తే విశాఖ సౌత్ లో టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు. దాంతో ఈ సీటు వైసీపీ ఖాతాలో పడవచ్చు అంటున్నారు.

ఇక నార్త్ సీటు చూసుకుంటే సామాజికసమీకరణల బట్టి ఈ సీటులో వైసీపీ గెలుపు ఆధారపడి ఉంది అంటున్నారు. ఇక్కడ కేకే రాజుకు టికెట్ ఖాయమని అంటున్నారు. కానీ కాపుల ప్రాబల్యం అధికంగా ఉన్న నేపధ్యంలో టీడీపీ క్యాండిడేట్ ని బట్టి వైసీపీ కూడా మారిస్తే గెలుపు అవకాశాలు పెరగవచ్చు అంటున్నారు. విశాఖ పశ్చిమ, విశాఖ తూర్పులలో టీడీపీ బలంగా ఉంది. అదే విధంగా గాజువాక, భీమిలీలలో కూడా టీడీపీ తో పాటు జనసేన కూడా గట్టిగా ఉన్నాయి. పెందుర్తి సీటులో వైసీపీ టీడీపీల మధ్య హోరాహోరీ పోరు సాగడం తధ్యమని అంటున్నారు.

శ్రీకాకుళం విషయానికి వస్తే గత ఎన్నికలలో మొత్తం 10 సీట్లకు గానూ 8 గెలుచుకుంది. ఈసారి టీడీపీ సీట్లు బాగా పెరుగుతాయని అంటున్నారు. టెక్కలిలో మరోమారు అచ్చెన్నాయుడు గెలుపు ఖాయం అంటున్నారు. ఇచ్చాపురంలో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ కే టికెట్ కన్ ఫర్మ్ చేశారు. వైసీపీ నుంచి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ విజయకు అంటున్నారు. ఇక్కడ వర్గ పోరు బాగా ఉంది. అంతా కలసి పోటీకి దిగితే టీడీపీతో గట్టిగా తలపడవచ్చు.

ఇదే రకమైన పరిస్థితి పాతపట్నంలో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మీద సొంత పార్టీ వారే యాంటీగా ఉన్నారు. అయితే ఆమెను తప్పిస్తే కొత్త క్యాండిడేట్ ఎవరు అన్న దాని మీదనే విజయం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నుంచి 2014, 2019లలో రెండు సార్లు వైసీపీ గెలిచింది. బలమైన సీటు. నరసన్నపేటలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ కి ఈ రోజుకు ఓకేగా ఉంది. కానీ ఎంపీ రామ్మోహన్ నాయుడు బరిలోకి దిగితే టఫ్ ఫైట్ ఖాయమని అంటున్నారు.

ఆముదాలవలసలో టీడీపీ జోరు ఎక్కువగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే స్పీకర్ తమ్మినేని సీతారాం మీద సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. సో ఇక్కడ టీడీపీకే గెలుపు చాన్స్ ఉంది అంటున్నారు. శ్రీకాకుళం సీటులో మంత్రి ధర్మాన ప్రసాదరావుకి ఈసారి హోరా హోరీ పోరు తప్పదని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవికే టికెట్ ఇస్తే మాత్రం గెలుపు ఎవరిది అన్నది చెప్పడం కష్టమవుతుంది అంటున్నారు.

పాలకొండలో టీడీపీ వర్గ పోరు వైసీపీకి కలసివచ్చే అంశగా ఉంది. రాజాంలో చూస్తే వైసీపీ ఎమ్మెల్యే కంబాల జోగులుకే టికెట్ ఇస్తే ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయబోయే మాజీ మంత్రి కోండ్రు మురళీమోహనరావుకు గెలుపు అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు.

ఎచ్చెర్ల వైసీపీలో వర్గ పోరు తారస్థాయిలో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కి టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీకి ఇబ్బందులే అంటున్నారు. అదృష్టం ఏంటి అంటే ఇక్కడ టీడీపీలోనూ కళా కలిశెట్టి వర్గాల మధ్య పోరు ఉండడం. టోటల్ గా చూస్తే శ్రీకాకుళంలో టీడీపీ బలం పెరిగింది. వైసీపీ వర్గపోరు కూడా తారస్థాయిలో ఉండడం వల్ల ఈసారి ఈ రెండు పార్టీల మధ్య పది సీట్లలో మెజారిటీ ఎవరికి అన్నది వేచి చూడాల్సిందే మరి.