Begin typing your search above and press return to search.

వైసీపీ.. గుండెపోటుల డ్రామా ఆపండమ్మా!

అయితే ఇంత జరిగినా ఎక్కడ లోపాలు జరిగాయో తెలుసుకోకుండా.. మళ్లీ మళ్లీ వైసీపీ తప్పులు చేస్తుండటంపై ప్రజల్లో ఆ పార్టీ పట్ల ఏహ్య భావం వ్యక్తమవుతోందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   8 Jun 2024 3:00 AM GMT
వైసీపీ.. గుండెపోటుల డ్రామా ఆపండమ్మా!
X

ఆంధ్రప్రదేశ్‌ లో 175కి 175 సీట్లు గెలుస్తామంటూ ప్రగల్భాలు పలికిన వైసీపీ నేతలకు ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారు. కేవలం 11 సీట్లకే పరిమితం చేసి ఏపీ చరిత్రలో ఏ అధికార పార్టీకి రానంత దారుణ ఓటమిని కట్టబెట్టారు. అయితే ఇంత జరిగినా ఎక్కడ లోపాలు జరిగాయో తెలుసుకోకుండా.. మళ్లీ మళ్లీ వైసీపీ తప్పులు చేస్తుండటంపై ప్రజల్లో ఆ పార్టీ పట్ల ఏహ్య భావం వ్యక్తమవుతోందని అంటున్నారు.

తాజా ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో దాన్ని తట్టుకోలేక గుండెపోటుతో, ఆత్మహత్యలు చేసుకుని చాలామంది మరణించారంటూ వైసీపీ సోషల్‌ మీడియా, సాక్షి పత్రిక, సాక్షి టీవీ చానెల్‌ కథనాలు మొదలుపెట్టడంపై విమర్శలు, సెటైర్లు పడుతున్నాయి. అయితే జగన్‌ మళ్లీ వీరిని ఓదార్చడానికి ఓదార్పు యాత్ర ఏమైనా మొదలు పెడతారా అని సెటైర్లు పేలుస్తున్నారు.

2011లో ౖÐð సీపీ ఆవిర్భావం కూడా ఇలాగే జరిగిందని గుర్తు చేస్తున్నారు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి మృతిని తట్టుకోలేక వందలాది మంది గుండె ఆగి మరణించారంటూ నిత్యం సాక్షి పత్రిక, టీవీలో ప్రచురించేవారని గుర్తు చేస్తున్నారు. వీరిని ఇళ్లకు వెళ్లి మరణించిన వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తానని జగన్‌ నిర్ణయించుకున్నారు. అయితే ఇందుకు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం అంగీకరించలేదు. మృతుల కుటుంబ సభ్యుల అందరినీ ఒకచోటకు పిలిచి పరామర్శిస్తే సరిపోతుందని జగన్‌ కు సూచించింది.

అయితే జగన్‌ ఇందుకు ఒప్పుకోలేదు. ఓదార్పు యాత్ర చేస్తానని తేల్చిచెప్పారు. దీనికి కాంగ్రెస్‌ అధిష్టానం ఒప్పుకోకపోవడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. తన తండ్రి పేరుతో 2011లో వైసీపీని ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓదార్పు యాత్ర పేరుతో మృతుల కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు.

అయితే సహజసిద్ధంగా, వివిధ ప్రమాదాల్లో మృతిచెందినవారిని కూడా వైఎస్సార్‌ మృతిని తట్టుకోలేక మరణించిన వారి ఖాతాల్లో కలిపారనే విమర్శలు వచ్చాయి. అలాగే ఓదార్పు యాత్ర పేరుతో పెద్ద ఎత్తున దండయాత్ర మాదిరి భారీ కాన్వాయ్, నాయకులతో జగన్‌ యాత్ర చేపట్టారని విమర్శలు వెల్లువెత్తాయి.

ఏదేమైనా ఓదార్పు యాత్ర జగన్‌ కు మంచి మైలేజీని తెచ్చిపెట్టింది. రాష్ట్ర స్థాయిలో ఆయన నాయకుడిగా నిలదొక్కుకోవడానికి ఓదార్పు యాత్ర బాటలు పరిచింది. ఇప్పుడు మరోసారి జగన్‌ ఇదే నమ్ముకున్నారని టాక్‌ నడుస్తోంది.

తాజా ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని తట్టుకోలేక వందలాది మంది గుండెలు ఆగి మరణించారని, మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని వైసీపీ సోషల్‌ మీడియా ప్రచారం మొదలుపెట్టిందని అంటున్నారు.

దీనిపై నెట్టింట విమర్శలు కురుస్తున్నాయి. ఎన్నికలన్న తర్వాత గెలుపు ఓటములు సహజమని.. ఎందుకు ఓడిపోయామో ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇంకా గుండెలు ఆగి మరణించారంటూ సిల్లీ రాజకీయాలు చేయడం సరికాదని అంటున్నారు. ఇలాంటి డ్రామాలను దశాబ్దం కాలంపైగానే చూస్తున్నామని సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి సానుభూతి డ్రామాలు ఆపితే మంచిదని సూచిస్తున్నారు. భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేసినా.. జగన్‌ చెప్పినట్టు నేరుగా రూ.2.70 లక్షల కోట్లను ప్రజల్లో ఖాతాల్లో వేసినా ఇంత చిత్తుగా ఓడిపోవడానికి కారణాలు ఏమిటో నిశిత పరిశీలన చేసుకోవాలని అంటున్నారు. అలా కాకుండా అరిగిపోయిన గ్రామ ఫోన్‌ రికార్డులాగా ఈ గుండెపోటు కథలు, సానుభూతి డ్రామాలు ఆపాలని సూచిస్తున్నారు.